అన్వేషించండి

Viral News: ధర్మవరం- నరసాపురం రైలు టాప్ ఎక్కి టికెట్ లేని వ్యక్తి హైడ్రామా.. ప్యాసింజర్ల గుండె గుభేల్ !

గుడివాడ స్టేషన్‌లో టికెట్ లేని ఓ వ్యక్తి టీసీని చూసి ధర్మవరం- నరసాపురం రైలు రూఫ్ మీదకు ఎక్కి నానా హంగామా చేశాడు. ఈ హైడ్రామా వల్ల రైలు అరగంట పాటు నిలిచిపోయింది.

గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ రైల్వే స్టేషన్‌లో బుధవారం తెల్లవారుజామున ఒక ప్యాసింజర్ హల్‌చల్ చేశాడు. ధర్మవరం నుండి నరసాపురం వెళ్తున్న రైలు ఉదయం 3 గంటలకు గుడివాడ స్టేషన్‌కు చేరుకున్న సమయంలో, రిజర్వేషన్ కంపార్ట్‌మెంట్‌లో టికెట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో టికెట్ లేని ఒక వ్యక్తి టీసీని చూసి భయాందోళనతో రైలు పైకప్పు (రూఫ్) పైకి ఎక్కి నానా హంగామా చేశాడు. హైటెన్షన్ విద్యుత్ తీగలు ఉన్నప్పటికీ అతను రైలు టాప్ మీద తిరుగుతూ హల్‌చల్ చేయడంతో తమకు కూడా కరెంట్ షాక్ కొడుతుందేమోనని ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని, అతి కష్టం మీద ఆ వ్యక్తిని సురక్షితంగా కిందకు దించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో సదరు వ్యక్తి మతిస్థిమితం లేనివాడిగా గుర్తించారు. ఈ ఘటన కారణంగా ధర్మవరం-నరసాపురం రైలు సుమారు అరగంట పాటు గుడివాడ స్టేషన్‌లోనే నిలిచిపోయింది. ప్రస్తుతం పోలీసులు ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.


Viral News: ధర్మవరం- నరసాపురం రైలు టాప్ ఎక్కి టికెట్ లేని వ్యక్తి హైడ్రామా.. ప్యాసింజర్ల గుండె గుభేల్ !

ఇటీవల ఇలాంటి తరహా ఘటన.. కానీ అక్కడ దారుణం
బిహార్‌లోని దర్భంగా జిల్లా లహేరియాసరయ్ రైల్వే స్టేషన్‌లో ఇటీవల అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. మతిస్థిమితం లేని ఒక వ్యక్తి అక్కడ ఆగి ఉన్న గూడ్స్ రైలు పైకి ఎక్కి హల్‌చల్ చేశాడు. కింద ఉన్న ప్రయాణికులు ప్రమాదాన్ని పసిగట్టి, ప్రాణాలు పోతాయని గట్టిగా అరుస్తూ కిందకు దిగమని వేడుకున్నా అతను వినిపించుకోలేదు. ఈ క్రమంలో పైకి ఎత్తిన అతని వేలు ప్రమాదవశాత్తు పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగకు తగిలింది.

క్షణాల వ్యవధిలోనే భారీ విద్యుత్ షాక్‌కు గురైన ఆ వ్యక్తి మంటలు చెలరేగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయి బోగీపై పడిపోయాడు. ఈ భయానక దృశ్యాలను కొందరు ప్రయాణికులు వీడియో తీయగా, అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై నెటిజన్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, రైల్వే స్టేషన్లలో మతిస్థిమితం లేని వారి కదలికలపై అధికారులు నిఘా పెంచాలని కోరుతున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget