అన్వేషించండి

YS Jagan: కేంద్రం పెంచిన పెట్రో రేట్లపై వైసీపీ ఆందోళనలు - కానీ బీజేపీపై విమర్శలు నిల్ - జగన్ ప్లాన్ అదేనా?

YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ రాజకీయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కేంద్రం చేతుల్లో ఉన్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వైసీపీ భారీ నిరసనలు చేపట్టింది. బీజేపీని ఢీకొట్టబోతున్నామన్న సంకేతాలు పంపింది.

YSRCP Vs  BJP:  రాజకీయాల్లో ఏ చర్య వెనుకైనా ఒక బలమైన వ్యూహం, ఆశించిన లక్ష్యం ఉంటాయి. ఏపీలో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై చేపట్టిన నిరసనలు ఈ కోవలోకే వస్తాయి.  రాష్ట్రానికి సంబంధించిన స్థానిక సమస్యలపై పెద్దగా గళమెత్తని వైసీపీ, ఒక్కసారిగా పెట్రోల్ ధరల పెంపుపై రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునివ్వడం వెనుక లోతైన రాజకీయ వ్యూహం దాగి ఉందన్న అభఇప్రాయం వినిపిస్తోంది.  పెట్రోల్ ధరల పెంపు అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అయినప్పటికీ.. వైసీపీ నేతలు మాత్రం ఎక్కడా ప్రధాని మోదీని గానీ, కేంద్ర బీజేపీ నాయకత్వాన్ని గానీ విమర్శించడం లేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వంపైనే విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. అడ్రస్ కేంద్రానిది అయితే, దాన్ని రాష్ట్రం మీదకు మళ్లించడం వెనుక ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ ఉన్నట్లు భావిస్తున్నారు.

 బీజేపీకి ఫ్రెండ్లీ వార్నింగ్? 

వైసీపీ ఇస్తున్న ఈ సిగ్నల్స్ వెనుక ప్రధాన ఉద్దేశం.. తాము కేంద్రానికి వ్యతిరేకం కాదని, కానీ అవసరమైతే  తమ దారి తాము చూసుకుని బీజేపీకి వ్యతిరేకంగా పోరాడగల సత్తా తమకు ఉందని నిరూపించడమే  . ఢిల్లీ స్థాయిలో బీజేపీతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే, రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్న టీడీపీ-జనసేన కూటమిని ఇరుకున పెట్టడం ఈ వ్యూహంలోని ప్రధాన భాగం.  మేము కేంద్రాన్ని ఏమీ అనడం లేదు, కానీ మీరు  తగ్గించొచ్చు కదా అనే ప్రశ్న ద్వారా ప్రజల్లో అధికార కూటమిపై వ్యతిరేకత పెంచడమే వైసీపీ లక్ష్యం. ఇది బీజేపీకి పంపుతున్న ఒక రకమైన  సాఫ్ట్ సిగ్నల్ .

 ఎందుకు ఈ వ్యూహం? 

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలు వరుసగా కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో కేంద్రంలోని బీజేపీ అగ్రనాయకత్వం అండ ఉంటేనే తాము సురక్షితంగా ఉంటామని వైసీపీ భావిస్తోంది. అందుకే డైరెక్ట్ గా కేంద్రంతో యుద్ధం పెట్టుకోకుండా.. రాష్ట్రానికి సంబంధించిన  సెస్,  వాట్ అంశాలను సాకుగా చూపిస్తూ నిరసనలు చేపడుతున్నారు. ఇలా చేయడం వల్ల కేంద్రానికి కోపం రాదు, అదే సమయంలో రాష్ట్రంలో తాము ప్రతిపక్షంగా యాక్టివ్ గా ఉన్నామనే సంకేతం కేడర్ కు వెళ్తుంది.

 డైరెక్ట్ ఎటాక్ ఎందుకు చేయడం లేదు? 

ఒకవేళ మోదీపై నేరుగా విమర్శలు చేస్తే,  సంబంధాలు దెబ్బతింటాయి. భవిష్యత్తులో సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి ఎదురయ్యే సవాళ్లను తట్టుకోవడం కష్టమవుతుందని వైసీపీకి తెలుసు. అందుకే, నిరసనల నినాదాన్ని కేంద్ర ప్రభుత్వం  నుంచి  రాష్ట్ర పన్నుల వైపు మళ్లించారని అంచున్నారు.  పెట్రోల్ ధరల్లో ఏపీ నంబర్ వన్ అని ప్రచారం చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికే చెడ్డపేరు వచ్చేలా చేస్తున్నారు తప్ప, ధరలు పెంచిన కేంద్రానికి ఏమీ కాకుండా జాగ్రత్త పడుతున్నారు.  వైసీపీ చేస్తున్న ఈ  పెట్రోల్ నిరసనలు కేవలం ధరల కోసమే అని అనుకుంటే పొరపాటే. ఇది పక్కాగా ఢిల్లీ పెద్దల మనసు గెలుచుకుంటూనే, గల్లీలో ఉన్న ప్రత్యర్థులను దెబ్బకొట్టే డబుల్ యాక్షన్  ప్లాన్. కేంద్రం పట్ల మౌనం పాటిస్తూ, రాష్ట్రంపై గగ్గోలు పెట్టడం వెనుక ఉన్న ఈ రాజకీయ చాణక్యం రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తుందో వేచి చూడాలి. 

టాప్ హెడ్ లైన్స్

Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Telangana Congress Rift: కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?
కాంగ్రెస్ మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యం - రేవంత్ ఉక్కిరిబిక్కిరి - దారిలో పెట్టలేకపోతున్నారా?
Ponguleti Srinivas Reddy: రేవంత్ సర్కార్‌కు మంత్రి పొంగులేటి సమస్యగా మారారా? కాంగ్రెస్ ల్యాండ్ మార్క్ గ్రాఫ్‌కు గండి కొడుతున్నాయా?
రేవంత్ సర్కార్‌కు మంత్రి పొంగులేటి సమస్యగా మారారా? కాంగ్రెస్ ల్యాండ్ మార్క్ గ్రాఫ్‌కు గండి కొడుతున్నాయా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Embed widget