అన్వేషించండి

YSRCP: టీడీపీపై ఇప్పుడు ఆన్ లైన్ .. ఎన్నికలకు ముందు గ్రౌండ్ వార్ - వైఎస్ఆర్‌సీపీ పొలిటికల్ రీ బ్రాండింగ్ ప్లాన్!

YSRCP : వైసీపీ ప్రజాపోరాటాల్లో రీ బ్రాండింగ్ వ్యూహం అమలు చేస్తోంది. ప్రభుత్వంపై వ్యతిరేకతను ఓట్లుగా మల్చుకునేందుకు పెద్ద ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.

YSRCP online war:  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేనప్పటికీ, ప్రజల గొంతుకగా నిలిచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త  రీ-బ్రాండింగ్  వ్యూహంతో ముందుకు వెళ్తోంది. గత ఎన్నికల ఓటమిని విశ్లేషించుకున్న అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు పరిపాలనను కేవలం విమర్శించడమే కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవ్వడమే లక్ష్యంగా కొత్త కార్యాచరణను రూపొందించారు. 

టార్గెట్ అమరావతి                                    

రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రభుత్వం చూపిస్తున్న లెక్కలపై వైఎస్సార్‌సీపీ ఎదురుదాడి ప్రారంభించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి   సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. అమరావతి ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అనే ప్రభుత్వ వాదన పచ్చి అబద్ధమని ధ్వజమెత్తారు. ఎకరాకు రూ. 3.63 కోట్ల రిజిస్ట్రేషన్ విలువ ఉన్న భూమిని రూ. 50 కోట్లుగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, సచివాలయ భవనాలకు చదరపు అడుగుకు రూ. 20 వేలకు పైగా ఖర్చు చేయడం భారీ కుంభకోణానికి నిదర్శనమని ఆయన ఆరోపించారు. ఈ  అవినీతి  ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాలని పార్టీ భావిస్తోంది.

సోషల్ మీడియాపై ఎక్కువ దృష్టి                              

గత వైఎస్సార్‌సీపీ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు ఇప్పుడు నీరుగారిపోతున్నాయనే అంశాన్ని జగన్ తన ప్రధాన అస్త్రంగా మార్చుకున్నారు.  వచ్చే ఎన్నికల నాటికి యువతను, సోషల్ మీడియా జనరేషన్‌ను ఆకట్టుకోవడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ తన డిజిటల్ విభాగాన్ని ప్రక్షాళన చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా YSRCP Social Media 2026  పేరిట రిజిస్ట్రేషన్ డ్రైవ్ చేపట్టి, ప్రతి నియోజకవర్గంలో చురుకైన కార్యకర్తలను ఎంపిక చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను నిరంతరం ఎండగట్టడం, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని పోల్చి చూపడం ద్వారా  డిజిటల్ పోరాటం సాగించాలని జగన్ తన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

 పాదయాత్ర దిశగా జగన్.. మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి!                    

అసెంబ్లీలో బలం తక్కువగా ఉన్నా, ప్రజల్లో తనకున్న పట్టు తగ్గలేదని నిరూపించుకునేందుకు జగన్ మళ్ళీ  పాదయాత్ర కు సిద్ధమవుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయ్యాక, వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఏలూరు వంటి నియోజకవర్గాల నేతలతో వీక్లీ మీటింగ్స్ నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు.  ప్రస్తుతానికి వైఎస్సార్‌సీపీ అనుసరిస్తున్న ఈ  రీ-బ్రాండింగ్  వ్యూహం క్యాడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. అయితే, కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, ప్రజల సమస్యలపై నిలకడగా పోరాడటంపైనే పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను ఓట్లుగా మలచుకోవాలంటే, జగన్ తన వ్యూహాలను మరింత పకడ్బందీగా అమలు చేయాల్సి ఉంటుంది.          

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Embed widget