అన్వేషించండి

AP Local Polls: స్థానిక సంస్థలకు ఎన్నికల సెగ - వేసవి సెలవుల్లోనే పండగ పూర్తి చేసే యోచనలో ప్రభుత్వం?

local elections: వేసవిలోనే స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. జూన్ మొదటి వారం కల్లా పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

AP local elections :  ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 13,100 గ్రామ పంచాయతీల్లో సర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం ముగియడంతో పాలన మొత్తం ప్రత్యేక అధికారుల చేతుల్లోకి వెళ్ళింది.   ప్రభుత్వం ఈ వేసవిలోనే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. 

వేసవిలో ఎన్నికల నిర్వహణకు అనుకూలం

 ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ రాజ్ వ్యవస్థ మళ్ళీ పట్టాలెక్కే సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం  ముగియడంతో, క్షేత్రస్థాయిలో పాలన స్తంభించకుండా ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. అయితే, గతంలో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి సుదీర్ఘకాలం అధికారుల పాలనను కొనసాగించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృఢ నిశ్చయంతో ఉన్నారు. వీలైనంత త్వరగా అంటే.. మే లేదా జూన్ నెలల్లోనే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

కసరత్తు పూర్తి చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం

సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో పాఠశాలలకు వేసవి సెలవులు ఉండటంతో, ప్రభుత్వ భవనాలు,   ఉపాధ్యాయుల సేవలను ఎన్నికల విధులకు వినియోగించుకోవడం సులభతరం అవుతుంది. ఇదే తరుణంలో ఎన్నికలు నిర్వహిస్తే అటు విద్యా సంవత్సరంపై ప్రభావం ఉండదని, ఇటు వర్షాకాలం మొదలవ్వకముందే కొత్త పాలకవర్గాలు కొలువు తీరుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం దీనిపై ప్రాథమిక కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.

కూటమితో సమన్వయానికి ప్రయత్నాలు

వార్డుల పునర్విభజన ,  రిజర్వేషన్ల ప్రక్రియ అత్యంత కీలకంగా మారింది. 2024 అసెంబ్లీ ఎన్నికల నాటి భారీ విజయం తర్వాత వస్తున్న ఈ స్థానిక ఎన్నికలను కూటమి పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. జనసేన, బీజేపీలతో కలిసి రిజర్వేషన్ల కేటాయింపులో ఎక్కడా వివాదాలు రాకుండా సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సాంకేతిక ప్రక్రియ మే నెలలో పూర్తి చేసి, జూన్ కల్లా పోలింగ్ నిర్వహించేలా కార్యాచరణ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

పోటీ చేసి.. క్యాడర్ లో ఉత్సాహం నింపాలనుకుంటున్న వైసీపీ 

ప్రతిపక్ష వైసీపీ కూడా ఈ ఎన్నికలపై గట్టి ఆశలే పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత తమ క్యాడర్‌లో మళ్ళీ ఉత్సాహాన్ని నింపాలంటే స్థానిక సంస్థల ఎన్నికలే సరైన వేదిక అని వైఎస్ జగన్ భావిస్తున్నారు. అయితే, అధికార పార్టీపై సానుకూలత ఉన్న సమయంలోనే ఎన్నికలకు వెళ్లడం ద్వారా మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలని టీడీపీ భావిస్తోంది. ఉపాధి హామీ నిధులు, గ్రామాలకు వచ్చే కేంద్ర నిధులను సక్రమంగా వినియోగించాలంటే ఎన్నికైన పాలకవర్గాలే ఉండాలన్నది కేంద్ర ప్రభుత్వ నిబంధన కూడా దీనికి ప్రధాన కారణం. 

వేసవిలో జరపకపోతే మరితం ఆలస్యం

 వేసవి సెలవుల లోపు నోటిఫికేషన్ విడుదల కాకపోతే, జూలైలో వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. అందుకే, సెక్షన్ 14 కింద ఉన్న అధికారాలను ఉపయోగించి, వీలైనంత వేగంగా ఓటర్ల జాబితాల సవరణ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.   

 

టాప్ హెడ్ లైన్స్

Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Chandrababu Naidu Narendra Modi Relation Strategy: మోదీపై చంద్రబాబు అంతులేని పొగడ్తలు - విమర్శలు వచ్చినా తగ్గేదే లే - అసలు కారణం ఇదేనా?
మోదీపై చంద్రబాబు అంతులేని పొగడ్తలు - విమర్శలు వచ్చినా తగ్గేదే లే - అసలు కారణం ఇదేనా?
Telangana Assembly Monsoon Session: అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కాళేశ్వరమే సెంటర్ టాపిక్ - కాంగ్రెస్ వ్యూహం.. బీఆర్ఎస్ ఎదుర్కొంటుందా?
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కాళేశ్వరమే సెంటర్ టాపిక్ - కాంగ్రెస్ వ్యూహం.. బీఆర్ఎస్ ఎదుర్కొంటుందా?
YSRCP Leaders Legal Troubles: వైఎస్సార్‌సీపీ నేతల వరుస కేసులు, ఆజ్ఞాతం - పొలిటికల్ స్ట్రాటజీనా? దూకుడు వికటించిందా?
వైఎస్సార్‌సీపీ నేతల వరుస కేసులు, ఆజ్ఞాతం - పొలిటికల్ స్ట్రాటజీనా? దూకుడు వికటించిందా?

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
New Fielding Coach: టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
Embed widget