అన్వేషించండి

GenZ Politics India: నాయకుల్లారా జాగ్రత్త! భారత రాజకీయాన్ని రీ-రైట్ చేస్తున్న జెన్జీ ట్రెండ్ !

Changing Face of Indian Politics:భారత రాజకీయాల్లో జెన్జీ పెనుమార్పులు సృష్టిస్తోంది. పాత ఓటు బ్యాంకులు, పొలిటికల్ నెరేటివ్‌లకు స్వస్తి పలుకుతూ వీధిలోకి వస్తున్న యువత కొత్త ట్రెండ్ సృష్టించబోతోంది.

Gen Z Youth Protests Accountability: భారత రాజకీయాల్లో పాత లెక్కలు, సాంప్రదాయ ఓటు బ్యాంకులు ,  అలవాటైన పొలిటికల్ నెరేటివ్‌లు ఇకపై చెల్లవనే సంకేతాన్ని  జెన్జీ తరం స్పష్టంగా ఇచ్చేసింది. దశాబ్దాలుగా నాయకులు వేసే ఎత్తుగడలు, ఇచ్చే హామీలు, మత-కులాధారిత సెంటిమెంట్లను ఆధారంగా చేసుకుని సాగిన రాజకీయం ముగింపు దిశగా సాగుతోంది. విద్యా వ్యవస్థలో లోపాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు , భవిష్యత్తుపై అభద్రతా భావంతో వీధిలోకి వచ్చిన ఈ యువత.. ప్రతిపక్ష రాజకీయ జెండాలను పక్కనపెట్టి కేవలం తమ డిమాండ్లపై పట్టుబట్టడం ద్వారా సరికొత్త  డిజిటల్ అడ్వర్సరీ అవతారమెత్తింది. అటు అధికార పక్షమైనా, ఇటు ప్రతిపక్షమైనా సరే.. ఈ తరం మూడ్‌ను సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఊహించని రాజకీయ మూల్యం చెల్లించుకోక తప్పదు.

జెన్‌ జీ రాజకీయాల్లో ఏ ఒక్క నాయకుడో సూపర్ స్టార్ కాదు!

జెన్జీ రాజకీయాల  ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో ఏ ఒక్క నాయకుడో, పార్టీయో ఏకఛత్రాధిపత్యం వహించలేరు. వీరు  నాయకరహిత పోరాటాల ను నమ్ముతారు. నేడు సోషల్ మీడియాలో జరిగే ప్రచారాలు లేదా వ్యాప్తి చెందే విజువల్స్  రైటా? రాంగా  అనే సాంప్రదాయ సత్యశోధన కంటే.. ఆ సమాచారం సృష్టించే ఒక  ఎమోషన్ ప్రాతిపదికన యువత రోడ్లపైకి వస్తున్నారు. ఒక వైరల్ రీల్ లేదా మీమ్ సెకన్లలో లక్షలాది మందిని కనెక్ట్ చేస్తోంది. ప్రభుత్వం యంత్రాంగంతో లాఠీఛార్జ్ చేయించినా లేదా డిజిటల్ సెన్సార్‌షిప్ విధించినా, అది ఆగ్రహాన్ని ఆపలేకపోగా, రివర్స్ ఎమోషన్‌ను రగిలిస్తోందని ఇటీవలి ఢిల్లీ నిరసన పరిణామాలు రుజువు చేశాయి.

వారి పోరాటాలను అణచివేయడం కష్టం

  జెన్జీల పోరాటాలను అణచివేయడం లేదా కంట్రోల్ చేయడం అత్యంత సంక్లిష్టం. ఎందుకంటే, పాతకాలపు విద్యార్థి సంఘాల్లా వీరికి రాజకీయ పదవుల ఆశలు ఉండవు. ప్రతిపక్షాలు ఈ ఆందోళనలను తమకు అనుకూలంగా మలుచుకుందామని చూస్తే..  మా పోరాటాన్ని పొలిటికల్ నెరేటివ్‌గా మార్చకండి  అని వారిని కూడా దూరం పెడుతున్నారు. ఫలితంగా, అధికార వర్గాలు ఈ పోరాటాలపై "ప్రతిపక్షాల కుట్ర" అనే పాత ముద్ర వేయలేకపోతున్నాయి. ఇది అటు అధికారంలో ఉన్నవారికి, ఇటు ఆశలు పెట్టుకున్న ప్రతిపక్షాలకు సింహస్వప్నంగా మారింది. ఈ తరానికి ఉన్న మరో ప్రధాన లక్షణం అతిత్వరగా స్పందించే నైజం,  జవాబుదారీతనం   డిమాండ్ చేయడం. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల వరకు వేచి చూసే ఓపిక ఈ డిజిటల్ యూత్‌కు లేదు. ఒక ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో జాప్యం, పరీక్ష నిర్వహణలో పారదర్శకత లేకపోవడం లేదా తమ హక్కులను భంగపరిచే ఏ చిన్న నిర్ణయమైనా సరే, వారు తక్షణ పరిష్కారాన్ని కోరుకుంటున్నారు. మంత్రుల రాజీనామాలు, అధికారుల సస్పెన్షన్లు వంటి కఠిన చర్యలు చూసేంత వరకు వీరు వెనక్కి తగ్గడం లేదు. రాజకీయ నాయకులు తమ మీడియా బ్రీఫింగ్‌లు, పబ్లిసిటీ స్టంట్‌లతో వీరిని మభ్యపెట్టలేరని స్పష్టమైంది.

జెన్‌జీతో రాజకీయ పార్టీలు జాగ్రత్తగాఉండాల్సిందే!

రాబోయే రోజుల్లో ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ప్రతీ నిర్ణయంలోనూ ఆచి తూచి వ్యవహరించాల్సిందే. "మాకు తిరుగులేదు, మా ఓటు బ్యాంక్ పద్రంగా ఉంది" అనుకునే భావజాలం ఇక పనిచేయదు. నాయకులు చేసే ప్రతీ ప్రసంగం, తీసుకునే ప్రతీ నిర్ణయం క్షేత్రస్థాయిలో ఉన్న లక్షలాది జెన్జీల స్మార్ట్‌ఫోన్‌లలో రీఫ్రేమ్ అవుతోంది. విద్యార్థులను, యువతను రెచ్చగొట్టేలా మాట్లాడితే లేదా వారి సమస్యలను తేలికగా తీసిపారేస్తే.. ఆ వ్యాఖ్యలే వారికి వ్యతిరేకంగా బిగ్గెస్ట్ పొలిటికల్ అస్త్రాలుగా మారుతున్నాయి. భారత రాజకీయ రంగం  సిస్టమ్ వర్సెస్ పీపుల్  నుంచి  సిస్టమ్ వర్సెస్ జెన్జీ గా రూపాంతరం చెందుతోంది. సిద్ధాంతాల కంటే పారదర్శకతకే ఓటు వేసే ఈ తరం, రాబోయే రోజుల్లో ప్రతి రాజకీయ నాయకుడినీ బాధ్యతాయుతంగా మార్చక తప్పని పరిస్థితిని తీసుకొచ్చింది. కాబట్టి, నేతలు వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాటా అత్యంత జాగ్రత్తగా లేకపోతే.. జెన్జీ రగిల్చే పొలిటికల్ తుఫానులో కొట్టుకుపోక తప్పదు! 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

GenZ Politics India: నాయకుల్లారా జాగ్రత్త! భారత రాజకీయాన్ని రీ-రైట్ చేస్తున్న జెన్జీ ట్రెండ్ !
నాయకుల్లారా జాగ్రత్త! భారత రాజకీయాన్ని రీ-రైట్ చేస్తున్న GenZ ట్రెండ్ !
Abhijeet Dipke Typhoid: టైఫాయిడ్ బారిన పడిన అభిజిత్ దీప్కే.. ఈ వ్యాధి లక్షణాలు ఏంటీ? ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుంది
టైఫాయిడ్ బారిన పడిన అభిజిత్ దీప్కే.. ఈ వ్యాధి లక్షణాలు ఏంటీ? ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుంది
Breaking News: భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది
భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది
Task Force for Exam Reforms: పరీక్షా విధానంలో సంస్కరణలు.. నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్: ప్రధాని మోదీ
పరీక్షా విధానంలో సంస్కరణలు.. నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్: ప్రధాని మోదీ
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Embed widget