అన్వేషించండి

Pawan Kalyan Political Strategy: పవన్ కళ్యాణ్ పక్కా పొలిటికల్ స్కెచ్ - జనసేన 36 వేల దరఖాస్తుల సునామీ... టీడీపీకి రాబోయే రోజుల్లో చెక్ తప్పదా?

Chandrababu Pawan Kalyan Power Dynamics: పవన్ కళ్యాణ్ జనసేన బలోపేతానికి వేస్తున్న పక్కా వ్యూహాలు అమలు చేస్తున్నారు. సంస్థాగత నిర్మాణాన్ని బలంగా చేపడుతున్నారు. కూటమిలో టీడీపీకి ఇది ముప్పుగా మారుతుందా?

AP NDA Coalition Politics TDP Janasena:   ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో జనసేనాని, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన శైలిని వేగంగా మార్చుకుంటూ పరిపూర్ణ రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందుతున్నారు. గతంలో కేవలం ఎన్నికల సమయానికే పరిమితమవుతారనే విమర్శలకు చెక్ పెడుతూ, లభించిన అధికారాన్ని పార్టీ క్షేత్రస్థాయి విస్తరణకు అత్యంత వ్యూహాత్మకంగా వాడుకుంటున్నారు. అధికారంలో భాగస్వామిగా ఉన్న సమయాన్నే పార్టీని కేడర్ బేస్డ్ వ్యవస్థగా మార్చేందుకు ఆయన వేస్తున్న అడుగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో భాగమే రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్థాయిల నాయకత్వ బాధ్యతల కోసం జనసైనికులు, వీరమహిళలు, క్రియాశీలక కార్యకర్తల నుంచి ఆహ్వానించిన దరఖాస్తుల ప్రక్రియ. ఏకంగా 36,000కు పైగా అప్లికేషన్లు వెల్లువెత్తడం జనసేన పార్టీ పెరుగుతున్న రాజకీయ గ్రాఫ్‌కు నిదర్శనంగా మారింది.

సమర్థులైన నేతలకు పార్టీ బాధ్యతలు

ఈ భారీ స్పందన నుంచి కేవలం గుడ్డిగా నియామకాలు చేయకుండా, వడపోత  ద్వారా నిఖార్సైన, సిద్ధాంత ప్రాతిపదికన పనిచేసే సైనికులను ఎంపిక చేసే పనిలో పవన్ పడ్డారు. పంచాయతీ నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయి వరకు బలమైన కమిటీలను నిర్మించడం ద్వారా, స్థానిక సంస్థల ఎన్నికల నాటికి గ్రామీణ స్థాయిలో జనసేనకు తిరుగులేని పునాది వేయడమే ఆయన ప్రధాన లక్ష్యం. డిప్యూటీ సీఎంగా గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ వంటి కీలక శాఖలు తన వద్దే ఉండటం పవన్‌కు మరో పెద్ద ప్లస్ పాయింట్. పాలనలో తన ముద్ర వేస్తూనే, కేడర్‌కు పనులు చేసిపెట్టే అవకాశాన్ని ఆయన సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు.

కూటమిలో సీట్ల బలం పెంచుకునే వ్యూహం 

కూటమిలో ప్రస్తుతం తక్కువ సీట్లతో చిన్న భాగస్వామిగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో తన వాటాను  సమానంగా లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో క్లెయిమ్ చేసేందుకు పవన్ నిరంతరం శ్రమిస్తున్నారు. ఓటు బ్యాంకు మార్పిడిని  ఎన్నికల్లో నిరూపించిన ఆయన, ఇప్పుడు సంస్థాగత బలం ద్వారా కూటమిలోనే అత్యంత డిమాండింగ్ ఫోర్స్‌గా మారాలని చూస్తున్నారు. రాజకీయంలో ఏ పార్టీ కూడా శాశ్వతంగా రెండో స్థానంలో ఉండటానికి ఇష్టపడదు. పవన్ కళ్యాణ్ సుదూర వ్యూహం కూడా జనసేనను ఏపీలో ప్రధాన రాజకీయ శక్తిగా నిలబెట్టడమే అనడంలో ఎలాంటి సందేహం లేదు.   జనసేన పుంజుకుంటున్న ఈ వేగం అంతిమంగా మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి సాంకేతికంగా పెద్ద సవాలుగానే మారే అవకాశముంది. దశాబ్దాలుగా బలమైన గ్రాస్‌రూట్ నెట్‌వర్క్ ఉన్న టీడీపీకి, అదే క్షేత్రస్థాయిలో జనసేన పోటీదారుగా మారడం భవిష్యత్ ఎన్నికల్లో సీట్ల పంపిణీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గతంలో టీడీపీకి ఏకపక్షంగా ఉన్న కొన్ని వర్గాల ఓటు బ్యాంకు, ఇప్పుడు జనసేన వైపు బలంగా మొగ్గుతుండటం మేజర్ పార్టీగా ఉన్న టీడీపీకి అంతర్గతంగా కొంత ఆందోళన కలిగించే అంశమే.

