Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Sachin Amuzed: క్రికెట్ లెజెండ్ సచిన్ తన ట్విటర్‌లో ఓ వీడియో షేర్ చేశాడు.. తాను ట్రావెల్ చేస్తుండగా.. రోడ్డు పక్కన తారసపడ్డ కుర్రాళ్లను.. వాళ్లలోని అద్భుతమైన టాలెంట్‌ను గుర్తించాడు. సచిన్ ఎక్కడికో ట్రావెల్ చేస్తుండగా. ఓ కర్రల బండిని చూశారు. అందుబాటులో ఉన్న వస్తువులతోనే వాళ్లు ఆ "కర్రల కారు"ను తయారు చేశారు. సచిన్ దగ్గరకు వెళుతుండగా భయంతో పారిపోయారు. అయినా ఆయన వారి దగ్గరకు వెళ్లి ప్రతిభను మెచ్చుకున్నారు. వారితో మరాఠీలో మాట్లాడి వివరాలు కనుక్కున్నారు. మన గ్రామీణ ప్రాంతాల్లో అద్బుతమైన ప్రతిభ ఉందని.. తమకు అందుబాటులో ఉన్న వస్తువులతోనే వీళ్లు వాళ్లకు తగిన వాహనాన్ని తయారు చేసుకున్నారని సచిన్ మెచ్చుకున్నాడు. గ్రామీణ టాలెంట్‌ను అందిరికీ పరిచయం చేసిన సచిన్‌ను సోషల్‌మీడియా యూజర్లు కూడా పొగుడుతున్నారు. సచిన్ ఇంతకు ముందు తాను ప్రయాణం చేసేప్పుడు.. రోడ్ సైడ్ క్రికెట్ ఆడుతున్న పిల్లల వద్దకు వెళ్లి గల్లీ క్రికెట్ ఆడారు.
ట్రెండింగ్ వార్తలు





















