హార్ట్ ఎటాక్, స్ట్రోక్‌కు ప్రధాన కారణాలు ఇవే.. తప్పక తెలుసుకోండి

Published by: Geddam Vijaya Madhuri

అధిక రక్తపోటు వల్ల రక్తనాళాలపై ఒత్తిడి పెరిగి.. హార్ట్ ఎటాక్, స్ట్రోక్ ప్రమాదం ఎక్కువవుతుంది.

చెడు కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకుని.. రక్తప్రసరణను అడ్డుకుంటుంది. దీంతో గుండెకు ప్రమాదం పెరుగుతుంది.

షుగర్ స్థాయిలు ఎక్కువగా ఉంటే రక్తనాళాలు దెబ్బతిని.. గుండె సంబంధిత వ్యాధుల రిస్క్ పెరుగుతుంది.

సిగరెట్‌లోని హానికర పదార్థాలు రక్తనాళాలను కుంచించేసి.. గుండె పనితీరును దెబ్బతీస్తాయి.

ఊబకాయం వల్ల గుండెపై అదనపు ఒత్తిడి పడుతుంది. దీనివల్ల బీపీ, డయాబెటిస్ సమస్యలు కూడా వస్తాయి.

శారీరక శ్రమ లేకపోతే రక్తప్రసరణ సరిగా జరగదు. గుండె బలహీనపడే ప్రమాదం ఉంటుంది.

జంక్ ఫుడ్, వేయించిన పదార్థాలు, ఎక్కువ ఉప్పు, షుగర్ ఉన్న ఫుడ్స్ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

మానసిక ఒత్తిడి ఎక్కువైతే బీపీ పెరిగి.. హార్ట్ ఎటాక్, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది.

ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె స్పందనలో మార్పులు వచ్చి.. రక్తపోటు పెరుగుతుంది.

సరిగా నిద్రపోకపోతే శరీరంపై ఒత్తిడి పెరిగి.. గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువవుతాయి.