అన్వేషించండి

MAVIGUN News: మావిగన్‌పై అంతా గప్‌చుప్‌! అసలు రీజన్ ఇదే!

MAVIGUN News: మావిగన్ హీట్ చల్లబడింది. అటు విపక్షం ఇటు అధికార పక్షం దీనిపై మౌనవ్రతం పాటిస్తున్నాయి. అనవసర ప్రసారం ఎందుకని కూటమి, సమయం వచ్చినప్పుడు మాట్లాడదామని వైసీపీ చూస్తోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మావిగన్ పై నెల క్రితం సంచలనం, నేడు నేతల నోట మాయం.
  • ప్రచారం వద్దు, జనంలోకి వెళ్లకుండా కూటమి నిశ్శబ్దం.
  • అభివృద్ధి చెందే రాజధాని ఆలోచన, టీడీపీ గ్రహించింది.
  • వైసీపీకి స్పష్టత లేదు, జగన్ యాత్ర తర్వాత నిర్ణయం.

MAVIGUN News: ఏపీ రాజకీయాల్లో నెల క్రితం తీవ్ర సంచలన సృష్టించిన "మావిగన్ " అనే పదం ఒక్కసారిగా మాయమైంది. నేతల నోట రావడం మానేసింది. ఆ పదాన్ని ట్రోల్ చేస్తూ హడావిడి చేసిన కూటమి గాని, మావిగన్ పదాన్ని సపోర్ట్ చేస్తూ  వరుస ప్రెస్ మీట్‌లు పెట్టిన వైసీసీ గానీ మాట్లాడుకండా సైలెంట్ అయిపోయారు. ఏపీలో ఉన్న రాజకీయ పార్టీల్లో  మావిగన్‌పై ఇంతటి మార్పు ఎందుకు వచ్చిందని పరిశీలిస్తే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వస్తున్నాయ్. ప్రపోజల్ పెట్టిన జగన్ మోహన్ రెడ్డి గానీ  దానికి కౌంటర్ ఇస్తూ సెటైర్‌లు వేసిన కూటమి గానీ మావిగాన్‌పై పాటిస్తున్న మౌనంపై కారణాలు ఏంటో చూద్దాం.

మావిగన్ పై అనవసర పబ్లిసిటీ వద్దు అనుకుంటున్న కూటమి 

జగన్ నోటి వెంట మావిగన్ అనే పేరు వినగానే దాన్నో ట్రోల్ మెటీరియల్‌గా మార్చే ప్రయత్నం చేసింది కూటమి. ఆ పేరు కాస్త విచిత్రంగా ఉండడమే దానికి ప్రధాన కారణం. అయితే తాము చేసే ప్రచారం వల్ల మావిగన్‌కు తెలియకుండానే జనంలో పాపులారిటీ వచ్చే అవకాశం ఉండడంతో నెమ్మదిగా మాట్లాడటం తగ్గించేసింది కూటమి. జగన్ పై ఏ మాత్రం అవకాశం వచ్చినా విమర్శలు గుప్పించడానికి సిద్దపడే చంద్రబాబు, లోకేష్ సడన్‌గా మావిగన్‌పై  మాట్లాడటం తగ్గించేశారు. 

మావిగన్ పేరు వినడానికి విచిత్రంగా ఉన్నా దాని వెనుక జగన్ చెప్పిన లాజిక్‌ను జనాలకు చేరకుండా స్కెచ్ వేసింది. అమరావతిపై కోట్లు ఖర్చు పెట్టే బదులు ఆల్రెడీ డెవలప్ అవుతోన్న విజయవాడ, గుంటూరుకు మచిలీపట్నం కలిస్తే ఆటోమేటిక్ గా అభివృద్ధి చెందే రాజధాని వచ్చేస్తుందనే ఆలోచన వస్తే ప్రమాదమని టీడీపీ అధినాయకత్వం గ్రహించింది. ఎప్పుడైతే కూటమిని నడిపిస్తున్న టీడీపీ సైలెంట్ అయిందో కూటమిలోని జనసేన, బీజేపీ కూడా మావిగన్‌ ఊసెత్తడం లేదు.

