అన్వేషించండి

YSRCP: డిజిటల్ వార్‌కు వైఎస్ఆర్‌సీపీ భారీ ఏర్పాట్లు - జగనన్న టెక్ ఫోర్స్ రెడీ - ఏపీలో పొలిటికల్ వార్ అంతా ఆన్‌లైన్లోనే!

YSRCP digital army : వైఎస్ఆర్‌సీపీ డిజిటల్ సైన్యాన్ని జగనన్న టెక్ ఫోర్స్ పేరుతో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. టీడీపీ ఐటీడీపీ విభాగానికి ధీటుగా దీన్ని నిర్వహించనున్నారు.

YSRCP Digital Army:  ఏపీ రాజకీయాల్లో మళ్లీ పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  తన వ్యూహాలకు పదును పెడుతోంది. కేవలం క్షేత్రస్థాయి పోరాటాలకే పరిమితం కాకుండా, ఆధునిక రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తిగా మారిన డిజిటల్ మీడియాపై వైసీపీ తన ఫోకస్ మళ్లించింది. టీడీపీకి చెందిన ఐటీడీపీ కి ధీటుగా, జగనన్న టెక్ ఫోర్స్ పేరుతో సరికొత్త డిజిటల్ సైన్యాన్ని రంగంలోకి దించేందుకు సిద్ధమైంది. మారుతున్న రాజకీయ సమీకరణాలు, ముఖ్యంగా తమిళనాడులో విజయ్ సాధించిన సోషల్ మీడియా విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని వైసీపీ ఈ నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది.  

 హైదరాబాద్ వేదికగా  వార్ రూమ్ 

వైసీపీ తన టెక్ ఫోర్స్ కార్యకలాపాలకు హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకోవడం వ్యూహాత్మక చర్యగా కనిపిస్తోంది. ఇక్కడి నుంచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఒక భారీ  డిజిటల్ వార్ రూమ్ ను నడపాలని పార్టీ నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ నిఘా నీడ పడకుండా, స్వేచ్ఛగా పార్టీ తరఫున  నేరేటివ్  బిల్డ్ చేసేందుకు హైదరాబాద్ సేఫ్ జోన్ అని వైసీపీ భావిస్తోంది. ఇక్కడి నుంచే ప్రతి మండలానికి ఒక టెక్ వాలంటీర్‌ను సమన్వయం చేస్తూ, పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం మరియు విపక్షాల విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టడం ఈ బృందం ప్రధాన విధి.

 మండలానికి ఒక టెక్ వాలంటీర్ - మైక్రో లెవల్ మేనేజ్‌మెంట్ 

గతంలో వైసీపీకి సోషల్ మీడియాలో బలమైన మద్దతు ఉన్నప్పటికీ, అది కొంత అస్తవ్యస్తంగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి మండలానికి ఒక టెక్ వాలంటీర్‌ను నియమించడం ద్వారా వ్యవస్థను సంస్థాగతం  చేస్తోంది. ఈ వాలంటీర్లు కేవలం పోస్టులు పెట్టడమే కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పసిగట్టి, దానికి అనుగుణంగా డిజిటల్ కంటెంట్‌ను రూపొందిస్తారు. ఇది పార్టీకి వ్యతిరేకంగా వచ్చే ప్రతి చిన్న వార్తను ప్రాథమిక దశలోనే తుడిచిపెట్టేందుకు ఉపయోగపడుతుంది.

 నేరేటివ్ బిల్డింగ్ - మారుతున్న యుద్ధ క్షేత్రం 

ప్రస్తుత రాజకీయాల్లో ఓటరు నాడిని పట్టుకోవాలంటే వీధుల కంటే  వాల్స్  మీద యుద్ధం చేయడం అత్యవసరమైంది. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పసిగట్టడం, సంక్షేమ పథకాలపై చర్చ పెట్టడం వంటి అంశాల్లో వైసీపీ ఈ టెక్ ఫోర్స్‌ను ఒక ఆయుధంగా వాడుకోనుంది. తాజా ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి సోషల్ మీడియాను సమర్థవంతంగా వాడుకుని సక్సెస్ అయ్యింది. అదే తరహాలో పక్కా ప్లానింగ్‌తో వైసీపీ తన  డిజిటల్ ఫుట్ ప్రింట్ 'ను పెంచుకోవాలని చూస్తోంది.

 విజయ్ ఫార్ములా స్ఫూర్తితో.. 

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే  పార్టీకి సంప్రదాయ మీడియా మద్దతు పెద్దగా లేకపోయినప్పటికీ, కేవలం సోషల్ మీడియా నిఘా ,  డిజిటల్ క్యాంపెయినింగ్ ద్వారానే అద్భుతమైన ఫలితాలు సాధించారు. ఈ  డిజిటల్ వేవ్ ను చూసిన తర్వాతే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ శైలిని మార్చుకున్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో నాయకులు చేసే పనుల కంటే, అవి సోషల్ మీడియాలో ఎంత బలంగా ప్రొజెక్ట్ అవుతున్నాయనేదే ఎన్నికల ఫలితాలను శాసిస్తాయని వైసీపీ గట్టిగా నమ్ముతోంది.

 ఐటీడీపీతో తలపడేందుకు సిద్ధం 

వైసీపీ టెక్ ఫోర్స్ నేరుగా టీడీపీ ఐటీ వింగ్‌తో తలపడనుంది. ఇప్పటివరకు సోషల్ మీడియాలో టీడీపీ ఒక అడుగు ముందుండగా, ఇప్పుడు వైసీపీ ప్రొఫెషనల్ టెక్ నిపుణులను రంగంలోకి దించడం ద్వారా ఆ గ్యాప్‌ను భర్తీ చేయాలని చూస్తోంది. వైసీపీకి ఉన్న లక్షలాది మంది కార్యకర్తలను ఒకే గొడుగు కిందకు తెచ్చి, ఏకకాలంలో ఒకే నేరేటివ్‌ను రాష్ట్రమంతా వ్యాప్తి చేయడం ఈ టెక్ ఫోర్స్ అసలు లక్ష్యం. రాజకీయాల్లో మనుగడ సాగించాలంటే  డిజిటల్ స్పేస్ ను ఆక్రమించుకోవడం తప్పనిసరి అని వైసీపీ గుర్తించింది.  జగనన్న టెక్ ఫోర్స్  కేవలం ఒక వాట్సాప్ గ్రూపుల నెట్‌వర్క్ మాత్రమే కాదు, అది ఒక పక్కా పొలిటికల్ మెషినరీలా పనిచేయనుంది. రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయ పోరాటం రోడ్ల కంటే మొబైల్ స్క్రీన్ల మీదే ఎక్కువగా కనిపిస్తుందనడంలో సందేహం లేదు. వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయం ఆ పార్టీకి మళ్లీ పూర్వ వైభవాన్ని తెస్తుందో లేదో కాలమే నిర్ణయించాలి.

టాప్ హెడ్ లైన్స్

AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
Congress Public Meeting: ఈ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఇండీ కూటమి టార్గెట్ ఏంటీ?
ఈ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఇండీ కూటమి టార్గెట్ ఏంటీ?
AP TDP Janasena Social Media War: ఏపీలో కూటమికి సోషల్ సెల్ఫ్ గోల్ - చంద్రబాబు-పవన్ మైత్రి ఓకే.. మరి సోషల్ సైనికుల యుద్ధమేంటి?
ఏపీలో కూటమికి సోషల్ సెల్ఫ్ గోల్ - చంద్రబాబు-పవన్ మైత్రి ఓకే.. మరి సోషల్ సైనికుల యుద్ధమేంటి?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Embed widget