అన్వేషించండి

Mango Kheer Recipe : సమ్మర్ స్పెషల్ నోరూరించే మ్యాంగో ఖీర్ రెసిపీ.. మామిడి పండుతో ఈ టేస్టీ వంటకం ట్రై చేసేయండి

Summer Special Mango Kheer : మామిడి పండుతో టేస్టీగా ఏమైనా వంటకం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మ్యాంగో ఖీర్ ట్రై చేయండి. పంచదార లేకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మామిడి పండ్లతో పంచదార లేకుండా రుచికరమైన ఖీర్ చేయవచ్చు.
  • పాలను చిక్కబడే వరకు మరిగించి, కుంకుమపువ్వు, యాలకుల పొడి కలపాలి.
  • పాలు చల్లారిన తర్వాత మామిడి గుజ్జు, డ్రై ఫ్రూట్స్ కలిపి చల్లార్చాలి.
  • ఈ పంచదార లేని మామిడి ఖీర్ అందరూ ఇష్టంగా తింటారు.

Sugar-Free Mango Kheer : మామిడి పండును చాలామంది ఇష్టంగా తింటారు. దీనితో చేసిన వంటకాలు కూడా చాలా ఇష్టపడతారు. దాదాపు మ్యాంగోలతో షేక్స్, ఐస్ క్రీమ్, స్మూతీలు, స్వీట్స్ వంటి అనేక రకాల వంటకాలు తయారు చేస్తారు. కానీ వీటన్నింటిలో మామిడి ఖీర్ బెస్ట్ అని చెప్పవచ్చు. దీని రుచి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అయితే ఖీర్ అనగానే పంచదార వేస్తారేమో అనుకుంటారు కానీ.. పంచదార లేకుండా మ్యాంగో ఖీర్ టేస్టీగా ఎలా చేయవచ్చో ఇప్పుడు చూసేద్దాం. 

మామిడి పండు తీపి.. పాల క్రీము లాంటి చిక్కదనం, డ్రై ఫ్రూట్స్​ గుణాలతో కలగలిసే వంట తినాలనుకుంటే మ్యాంగో ఖీర్ బెస్ట్. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. సిరప్ లేదా చక్కెర పాకం లేకుండానే ఇంట్లోనే రుచికరమైన ఖీర్ చేసుకోవచ్చు. మరి దీనికోసం కావాల్సిన పదార్థాలు ఏమిటో.. తయారీ విధానం ఏమిటో చూసేద్దాం. 

కావాల్సిన పదార్థాలు

పాలు

కుంకుమ పువ్వు

యాలకుల పొడి

మామిడి పండ్లు (తియ్యనివి)

డ్రై ఫ్రూట్స్

తయారీ విధానం.. 

మామిడి ఖీర్ తయారు చేయడానికి ముందుగా మందపాటి అడుగు ఉన్న పాత్రలో పాలు మరిగించండి. తక్కువ మంట మీద పాలు కాగనిస్తూ.. క్రమంగా చిక్కబడే వరకు ఉడికించండి. పాలు సగానికి తగ్గి.. మీగడలాంటి చిక్కదనం వచ్చినప్పుడు అది దాదాపుగా సిద్ధమైనట్లే. ఇప్పుడు చిక్కబడిన పాలలో పంచదారకు బదులుగా కుంకుమపువ్వు, యాలకుల పొడి వేయండి. కుంకుమపువ్వు రంగు, సువాసన రెండింటినీ ఇస్తుంది. యాలకులు ఖీర్‌కు ఒక ప్రత్యేకమైన రుచిని అందిస్తుంది.

సుమారు మరో 5 నిమిషాలు ఉడికించి.. ఆ తర్వాత స్టౌవ్ ఆపేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఎందుకంటే వేడి పాల మిశ్రమంలో మామిడి పండు కలిపితే పాలు విరిగిపోయి ఖీర్ పాడైపోవచ్చు. అందువల్ల, దానిని గది ఉష్ణోగ్రతకు చల్లారనివ్వాలి. ఇప్పుడు బాగా పండిన, తియ్యని మామిడి పండ్లను తీసుకుని.. మెత్తని గుజ్జు అయ్యేలా మిక్సర్‌లో గ్రైండ్ చేసుకోవాలి. పాలు పూర్తిగా చల్లారిన తర్వాత.. మామిడి గుజ్జును వేసి బాగా కలపండి. పాలు, మామిడి గుజ్జు కలిసేలా మెల్లగా గిలకొట్టండి. దీనివల్ల మృదువైన, క్రీములాంటి మిశ్రమం ఏర్పడుతుంది.

మీకు ఇష్టమైతే ఖీర్ రుచిని మరింత పెంచడానికి మామిడిని చిన్న ముక్కలుగా చేసి దానిలో కలపవచ్చు. చివరిగా తరిగిన బాదం, జీడిపప్పు, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ కలపండి. ఆ తర్వాత ఖీర్‌ను 2-3 గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టండి. అది పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేయండి. అంతే టేస్టీ టేస్టీ మ్యాంగో ఖీర్ రెడీ. దీనిని పిల్లల నుంచి పెద్దలవరకు అందరూ ఇష్టంగా తినవచ్చు. అలాగే పంచదార వద్దు అనుకున్నవాళ్లు కూడా హాయిగా దీనిని ఆస్వాదించవచ్చు. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Overthinking : అతిగా ఆలోచించి సతమతమవుతున్నారా? ఓవర్‌థింకింగ్‌ను తగ్గించే 3 సులభమైన మార్గాలు ఇవే
అతిగా ఆలోచించి సతమతమవుతున్నారా? ఓవర్‌థింకింగ్‌ను తగ్గించే 3 సులభమైన మార్గాలు ఇవే
Post-Flood Home Cleaning : వరద నీరు తగ్గిన తర్వాత ఇంటిని ఎలా శుభ్రం చేయాలి? తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే
వరద నీరు తగ్గిన తర్వాత ఇంటిని ఎలా శుభ్రం చేయాలి? తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే
Monsoon Driving Guide : వర్షంలో కారు, బైక్‌పై ఆఫీసుకు వెళ్తున్నారా? ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు తప్పుతాయి
వర్షంలో కారు, బైక్‌పై ఆఫీసుకు వెళ్తున్నారా? ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు తప్పుతాయి
Healthy Night Routine : మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
US Iran War: ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Commonwealth Games 2026: CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
Embed widget