మావిగన్‌పై మాట్లాడటానికి టైం ఉందని భావిస్తున్న వైసీపీ హై కమాండ్ 

'మావిగన్' ప్రస్థానం మొదటిగా తీసుకువచ్చి సంచలనం సృష్టించిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ పేరు ఎత్తడం లేదు. కనీసం ముందస్తు సూచన ఏదీ లేకుండా మావిగన్ అంశం తేవడంతో కన్ఫ్యూజ్ అయిన వైసీపీ కార్యకర్తలు కూడా ప్రస్తుతానికి పూర్తి క్లారిటీ లేక డిఫెన్స్ లో పడ్డారు. ఇక పార్టీ నేతలు, మాజీ మంత్రులదీ అదే దారి. మావిగన్ పేరు ఎత్తగానే "2019-24 మధ్యలో ఏం చేశారు?" అనే కౌంటర్ అధికార  పక్షం నుంచి వస్తోంది. దానికి వారివద్ద సరైన సమాధానం లేదు. 

Also Read: స్థానిక సంస్థలకు ఎన్నికల సెగ - వేసవి సెలవుల్లోనే పండగ పూర్తి చేసే యోచనలో ప్రభుత్వం?

మరో వైపు జగన్ మెహన్ రెడ్డి కూడా మావిగన్‌ను నెమ్మదిగా ప్రజల్లోకి తీసుకుని వెళ్దాం అనే ఆలోచనలో ఉన్నట్టు  తెలుస్తోంది. త్వరలోనే ఆయన మరో యాత్ర చేపట్టబోతున్నారు. ఆ సమయంలో రాజధాని పై ప్రజల స్పందన బట్టి మావిగన్‌పై ముందుకు వెళ్దామా వద్దా అనే నిర్ణయం తీసుకునే ఆలోచనలో జగన్ ఉన్నారు. అందుకే ప్రస్తుతానికి మావిగన్ పై వైసీపీ కూడా మొదట్లో ఉన్నంత దూకుడు చూపడం లేదు అనేది విశ్లేషకుల మాట. దానితో ఇటు విపక్షం, అటు అధికార పక్షం రెండూ మావిగన్ పై సైలెంట్ అయిపోయాయి.

Frequently Asked Questions

తాజాగా ఏపీ రాజకీయాల్లో 'మావిగన్' అనే పదం ఎందుకు మాయమైంది?

కూటమి, వైసీసీ రెండూ 'మావిగన్'పై మాట్లాడటం తగ్గించాయి. దీనికి అనవసర పబ్లిసిటీని నివారించడమే కారణమని తెలుస్తోంది.

కూటమి 'మావిగన్'పై ఎందుకు మౌనంగా ఉంది?

కూటమి 'మావిగన్'ను ట్రోల్ మెటీరియల్‌గా మార్చాలని చూసింది. కానీ, అది జనంలో పాపులర్ అవుతుందనే భయంతో మాట్లాడటం తగ్గించింది.

వైసీపీ 'మావిగన్'పై ఎందుకు అంత దూకుడు చూపడం లేదు?

జగన్ మోహన్ రెడ్డి 'మావిగన్'ను నెమ్మదిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. త్వరలో చేపట్టబోయే యాత్రలో ప్రజల స్పందన ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు.

'మావిగన్' వెనుక జగన్ ఆలోచన ఏమిటి?

అమరావతిపై ఖర్చు బదులు, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అభివృద్ధి ద్వారా సహజ రాజధానిని సృష్టించాలనేది జగన్ ఆలోచన.

టాప్ హెడ్ లైన్స్

TDP Janasena Social Media War: క్షేత్రస్థాయిలో పాలనలో సమన్వయం .. సోషల్ మీడియాలో సెల్ఫ్ గోల్ ! కూటమి సోషల్ వార్‌ను అరికట్టడం ఎలా?
క్షేత్రస్థాయిలో పాలనలో సమన్వయం .. సోషల్ మీడియాలో సెల్ఫ్ గోల్ ! కూటమి సోషల్ వార్‌ను అరికట్టడం ఎలా?
YSRCP MLA Disqualification Issue: అనర్హత వేటు వేసుకోండి .. వైసీపీ పొలిటికల్ ఆఫర్ వెనుక అసలు వ్యూహమేంటి? స్పీకర్ ఏం చేయబోతున్నారు?
అనర్హత వేటు వేసుకోండి .. వైసీపీ పొలిటికల్ ఆఫర్ వెనుక అసలు వ్యూహమేంటి? స్పీకర్ ఏం చేయబోతున్నారు?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Revanth Reddy Challenges KCR: సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget