అన్వేషించండి

YS Jagan BJP Frieendship: జగన్ , బీజేపీ శాశ్వత మిత్రత్వం వెనుక అసలు గుట్టు ఏమిటి? వ్యూహమా.. లేక రాజకీయ తప్పిదమా?

YS Jagan: రాజకీయాల్లో శత్రువుకు శత్రువు మిత్రుడు కావచ్చు, కానీ శత్రువుతో మిత్రత్వం నటిస్తూ సొంత గడ్డపై పోరాడటం క్లిష్టమైన క్రీడ. ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ఇదే బాటలో నడుస్తున్నారు.

YS Jagan BJP Permanent Frieendship:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఓ విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలు అధికారంలో ఉన్న కూటమిపై విమర్శలు ఎక్కుపెడతాయి. కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అటు కేంద్రంలోని బీజేపీతో, ఇటు ఏపీలోని కూటమితో భిన్నమైన వైఖరిని అవలంబిస్తోంది. ముఖ్యంగా బీజేపీకి జగన్ పర్మినెంట్ ఫ్రెండ్ అని అమిత్ షా అన్నట్లుగా వస్తున్న వార్తలను వైసీపీ సోషల్ మీడియా విపరీతంగా ప్రచారం చేయడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.  ఎన్డీఏ కూటమిలో భాగం కాకపోయినప్పటికీ, ఎన్నికల్లో బీజేపీ అండతో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను ఎదుర్కొంటూనే.. బీజేపీ అగ్రనేతలతో తమకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకోవడం వెనుక లోతైన రాజకీయ అర్థాలు కనిపిస్తున్నాయి.

 కేసుల భయం.. 

జగన్ మోహన్ రెడ్డిపై పదిహేనేళ్ల నుంచి  నడుస్తున్న సీబీఐ, ఈడీ కేసులే ఆయనను బీజేపీకి ఎదురెళ్లకుండా ఆపుతున్నాయన్నది  ప్రధాన వాదన. కేంద్రంలోని పెద్దల ఆగ్రహానికి గురైతే ఈ కేసులు వేగం పుంజుకునే ప్రమాదం ఉందన్న ఆందోళన వైసీపీలో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఎన్నికల్లో తగిలిన ఘోర పరాజయానికి బీజేపీ కూడా ఒక కారణమే అయినప్పటికీ, జగన్ తన విమర్శలను కేవలం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకే పరిమితం చేస్తున్నారు. బీజేపీని విమర్శించకపోవడం ద్వారా కేంద్రం నుంచి ఒక రకమైన  రక్షణ కవచాన్ని ఆశిస్తున్నట్లు కనిపిస్తోందని అంచనా వేస్తున్నారు.  

 మిత్రత్వం వెనుక మైండ్ గేమ్ 

 బీజేపీ మాకు మిత్రుడే అని వైసీపీ ప్రచారం చేసుకోవడం వెనుక మరో కోణం ఉంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ప్రస్తుతం ఎన్డీఏలో కీలక భాగస్వాములుగా ఉన్నారు. అయితే, బీజేపీకి జగన్ కూడా పర్మినెంట్ ఫ్రెండ్  అని చెప్పడం ద్వారా.. కూటమిలో చిచ్చు పెట్టాలనేది వైసీపీ వ్యూహం . మీరు కూటమిలో ఉన్నా, మాకు ఢిల్లీలో పట్టుంది అని కేడర్‌కు భరోసా ఇవ్వడం ద్వారా పార్టీ నుంచి వలసలను అడ్డుకోవాలని జగన్ భావిస్తున్నారు. అయితే, ఈ డబుల్ గేమ్ ఎంతవరకు పారుతుందన్నది సందేహమే.

 ఓటు బ్యాంకుకు పెను ముప్పు? 

రాజకీయంగా చూస్తే, బీజేపీతో సాన్నిహిత్యం వైసీపీకి పెద్ద నష్టం కలిగించే అవకాశం ఉంది. వైసీపీకి సంప్రదాయంగా ఉన్న   ముస్లిం, క్రైస్తవ మ, దళిత ఓటు బ్యాంకు వ్యతిరేకమవుతుంది.  గత ఎన్నికల్లోనే మైనారిటీ ఓటర్లు కొంతమేర వైసీపీకి దూరమైనట్లు కాంగ్రెస్‌కు పెరిగిన ఓటింగ్ నిరూపించింది.  ఇప్పుడు మళ్ళీ తామే  శాశ్వత మిత్రులం అని ప్రచారం చేసుకోవడం ద్వారా.. మైనారిటీలను పూర్తిగా వ్యతిరేకం చేసుకునే ప్రమాదం ఉంది. ఇది వైసీపీ పునాదులనే కదిలించే వ్యూహాత్మక తప్పిదం  అయ్యే అవకాశం ఉంది. శాసనసభలో విపక్ష హోదా కూడా లేని ప్రస్తుత తరుణంలో, జగన్ అనుసరిస్తున్న ఈ   వైఖరి  పార్టీ శ్రేణుల్లో అయోమయానికి గురిచేస్తోంది. ఒకవైపు కూటమి ప్రభుత్వం దూకుడుగా వెళ్తుంటే, మరోవైపు కేంద్రం మద్దతు కూడగట్టలేక, అలాగని కేంద్రాన్ని ఎదిరించలేక వైసీపీ సతమతమవుతోంది.  

 వ్యూహాత్మక తప్పిదమా? 

రాజకీయ విశ్లేషకుడు ఒకరు చేసిన  అమిత్ షా  చేసినట్లుగా ప్రచారం చేస్తున్న  వ్యాఖ్యలను వైరల్ చేయడం వెనుక వైసీపీ ఉద్దేశం.. కూటమి నేతల్లో అభద్రతా భావం నింపడమే కావచ్చు. కానీ క్షేత్రస్థాయిలో ప్రజలు దీనిని భిన్నంగా చూస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా కేంద్రం నుంచి ఆశించిన నిధులు రాబట్టలేకపోయారని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా బీజేపీ భజన చేయడం వల్ల ప్రయోజనం లేదని సామాన్య ఓటర్లు భావించే ప్రమాదం ఉంది.  వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న ఈ ప్రచారం ఒక  రెండంచుల కత్తి  లాంటిది. ఢిల్లీలో తన పట్టును నిరూపించుకోవాలని జగన్ ప్రయత్నిస్తున్నా, అది కాస్తా తన సొంత ఓటు బ్యాంకును దూరం చేసే దిశగా వెళ్తోంది. బీజేపీతో స్నేహం వల్ల జగన్‌కు వ్యక్తిగతంగా కేసుల పరంగా ఊరట లభించవచ్చేమో కానీ, రాజకీయంగా మాత్రం వైసీపీకి ఇది పెద్ద గొడ్డలిపెట్టుగా మారే ప్రమాదం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ  పర్మినెంట్ ఫ్రెండ్షిప్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Vijay Delimitation Meeting: తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌ను బహిష్కరించిన 37 మంది ఎంపీలు
తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌కు 37 మంది ఎంపీలు డుమ్మా!
Polavaram Banakacherla Project : పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
Ambati Rambabu Padayatra Postponed : వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Embed widget