అన్వేషించండి

CJP GenZ Protest Success Story: కాక్రోచ్‌ల తొలి పోరాటమే సూపర్‌హిట్ - రాజకీయ పార్టీలకు సాధ్యం కానిది సాధించిన జెన్జీలు !

CJP GenZ Protest NTA: రాజకీయ పార్టీలకు సాధ్యం కానిది చేసి చూపించారు జెన్ జీ యువత. కాక్రోచ్ జనతా పార్టీ తొలి పోరాటంలోనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.

GenZ Non Political Movement Success: భారత రాజకీయాల్లో ప్రజాపోరాటాలు, ధర్నాలు అంటే దశాబ్దాలుగా రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాల అనుబంధ విభాగాలు  నడిపించే ఒక సాంప్రదాయ శైలి మాత్రమే మనకు తెలుసు. కానీ, దేశ చరిత్రలో తొలిసారిగా ఎలాంటి రాజకీయ జెండాలు, అనుబంధ గుర్తులు లేకుండా కేవలం తమ భవిష్యత్తు కోసం  కాక్రోచ్ జనతా పార్టీ పే్రుతో  జెన్  యువత సాధించిన విజయం సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. దశాబ్దాలుగా ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, జాతీయ నేతలు కూడా సాధించలేని రీతిలో.. కేంద్రంలో అత్యంత బలమైన నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లో పడేసి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను సాధించుకోవడం ఈ  జెన్జీ  తొలి పోరాటానికి లభించిన అతిపెద్ద హిట్ మార్క్!

పార్టీల రంగులు పడకుండా చేసిన పోరాటం ఫలితం

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఫల్యాలు, పేపర్ లీకేజీల రచ్చతో విసిగిపోయిన విద్యార్థులు ఈసారి సాంప్రదాయ రాజకీయ పార్టీల నేతల మాటలను నమ్మలేదు. ప్రతిపక్షాలు ఈ సమస్యను తమ రాజకీయ లబ్ధికి వాడుకోవాలని చూసిన ప్రతిసారి, జెన్జీలు వారిని దూరంగా ఉంచారు.  ఇది మా భవిష్యత్తు పోరాటం.. మీ రాజకీయ రచ్చ ఇక్కడ వద్దు  అని తెగేసి చెప్పారు. రాజకీయ అజెండాలకు అతీతంగా, కేవలం పారదర్శకత , జవాబుదారీతనం  డిమాండ్‌తో సాగించిన ఈ నాన్-పొలిటికల్ మూవ్‌మెంట్ ముందు కేంద్ర యంత్రాంగానికి ఏం చేయాలో పాలుపోలేదు. పార్టీల రంగులు పూసి ఆందోళనలను దిగజార్చే అవకాశం లేకపోవడమే ఈ ఉద్యమానికి అతిపెద్ద బలమైంది.

డిజిటల్ ప్లస్ ఫీల్డ్  స్ట్రాటజీ 

సాంప్రదాయ పోరాట శైలికి భిన్నంగా జెన్జీలు అవలంబించిన  డిజిటల్ ప్లస్ ఫీల్డ్  స్ట్రాటజీ ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఒకవైపు సోషల్ మీడియా వేదికలైన ఎక్స్ , ఇన్‌స్టాగ్రామ్‌లలో లక్షలాది హాష్‌ట్యాగ్‌లతో అంతర్జాతీయ స్థాయిలో కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే.. మరోవైపు ఢిల్లీ వీధుల్లో ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత నిరసనలు చేపట్టారు. హుందాతనంతో కూడిన నిరసనలు, ఖచ్చితమైన సమాచారంతో కూడిన ప్రశ్నావళితో కేంద్ర మంత్రులను, అధికారులను నిలదీశారు.  లాఠీఛార్జ్‌లు చేసినా ఎదుర్కొన్నారు. కానీ అది విధ్వంసం వైపు వెళ్లనీయలేదు.  ప్రజాస్వామ్యయుత తీవ్ర నిరసనతోనే ఢిల్లీ పీఠాన్ని కదిలించారు.

ముప్పును గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 

రాజకీయ పార్టీలకు సాధ్యం కానిది జెన్జీలు ఎలా సాధించారంటే.. అందులో నైతిక బలం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక ప్రతిపక్ష పార్టీ ధర్నా చేస్తే దానికి  ఎన్నికల స్టంట్ అనే ముద్ర వేసి కొట్టిపారేయడం ప్రభుత్వాలకు తేలిక. కానీ, స్వచ్ఛమైన మనస్సులతో తమ కష్టానికి ప్రతిఫలం కోరుతూ వీధిలోకి వచ్చిన లక్షలాది మంది అభ్యర్థుల ఆవేదనను ఏ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేయలేదు. పైగా, రాబోయే రోజుల్లో దేశంలోనే అతిపెద్ద ఓటు బ్యాంకుగా మారబోతున్న ఈ జెన్జీ  ఓటర్ల ఆగ్రహానికి గురైతే కలిగే నష్టం తీవ్రంగా ఉంటుందని కేంద్ర బిజెపి అధిష్టానం ముందే గ్రహించింది.

ప్రధాన్ రాజీనామా వ్యవస్థలపై సాధించిన విజయం

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కేవలం ఒక వ్యక్తి పదవిని కోల్పోవడం కాదు. అది వ్యవస్థల పారదర్శకతపై సాధించిన విజయం. ప్రభుత్వాలు ఎంతటి మేజారిటీతో ఉన్నా, యువత , పౌర సమాజం ఒకే లక్ష్యంతో నిలబడితే దిగిరాక తప్పదనే సందేశాన్ని కాక్రోచ్ జనతా పార్టీ  పోరాటం అందించింది. గతంలో రైతులు సాధించిన విజయం ఒక ఎత్తయితే, డిజిటల్ యుగంలో పెరిగిన జెన్జీలు సాంకేతికతను, ప్రజాస్వామ్య హక్కులను మేళవించి సాధించిన ఈ విజయం భారత రాజకీయ భవిష్యత్తుకు ఒక సరికొత్త దిక్సూచిగా నిలిచింది. తొలి ప్రయత్నంలోనే ప్రభంజనం సృష్టించిన  జెన్జీ మూవ్‌మెంట్, రాబోయే రోజుల్లో దేశంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే.. విధానపరమైన నిర్ణయాల్లో పారదర్శకత లేకపోతే యువత ఎలాంటి దెబ్బ తీయగలదో ప్రత్యక్షంగా చూపించింది. రాజకీయాల్లో జెండాల కంటే, నినాదాల కంటే..  న్యాయం, బాధ్యత అనే ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలే గెలుస్తాయని ఈ చారిత్రాత్మక ఘట్టం స్పష్టం చేసింది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rebel BRA MLAs looking back | ఫిరాయింపు ఎమ్మెల్యేల ‘రివర్స్ గేర్’.. గులాబీ గూటివైపు చూపులు?
Rebel BRA MLAs looking back | ఫిరాయింపు ఎమ్మెల్యేల ‘రివర్స్ గేర్’.. గులాబీ గూటివైపు చూపులు?
Telangana Graduate MLC Elections 2027: పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా పోటీకి యువనేతలు పోటాపోటీ -అన్ని పార్టీలు యువతకే ప్రాధాన్యం ఇవ్వనున్నాయా?
పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా పోటీకి యువనేతలు పోటాపోటీ -అన్ని పార్టీలు యువతకే ప్రాధాన్యం ఇవ్వనున్నాయా?
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి భారత్ జన వికాస్ పార్టీ - బీజేపీ నో.. వైసీపీ క్లోజ్! మళ్లీ రీ-ఎంట్రీ వెనుక మర్మమేంటి?
విజయసాయిరెడ్డి భారత్ జన వికాస్ పార్టీ - బీజేపీ నో.. వైసీపీ క్లోజ్! మళ్లీ రీ-ఎంట్రీ వెనుక మర్మమేంటి?
SIR Enumeration Uncollectable Votes: తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తున్న SIR ప్రక్షాళన - లక్షల్లో ఓట్ల గల్లంతు - వాళ్లంతా ఏమయ్యారు?
తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తున్న SIR ప్రక్షాళన - లక్షల్లో ఓట్ల గల్లంతు - వాళ్లంతా ఏమయ్యారు?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Ajay Devgn: బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
Embed widget