అన్వేషించండి

YSRCP Rayalaseema Movement: వైఎస్ఆర్‌సీపీ నేతల ప్రత్యేక రాయలసీమ వాదం - ఏపీ రాజకీయాల్లో విభజన ఉద్యమం ప్రారంభం కానుందా?

Rayalaseema State: వైఎస్‌ఆర్‌సీపీ రాయలసీమ నేతలు ప్రత్యేక రాష్ట్ర నినాదం అందుకోవడం ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారింది. వైసీపీ అధికారిక విధానం అదే అయితే రాబోయే రోజుల్లో డిమాండ్ మరింత పెరగనుంది.

YSRCP Rayalaseema leaders separate state slogan: ఏపీ  రాజకీయాల్లో మరోసారి విభజన సెగలు రేగుతున్నాయి. ఏపీలో అధికార మార్పిడి తర్వాత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  రాయలసీమ ప్రాంతంలో తన పట్టును నిలుపుకోవడానికి ప్రత్యేక రాయలసీమ  కార్డును తెరపైకి తెస్తోంది. అమరావతి రాజధాని అభివృద్ధిని సీమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా చూపిస్తూ, ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.  

ప్రాంతీయ సెంటిమెంట్‌తో పట్టు కోసం ప్రయత్నం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదటి నుంచి మూడు రాజధానుల  నినాదంతో రాయలసీమలో న్యాయ రాజధాని కర్నూలు  ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేస్తామని ప్రకటించడంతో, సీమకు అన్యాయం జరుగుతోందనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా వైసీపీ తన రాజకీయ ఉనికిని కాపాడుకోవాలని చూస్తోంది. అమరావతికి కేటాయించే వేల కోట్ల నిధులు సీమ సాగునీటి ప్రాజెక్టులకు మళ్లిస్తే ఆ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందనే వాదనను ఆ పార్టీ నేతలు బలంగా వినిపిస్తున్నారు.

అమరావతిని బూచి గా చూపడం వెనుక వ్యూహం

అమరావతి అభివృద్ధిని కేవలం ఒక వర్గానికి లేదా ఒక ప్రాంతానికి పరిమితమైన ప్రాజెక్టుగా చిత్రీకరించడం ద్వారా, రాయలసీమ ఓటర్లలో అభద్రతా భావాన్ని పెంచడం వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది.  అమరావతి కోసం సీమ ప్రయోజనాలను బలి ఇస్తారా  అనే ప్రశ్నను సంధించడం ద్వారా ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టి, తద్వారా అక్కడ బలమైన ఓటు బ్యాంకును సమీకరించుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. ప్రత్యేక రాష్ట్రం అనే డిమాండ్ ద్వారా భావోద్వేగాలను పతాక స్థాయికి తీసుకెళ్లడం వల్ల తటస్థ ఓటర్లను కూడా తమవైపు తిప్పుకోవచ్చనేది వారి అంచనా.

ఉద్యమం వల్ల కలిగే రాజకీయ లాభనష్టాలు

ఈ  సీమ కార్డు వైసీపీకి స్వల్పకాలికంగా లాభం చేకూర్చవచ్చు కానీ, దీర్ఘకాలంలో కొన్ని చిక్కులు వచ్చే ప్రమాదం కనిపిస్తోంది.  రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో పట్టు పెంచుకోవడానికి ఇది ఉపయోగపడవచ్చు, కానీ ఉత్తరాంధ్ర ,  కోస్తా ప్రాంతాల్లో ఈ వ్యూహం వికటించే అవకాశం ఉంది.  రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్న పార్టీ అనే ముద్ర పడితే, ఇతర ప్రాంతాల్లో వైసీపీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. గతంలో కూడా ఇటువంటి ప్రాంతీయ ఉద్యమాలు సాగినప్పుడు, ఆయా పార్టీలు ఒక ప్రాంతానికే పరిమితమైన చరిత్ర ఉంది.  ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారే తప్ప, మరో విభజన వల్ల వచ్చే తలనొప్పులను భరించే స్థితిలో లేరని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.  

కత్తి మీద సాము లాంటి వ్యూహం

వైసీపీ చేపడుతున్న ఈ ప్రత్యేక రాయలసీమ ఉద్యమం ఆ పార్టీకి ఒక కత్తి మీద సాము వంటిది. సీమలో సెంటిమెంట్‌ను రగిల్చి పట్టు సాధించాలని చూస్తున్న తరుణంలో, రాష్ట్ర సమగ్రతను కోరుకునే ఓటర్ల నుండి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. అమరావతిని వ్యతిరేకించడం ద్వారా వచ్చే రాజకీయ మైలేజీ కంటే, రాష్ట్ర విభజన వాది అనే ముద్ర పడకుండా జాగ్రత్త పడటం వైసీపీకి ఇప్పుడు అత్యంత అవసరమన్న అభిప్రాయం వినిపిస్తోంది.  ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం కంటే ప్రాంతీయ విద్వేషాలను నమ్ముకోవడం రాజకీయంగా ఎంతవరకు సఫలీకృతం అవుతుందో  చెప్పలేమన్న అభిప్రాయం వినిపిస్తోంది.  

టాప్ హెడ్ లైన్స్

Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget