అన్వేషించండి

Mamidikai Karam Recipe : సమ్మర్ స్పెషల్ మామిడి కారం.. చాలా సింపుల్​గా చేసుకోగలిగే నోరూరించే రెసిపీ

Mamidikai Karam : మామిడికాయ టేస్ట్​ని ఎక్కువరోజులు ఎంజాయ్ చేయాలనుకుంటే మామిడికాయ కారం బెస్ట్ ఆప్షన్. మరి దీనిని ఎలా టేస్టీగా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

Andhra Special Tasty Mamidikai Karam Recipe : మామిడికాయతో పచ్చళ్లు, జ్యూస్​లు, వివిధ రకాల వంటలు చేసుకుంటారు. అలాంటి వాటిలో మామిడికారం ఒకటి. ఎక్కువ కాలం మామిడి రుచిని ఆస్వాదించాలనుకునేవారు దీనిని చేసుకుంటారు. ముఖ్యంగా ఆంధ్రాలో వివిధ కారాలు, పొడులు చేసుకుని అన్నం, దోశలతో ఆస్వాదిస్తూ ఉంటారు. అలా నోరూరించే రుచికోసం చేసుకునే పొడుల్లో మామిడి కారం కూడా ఒకటి. మరి దీనిని ఎలా చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

కావాల్సిన పదార్థాలు

మామిడి కాయలు - 5

ఉప్పు - రుచికి తగినంత 

పసుపు - 1 టీస్పూన్

శనగపప్పు - 2 టీస్పూన్లు

మినపప్పు - 2 టీస్పూన్లు

జీలకర్ర - 1 టీస్పూన్

ఎండుమిర్చి - 15 నుంచి 20

ధనియాలు - 1 టేబుల్ స్పూన్

వెల్లుల్లి - 5 రెబ్బలు

తయారీ విధానం

ముందుగా మామిడికాయలను బాగా కడిగి ఆరబెట్టి.. పైన తొక్క తీసేయాలి. అనంతరం వాటిని మాగాయ ముక్కలుగా పొడుగ్గా కోసుకోవాలి. వీటిన్నంటినీ ఓ ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. అయితే వీటిని స్టీల్ బాక్స్​లో పెట్టుకోకూడదు. ఎందుకంటే సాల్ట్ స్టీల్​ని తినేస్తుంది. కాబట్టి జాడీలు లేదా ప్లాస్టిక్ బాక్స్​లో కలుపుకోవాలి. ఇలా కలిపిన ముక్కలను మూడు రోజులు మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. 

మగ్గిన ముక్కల్లో నీరు వస్తుంది. కాబట్టి ముక్కలను గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి. లేదా కాటన్ క్లాత్​లో చుట్టి నీరు మొత్తం పోయేలా చూసుకోవాలి. ఇప్పుడు వాటిని మంచిగా ఎండలో ఆరబెట్టుకోవాలి. మీరు కావాలనుకుంటే మామిడి ముక్కల నుంచి తీసిన నీటిని చారుగా చేసుకోవచ్చు. లేదా డైలీ షాట్స్​గా కూడా తాగవచ్చు. ఓ మూడు, నాలుగు రోజులు ఎండలో పెడితే వాటిలోని పచ్చి పోయి ఒరుగు సిద్ధమవుతుంది. 

మామిడి ముక్కలు బాగా ఎండిన తర్వాత మామిడి కారం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. స్టౌవ్ వెలిగించి కడాయి పెట్టి దానిలో నూనె వేసుకోవాలి. శనగ పప్పు, మినపప్పు వేసి వేయించుకోవాలి. జీలకర్ర వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఎండమిర్చి కూడా వేరుగా వేయించుకోవాలి. ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు కూడా ఫ్రై చేసుకోవాలి. 

ముందుగా ఎండబెట్టిన మామిడి ముక్కలను జార్​లో వేసి మెత్తగా పొడిగా చేసుకోవాలి. దాని తర్వాత వేయించుకున్న దినుసులు కూడా వేసి పొడిగా చేసుకోవాలి. దానిలో రుచికి తగినంత ఉప్పు వేసుకుని మరోసారి కలుపుకోవాలి. అంతే నోరూరించే మామిడికాయ కారం రెసిపీ రెడీ. దీనిని వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఎక్కువ కాలం మామిడి రుచిని ఆస్వాదించాలనుకునేవారు పచ్చళ్ల రూపంలో కాకుండా ఈ రెసిపీ కూడా ట్రై చేయవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ మ్యాంగో పౌడర్ ఇంట్లోనే సిద్ధం చేసేసుకోండి. 

మరిన్ని టేస్టీ, నోరూరించే రెసిపీల కోసం దీనిని క్లిక్ చేయండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Yoga Poses for Weight Loss : బరువు తగ్గాలన్నా.. పొట్టను తగ్గించుకోవాలన్నా.. ఈ ఎఫెక్టివ్ 7 యోగాసనాలు వేసేయండి
బరువు తగ్గాలన్నా.. పొట్టను తగ్గించుకోవాలన్నా.. ఈ ఎఫెక్టివ్ 7 యోగాసనాలు వేసేయండి
Banana Hair Mask : అరటిపండు హెయిర్ మాస్క్ తయారీ.. అప్లై చేస్తే జుట్టుకు కలిగే లాభాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
అరటిపండు హెయిర్ మాస్క్ తయారీ.. అప్లై చేస్తే జుట్టుకు కలిగే లాభాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
AI and Healthcare : ఆస్పత్రుల్లో AI వినియోగం పెరిగితే వైద్యులపై పనిభారం తగ్గొచ్చు.. కానీ రోగులకు మంచిదా? కాదా? రద్దీ పెరుగుతుందా?
ఆస్పత్రుల్లో AI వినియోగం పెరిగితే వైద్యులపై పనిభారం తగ్గొచ్చు.. కానీ రోగులకు మంచిదా? కాదా? రద్దీ పెరుగుతుందా?
Gas and Bloating : గ్యాస్, బ్లోటింగ్‌ను తగ్గించే సహజమైన ఫుడ్స్ ఇవే.. జీర్ణక్రియ మెరుగుపడాలంటే ఇవి తినేయండి
గ్యాస్, బ్లోటింగ్‌ను తగ్గించే సహజమైన ఫుడ్స్ ఇవే.. జీర్ణక్రియ మెరుగుపడాలంటే ఇవి తినేయండి
Advertisement

వీడియోలు

Arshdeep Angry Gill For Gurbaz Wicket | రివ్యూతీసుకోకపోవడంతో గుర్బాజ్ సెంచరీ
Gurnoor Brar Debut vs Afghanistan | ఇంటర్నేషనల్ క్రికెట్‌లో గుర్నూర్ సంచలన డెబ్యూ
IND vs AFG 1st ODI Highlights | అఫ్గాన్‌పై టీమిండియా ఘన విజయం
Shubman Gill Slip Catch vs Afghanistan | రోహిత్ రనౌట్‌పై గిల్ షాకింగ్ కామెంట్స్
Rohit Sharma Breaks 37-Year-Old Record | 39 ఏళ్ల వయసులో హిట్ మ్యాన్ అరుదైన రికార్డు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kavitha Singareni Visit: సింగరేణిలో కవిత బొగ్గుబాయి యాత్ర.. రూ. 50 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్
సింగరేణిలో కవిత బొగ్గుబాయి యాత్ర.. రూ. 50 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్
Robbery In Circar Express: బాపట్ల వద్ద సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం.. పారిపోతున్న దొంగలపై రైల్వే పోలీసుల కాల్పులు
బాపట్ల వద్ద సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం.. దొంగలపై రైల్వే పోలీసుల కాల్పులు
Chandrababu Naidu Importance In NDA: ఎన్డీఏకు తృణమూల్ చీలిక వర్గం మద్దతు - చంద్రబాబు కింగ్ మేకర్ పోస్టు పోయిందా?
ఎన్డీఏకు తృణమూల్ చీలిక వర్గం మద్దతు - చంద్రబాబు కింగ్ మేకర్ పోస్టు పోయిందా?
Delimitation Bill 2026: ప్రధాని ఆర్థిక సలహా మండలి చేసిన డీలిమిటేషన్ సిఫార్సులతో కలకలం - దక్షిణాది రాష్ట్రాలు ఆమోదిస్తాయా?
ప్రధాని ఆర్థిక సలహా మండలి చేసిన డీలిమిటేషన్ సిఫార్సులతో కలకలం - దక్షిణాది రాష్ట్రాలు ఆమోదిస్తాయా?
E20 Vs E85 ఫ్యూయల్ - ఏది ఎక్కువ మైలేజ్ ఇస్తుంది? ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ టెస్ట్‌లో తేలిన నిజం
E85 పెట్రోల్ నిజంగా చౌకేనా? మైలేజ్ టెస్ట్‌లో షాకింగ్ ఫలితాలు!
Hyderabad News : సినిమా ఛాన్సెస్ ఇప్పిస్తానని అసభ్య ప్రవర్తన - వ్యకిపై సినీ నటి కంప్లైంట్
సినిమా ఛాన్సెస్ ఇప్పిస్తానని అసభ్య ప్రవర్తన - వ్యకిపై సినీ నటి కంప్లైంట్
Nivetha Pethuraj : ఛాన్స్ ఇవ్వకుంటే హిమాలయాలకు వెళ్లిపోయేదాన్ని - హీరోయిన్ నివేదా కామెంట్స్
ఛాన్స్ ఇవ్వకుంటే హిమాలయాలకు వెళ్లిపోయేదాన్ని - హీరోయిన్ నివేదా కామెంట్స్
Deepti Sharma Milestone: దీప్తి స్పిన్ మ్యాజిక్: హిస్టారికల్ 350 వికెట్ల క్లబ్‌లోకి ఎంట్రీ! దాయాదిపై ఫైవ్ వికెట్ హాల్
దీప్తి స్పిన్ మ్యాజిక్: హిస్టారికల్ 350 వికెట్ల క్లబ్‌లోకి ఎంట్రీ! దాయాదిపై ఫైవ్ వికెట్ హాల్
Embed widget