అన్వేషించండి

Devendra Fadnavis Delhi Visit: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కదిలిన మహారాష్ట్ర సీఎం పీఠం - హుటాహుటిన ఢిల్లీకి దేవేంద్ర ఫడ్నవీస్ - లింక్ ఎక్కడ?

Dharmendra Pradhan Resignation News: నీట్ వివాదంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం మహారాష్ట్ర సీఎం అత్యవసరంగా ఢిల్లీ పయనమయ్యారు. కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది.

Amruta Fadnavis Comments on Delhi Visit:    దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్  ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వివాదం, జెన్‌జీ విద్యార్థుల సుదీర్ఘ పోరాటం తీవ్రరూపం దాల్చడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జూలై 20న విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్ అనంతరం ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా దవానలంలా వ్యాపించింది. సామాజిక వేత్త సోనమ్ వాంగ్‌చుక్ తన నిరసన ఉపవాసాన్ని విరమించినప్పటికీ ఉద్యమ తీవ్రత తగ్గకపోవడంతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీల నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఈ పరిణామం విద్యార్థి లోకం సాధించిన చారిత్రాత్మక విజయంగా రాజకీయ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.

ప్రధాన్ రాజీనామాతో మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం పొందిన వెంటనే మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని సంచలనాత్మక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆషాఢీ ఏకాదశి పవిత్ర సమయాన్ని పురస్కరించుకుని శనివారం పండరీపురంలోని విఠల్ రుక్మిణి ఆలయంలో తన భార్య అమృతా ఫడ్నవీస్‌తో కలిసి ప్రతిష్టాత్మక పూజలు నిర్వహించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో సోలాపూర్ నుంచి హుటాహుటిన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. కేంద్ర బిజెపి అధిష్టానం నుంచి వచ్చిన అత్యవసర పిలుపుమేరకే ఆయన ఢిల్లీకి చేరుకున్నట్లు సమాచారం.  

విద్యామంత్రిగా ఫడ్నవీస్ ను తీసుకుంటారా? 

కేంద్ర విద్యాశాఖ ఖాళీ అయిన నేపథ్యంలో దేవేంద్ర ఫడ్నవీస్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని విద్యాశాఖ బాధ్యతలు అప్పగించవచ్చనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. శశిథరూర్, సంజయ్ రౌత్ వంటి ప్రతిపక్ష నేతలు కూడా ఫడ్నవీస్ కేంద్రంలోకి వెళ్లే అవకాశం ఉందంటూ వ్యాఖ్యానించారు.  ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం పలు కీలక మార్పులు చేయాల్సి వస్తోంది, అయితే ఫడ్నవీస్ ఢిల్లీ పర్యటన వెనుక అసలు వ్యూహం త్వరలోనే స్పష్టమయ్యే అవకాశం ఉందని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.  

మహారాష్ట్ర సీఎంగానే ఉంటారంటున్న అమృతా ఫడ్నవీస్ 

మరోవైపు, ఈ ఊహాగానాలపై దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫడ్నవీస్ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తారా అన్న మీడియా ప్రశ్నకు స్పందిస్తూ..  మేము మహారాష్ట్రలోనే ఉండాలనుకుంటున్నాము, నేను దేవేంద్రజీని మహారాష్ట్రలోనే ఉంచుతాను  అని రెండు ముక్కల్లో తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. అదే సమయంలో విద్యార్థుల ఆందోళనపై వ్యాఖ్యానిస్తూ, పేపర్ లీకేజీలకు స్వస్తి పలికి విద్యార్థుల కష్టానికి తగిన న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, అయితే ఆందోళనల్లో హింస చోటుచేసుకోవడం విచారకరమని ఆమె పేర్కొన్నారు.

ఈ పరిణామాల నడుమ, మహారాష్ట్రలో రాజకీయ వేడి మరింత రగిలింది. నీట్ వ్యవహారంలో  ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే  శని, ఆదివారాల్లో ముంబైలో భారీ  తిరంగా మార్చ్  నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చారు. ఈ ముంబై మార్చ్ భారీ ప్రజా సమీకరణకు దారితీసే అవకాశం ఉన్నందున, రాష్ట్రంలో శాంతిభద్రతలు,  రాజకీయ సమీకరణాలపై కేంద్ర అగ్రనాయకత్వంతో చర్చించేందుకే ఫడ్నవీస్ ఢిల్లీ వెళ్లారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఢిల్లీ భేటీల అనంతరం కేంద్రం ఎలాంటి కీలక ప్రకటన చేస్తుందోనని దేశ రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
ABP Desam Top 10, 15 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 15 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
IND vs SL Galle Test: భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Embed widget