అన్వేషించండి

TDP Internal Politics: ఎమ్మెల్యేల గుండెల్లో చంద్రబాబు ర్యాంకుల వణుకు - తప్పు చేస్తే వేదికలపైనే క్లాస్ .. కావలి ఘటనతో మారిన పొలిటికల్ సీన్

MLA Performance Report: టీడీపీలో ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. అదే చంద్రబాబు రిపోర్ట్ కార్డ్ . చంద్రబాబు నాయుడు తన సొంత పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై బహిరంగంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Chandrababu Stern Warning To TDP Mlas:   ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  వెర్షన్ 4.0 పరిపాలనలో మునుపటి కంటే చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. గతంలో తప్పు చేసిన ఎమ్మెల్యేలను పిలిచి సున్నితంగా మందలించే చంద్రబాబు, ఇప్పుడు ప్రజా సమక్షంలోనే వారి రిపోర్ట్ కార్డులను బయటపెడుతూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలి పర్యటనలో జరిగిన ఘటన ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.   కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి   విషయంలో బాబు వ్యవహరించిన తీరు, మిగిలిన 174 నియోజకవర్గాల నేతలకు ఒక గట్టి హెచ్చరికలా మారింది. 107వ ర్యాంకు అంటూ ప్రజల ముందే లెక్కలు తేల్చడంతో తమ్ముళ్లలో వణుకు మొదలైంది.

 డేటా ఆధారిత హెచ్చరికలు 

చంద్రబాబు ఈసారి గాలిలో విమర్శలు చేయడం లేదు. ఐటీ, రియల్ టైమ్ గవర్నెన్స్ విభాగాల ద్వారా ప్రతి నియోజకవర్గంలో 51 ప్రభుత్వ శాఖల పనితీరును ఆయన నిశితంగా గమనిస్తున్నారు. కావలిలో 13 కీలక శాఖలు వెనుకబడి ఉన్నాయని, ఎమ్మెల్యే గ్రాఫ్ పడిపోతోందని టెక్నికల్ డేటాతో సహా నిలదీశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేల పనితీరును బేరీజు వేస్తే కృష్ణారెడ్డి 107వ స్థానంలో ఉన్నారని చెప్పడం ద్వారా.. తాను ప్రతి నిమిషం ఎవరి రికార్డును ఎలా ట్రాక్ చేస్తున్నారో స్పష్టం చేశారు. సాధారణంగా ఇలాంటి ర్యాంకులు, పనితీరుపై చంద్రబాబు పార్టీ అంతర్గత సమావేశాల్లో   క్లాస్ తీసుకుంటారు. కానీ కావలి సభలో వేలాది మంది ప్రజలు, ప్రత్యర్థులు చూస్తుండగానే ఎమ్మెల్యేకు చుక్కలు చూపించారు.  మారకపోతే ఊరుకోను అని వేదికపైనే హెచ్చరించారంటే, చంద్రబాబు ఏ స్థాయిలో అసహనంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం కృష్ణారెడ్డికి మాత్రమే కాదు, పనితీరు మెరుగుపరుచుకోని ప్రతి ఎమ్మెల్యేకు పంపిన  స్ట్రాంగ్ మెసేజ్ .

 గ్రూపు రాజకీయాలపై బాబు కన్ను! 

కావలిలో ఎమ్మెల్యే తీరుపై గతంలోనే పార్టీ క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా సీనియర్ నేతలతో కలుపుకుపోవడంలో విఫలమవ్వడం, వర్గ రాజకీయాలను ప్రోత్సహించడం వంటి అంశాలపై చంద్రబాబు సీరియస్ అయ్యారు.  అందరినీ కలుపుకుని పోవాల్సిందే అని ఆయన ఖచ్చితంగా చెప్పారు. సొంత ఇల్లు చక్కదిద్దుకోలేని వాడు నియోజకవర్గాన్ని ఏం పాలిస్తాడనే కోణంలో బాబు వ్యాఖ్యలు ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలు  ప్రభువులు  కాదు,  సేవకులు అని ఆయన మరోసారి గుర్తుచేశారు. 

 సినిమాటిక్  కాదు..  సిస్టమాటిక్ 

చంద్రబాబు తీరులో వచ్చిన ఈ మార్పు వెనుక ఒక వ్యూహం ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాల వల్లే ఆ పార్టీకి అధికారం పోయిందని బాబు బలంగా నమ్ముతున్నారు. అందుకే ఈసారి కూటమి ఎమ్మెల్యేలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. లీడర్లు మారకపోతే తానే ప్రత్యామ్నాయాలు చూసుకోవడానికి సిద్ధమనే సంకేతాన్ని కావలి వేదికగా స్పష్టం చేశారు. " మొత్తానికి చంద్రబాబు నాయుడు ప్రదర్శిస్తున్న ఈ కఠిన వైఖరి టీడీపీలో కొత్త క్రమశిక్షణను తీసుకువచ్చేలా కనిపిస్తోంది. ప్రజల ముందే ఎమ్మెల్యేలను నిలదీయడం ద్వారా ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుందన్నది బాబు ఆలోచన. అయితే, ఇది ప్రజాప్రతినిధుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉండకూడదనే వాదన కూడా వినిపిస్తోంది.  
 

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget