ఏర్ హోస్టెస్ వృత్తికి సంబంధించి వివాహం గురించి గతంలో చాలా కఠినమైన నిబంధనలు ఉండేవి.

ప్రస్తుతం చాలా ఎయిర్‌లైన్స్ వివాహిత మహిళలను కూడా క్యాబిన్ క్రూగా నియమించుకుంటున్నాయి.

కొన్ని ఎయిర్‌లైన్స్స ర్వీస్‌లో చేరిన మొదటి 4 ఏళ్ల వరకు వివాహం చేసుకోకూడదనే రూల్ పెట్టేవి.

పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఏర్ హోస్టెస్‌ను ఉద్యోగం నుంచి తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు

గతంలో 35 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకోవాలనే రూల్. ఇప్పుడు 58 ఏళ్ల వరకూ..!

ఏర్ హోస్టెస్ గర్భం దాల్చినప్పుడు, ఆమెను వెంటనే 'ఫ్లయింగ్ డ్యూటీ' నుంచి తప్పిస్తారు.

గర్భవతిగా ఉన్న సమయంలో చాలా ఎయిర్‌లైన్స్ వారికి ఆఫీసులో లేదా గ్రౌండ్ స్టాఫ్‌గా విధులు కేటాయిస్తాయి.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏర్ హోస్టెస్‌లకు కూడా పెయిడ్ మెటర్నిటీ లీవ్స్ లభిస్తాయి.

వివాహం తర్వాత కూడా వారు రాత్రిపూట లేదా లాంగ్ ఫ్లైట్ డ్యూటీలు చేయాల్సి ఉంటుంది.

పాత కఠిన నియమాలు చాలావరకు కనుమరుగయ్యాయి. ఈ వృత్తి మరింత సౌకర్యవంతంగా,ఆధునికంగా మారింది.