ఇండియా గేట్‌ ని మొదట ఆల్ ఇండియా వార్ మెమోరియల్ అని పిలిచేవారు.

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

మొదటి ప్రపంచ యుద్ధం, మూడవ ఆంగ్లో-ఆఫ్ఘన్ యుద్ధంలో మరణించిన దాదాపు 82,000 మంది భారతీయ సైనికుల జ్ఞాపకార్థం దీనిని నిర్మించారు.

Image Source: pexels

ప్రఖ్యాత బ్రిటిష్ వాస్తుశిల్పి సర్ ఎడ్విన్ ల్యూటెన్స్ రూపొందించారు. ఈయననే న్యూఢిల్లీ నగర రూపకర్తగా కూడా పిలుస్తారు.

Image Source: pexels

ఇండియా గేట్ పారిస్‌లోని 'ఆర్క్ డి ట్రయంఫ్' నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. దీని ఎత్తు సుమారు 42 మీటర్లు.

Image Source: pexels

గోడల మీద యుద్ధంలో అమరులైన సుమారు 13,218 మంది సైనికుల పేర్లు చెక్కారు.

Image Source: pexels

1972లో ఇక్కడ ‘అమర్ జవాన్ జ్యోతి’ని ఏర్పాటు చేశారు. ఇది నిరంతరం వెలుగుతూనే ఉంటుంది.

Image Source: pexels

ఇండియా గేట్ కర్తవ్యపథ్ తూర్పు చివరన ఉంది. ఇది దేశ రాజధానిలో అత్యంత కీలకమైన ప్రాంతం.

Image Source: pexels

దీని నిర్మాణానికి రాజస్థాన్‌లోని భరత్‌పూర్ నుంచి తెచ్చిన ఎరుపు, పసుపు ఇసుక రాళ్లను ఉపయోగించారు.

Image Source: pexels

ఇండియా గేట్ కేవలం యుద్ధ స్మారక చిహ్నమే కాదు, జాతీయ గర్వానికి చిహ్నంగా నిలిచింది

Image Source: pexels

స్వాతంత్ర్యం తరువాత ఇదే స్మారకం 'ఇండియా గేట్' రూపంలో స్వతంత్ర భారతదేశానికి గుర్తింపుగా మారింది

Image Source: pexels

ఇండియా గేట్ నామకరణం వెనుక ఉన్న కథ ఇది.

Image Source: pexels