టీడీపీకి ఇబ్బందికరమే !

ఈ రాజకీయ పరిణామాలకు టీడీపీ కూడా ఊరికే ప్రేక్షకపాత్ర వహించే అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ అడుగులకు చెక్ పెట్టడానికి లేదా తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు తనదైన రీతిలో వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఒకవైపు కూటమి ధర్మాన్ని పాటిస్తూనే, మరోవైపు తమ శ్రేణులను కాపాడుకునేందుకు  సభ్యత్వ నమోదు, నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జుల మార్పులు, కార్యకర్తలకు ప్రభుత్వ పథకాల నామినేటెడ్ పదవుల కేటాయింపు వంటి చర్యలను టీడీపీ వేగవంతం చేస్తోంది. జనసేన ఎంతగా బలపడినా, కూటమిలో పెద్దన్న పాత్ర ఎప్పటికీ తమదేనని నిరూపించేలా పాలనాపరమైన మైలేజీని క్రెడిట్ చేసుకునే పనిలో పచ్చజెండా ఉంది.
 
కూటమి ఐక్యత పైన కనిపిస్తున్నప్పటికీ.. లోపల మాత్రం టీడీపీ, జనసేనల మధ్య సంస్థాగత బలాన్ని పెంచుకునే రహస్య పోటీ అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది. పవన్ కళ్యాణ్ వేస్తున్న పక్కా పొలిటికల్ స్కెచ్‌లు జనసేనను కొత్త శిఖరాలకు తీసుకెళ్తాయా? లేక చంద్రబాబు చదరంగపు ఎత్తుల ముందు సానుకూల రాజకీయాలకే పరిమితమవుతాయా అనేది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో తేలిపోనుంది. 


 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Assembly Session: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం, మండలిలో మెగా డీఎస్సీపై వైసీపీ ప్రశ్నలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం, మండలిలో మెగా డీఎస్సీపై వైసీపీ ప్రశ్నలు!
NDA Convenor Post Revival: ఎన్డీఏ కన్వీనర్ పదవి మళ్లీ తెరపైకి.. బీజేపీ హైకమాండ్ వ్యూహం ఏమిటి? నిజంగానే చాన్స్ ఉందా?
ఎన్డీఏ కన్వీనర్ పదవి మళ్లీ తెరపైకి.. బీజేపీ హైకమాండ్ వ్యూహం ఏమిటి? నిజంగానే చాన్స్ ఉందా?
TDP Janasena Social Media War: క్షేత్రస్థాయిలో పాలనలో సమన్వయం .. సోషల్ మీడియాలో సెల్ఫ్ గోల్ ! కూటమి సోషల్ వార్‌ను అరికట్టడం ఎలా?
క్షేత్రస్థాయిలో పాలనలో సమన్వయం .. సోషల్ మీడియాలో సెల్ఫ్ గోల్ ! కూటమి సోషల్ వార్‌ను అరికట్టడం ఎలా?
YSRCP MLA Disqualification Issue: అనర్హత వేటు వేసుకోండి .. వైసీపీ పొలిటికల్ ఆఫర్ వెనుక అసలు వ్యూహమేంటి? స్పీకర్ ఏం చేయబోతున్నారు?
అనర్హత వేటు వేసుకోండి .. వైసీపీ పొలిటికల్ ఆఫర్ వెనుక అసలు వ్యూహమేంటి? స్పీకర్ ఏం చేయబోతున్నారు?
Advertisement

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget