అన్వేషించండి

Breaking News: చంద్రబాబుకు ఇవే లాస్ట్ ఎన్నికలు? నాన్న మృతిపై నేటికీ అనుమానాలు ఉన్నాయ్?

Breaking News: మే 21న ఏపీ, తెలంగాణతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సినీ, బిజినెస్, స్పోర్ట్స్ ఇతర రంగాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం రిఫ్రెష్ చేయండి.

LIVE

Key Events
Top Stories Today in Andhra Pradesh and Telangana breaking news on 21st may 2026 Breaking News: చంద్రబాబుకు ఇవే లాస్ట్ ఎన్నికలు? నాన్న మృతిపై నేటికీ అనుమానాలు ఉన్నాయ్?
టాప్ న్యూస్
Source : Social Media

Background

Breaking News: భారత ప్రధానమంత్రి తన ఐదు దేశాల పర్యటనను పూర్తి చేసుకుని గురువారం తెల్లవారుజామున (మే 21) భారత్‌ తిరిగి వచ్చారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీలలో విజయవంతమైన దౌత్య పర్యటనల అనంతరం ప్రధాని మోదీ తిరిగి వచ్చారు. ఈ పర్యటనలు దేశానికి అత్యంత ముఖ్యమైనవిగా అభివర్ణిస్తున్నారు. ఇంధన భద్రత, సాంకేతిక సహకారం, వాతావరణ మార్పు, రక్షణ భాగస్వామ్యాలను బలోపేతం చేయడం ఈ టూర్‌ ప్రధాన లక్ష్యాలు. 

ప్రధాని మోదీ యూఏఈ పర్యటన వల్ల ఏం సాధించారు? 

2026, మే 15న, ప్రధాని మోదీ యూఏఈని సందర్శించారు. ఆయన ఐదు దేశాల పర్యటనలో ఇది మొదటి పర్యటన. ఈ పర్యటన సందర్భంగా, అబుదాబిలో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనతో, ఇరు దేశాలు రక్షణ సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లాయి. ఇందులో భాగంగా వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్య ఫ్రేమ్‌వర్క్‌పై సంతకాలు చేశాయి. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఇంధన సంక్షోభాన్ని పరిష్కరించేందుకు, వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్‌కు 3 కోట్ల బ్యారెళ్ల ముడి చమురును అందించడానికి, ఎల్‌పిజిని సరఫరా చేయడానికి ఒప్పందం కుదిరింది. యూఏఈ భారత మార్కెట్లలో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్యాకేజీని ప్రకటించింది. అదనంగా, హోర్ముజ్ జలసంధి గుండా సురక్షిత ప్రయాణానికి ప్రధాని మోదీ, అధ్యక్షుడు నహ్యాన్ మద్దతు తెలిపారు.

ప్రధాని మోదీ నెదర్లాండ్స్ పర్యటన వల్ల ఒరిగిందేంటీ? 

ప్రధాని మోదీ నెదర్లాండ్స్‌లో కూడా పర్యటించారు, అక్కడ ఆయన సాంస్కృతిక, దౌత్య, ఆర్థిక రంగాలలో దేశానికి ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఈ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత అప్‌డేట్ చేశారు. డచ్ ప్రభుత్వం చోళ సామ్రాజ్యానికి చెందిన 11వ శతాబ్దపు రాగి ఫలకాలను భారత్‌కు అప్పగించింది. దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ ఏర్పాటుకు, సాంకేతిక సహకారం కోసం ప్రముఖ కంపెనీలైన ఏఎస్ఎంఎల్, టాటా ఎలక్ట్రానిక్స్ మధ్య ఒక ముఖ్యమైన ఒప్పందం కుదిరింది.

ప్రధాని మోదీ స్వీడన్ పర్యటన ప్రయోజనం ఏంటీ?

ప్రధాని మోదీ రెండు రోజులపాటు స్వీడన్‌లో పర్యటించారు. ఆయన పర్యటన ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపునిచ్చింది. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్లడం, జాయింట్ ఇన్నోవేషన్ పార్టనర్‌షిప్ రెండో దశను, ఇండియా-స్వీడన్ టెక్నాలజీ అండ్ ఏఐ కారిడార్‌ను ప్రారంభించడం, రాబోయే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించడం వంటి అంశాలపై ఫలవంతమైన చర్చలు జరిగాయి. స్వీడన్ ప్రజలు, స్వీడన్ ప్రభుత్వం, ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్‌సన్ చూపిన ఆప్యాయతకు, స్నేహానికి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రధాని మోదీ నార్వే పర్యటన విశేషాలు ఇవే!

ప్రధాని మోదీ నార్వేలో చారిత్రాత్మక పర్యటన చేశారు. ఈ పర్యటన దేశానికి ఆర్థిక, వ్యూహాత్మక, సాంకేతిక, దౌత్య రంగాలలో అనేక ముఖ్యమైన విజయాలను అందించింది. భారత్, నార్వే తమ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం, హరిత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఈ పర్యటన సందర్భంగా, ప్రధానంగా హరిత హైడ్రోజన్, పవన శక్తి, కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీలలో సహకారాన్ని పెంపొందించే రంగాలకు సంబంధించి మొత్తం 12 ప్రధాన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. దేశానికి 7,000 కిలోమీటర్లకుపైగా ఉన్న తీరప్రాంత అభివృద్ధి, హరిత నౌకాయానం, ఓడరేవు మౌలిక సదుపాయాలపై ఉమ్మడి కృషి, బాహ్య అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాల కోసం ఉపయోగించడంపై పరిశోధనల కోసం ఇస్రో, నార్వేల మధ్య ఒక ప్రత్యేక ఒప్పందం కుదిరింది. 

ప్రధాని మోదీ తన ఇటలీ పర్యటన ద్వారా ఏమి పొందారు?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఐదు దేశాల పర్యటనను ఇటలీతో పూర్తి చేశారు. ఇక్కడ, ఆయన ప్రతిష్టాత్మకమైన విల్లా డోరియా పాంఫిలిలో ఇటలీ  ప్రధానమంత్రి జార్జియా మెలోనితో సమావేశమయ్యారు. ప్రధానమంత్రికి లాంఛనప్రాయ గౌరవ వందనం లభించింది. ప్రతినిధి బృందాల స్థాయి చర్చలు జరిగాయి. ఇద్దరు నాయకులు సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025-29 అమలులో పురోగతిని సమీక్షించారు. ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, రక్షణ, బ్లూ ఆర్థిక వ్యవస్థ, అనుసంధానం, విద్య రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి అంగీకరించారు. అంతేకాకుండా, భౌగోళిక రాజకీయాలకు సంబంధించిన పరిణామాలపై కూడా చర్చించారు.

12:06 PM (IST)  •  21 May 2026

YS Jagan Latest News: ఎవరిది గొడ్డలి పార్టీ? గన్ కల్చర్‌? ఎవరి హత్యా రాజకీయాలు?: జగన్ 

YS Jagan Latest News: "మా కుటుంబంలో ముగ్గురు మా తాత, మా నాన్న, చిన్నాన్న ముగ్గురు బలైపోయారు. మేం బాధితులం. కానీ మా పైనే తప్పుడు రాజకీయాలు చంద్రబాబు చేయిస్తున్నారు. రాజారెడ్డిని చెప్పిందెవరు? టీడీపీ వాళ్లు కాదా, ఈ ఘటన చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జరగలేదా అని అడుగుతున్నాను. 1999 అసెంబ్లీ ఎన్నికల ముందు రాజారెడ్డిని చంపేశారు. కేవలం రాజశేఖర్‌ను పులివెందులకే కట్టడి చేయాలని, రాజకీయ కోణంతో ఈ పని చేశారు. ఆ కేసులో దోషులను బరితెగించి హైదరాబాద్‌ టీడీపీ ఆఫీస్‌లో పెట్టి అధికార దుర్వినియోగం చేసి రక్షించారు. ఎవరిది క్రిమినల్ బ్రెయిన్ అని చంద్రబాబును అడుగుతున్నాను. 

మా నాన్న విషయంలోనూ అంతే, చనిపోక ముందే అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తా అన్నారు. రెండు మూడు రోజులకే రాజశేఖర్ రెడ్డి చనిపోయారు. ఇప్పటికీ ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఎవరిదీ హత్యా రాజకీయాలు చంద్రబాబు. వివేకానంద రెడ్డి ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో హత్యకు గురయ్యారు. వైసీపీ కోసం అవినాష్ రెడ్డి కోసం ప్రచారం చేసి వచ్చారు. తానే చంపినట్టు చెలరేగిపోయి మాట్లాడిన దస్తగిరి అనే వ్యక్తి ఇవాళ స్వేచ్ఛగా పోలీసుల సెక్యూరిటీలో కారులో తిరుగుతున్నారు. చంద్రబాబు లాయర్‌, దస్తగిరి లాయర్ కూడా ఒక్కరే. రాజకీయ లబ్ధి కోసం ప్రలోభాలతో హంతకులను రక్షిస్తున్నారు. 

చంద్రబాబు బావమరిది బాలకృష్ణ గన్ పట్టుకొని ఇద్దర్ని కాల్చిపడేయలేదా. ఎవరిది గన్ కల్చర్ అని అడుగుతున్నాను. ఆ తర్వాత సాక్ష్యం ఉండకూడదని ఆ ఇంట్లో ఉన్న వాచ్‌మెన్‌ను బండరాయితో కొట్టి చంపేశారు. హరికృష్ణ ప్రమాదంలో చనిపోతే పరామర్శకు వెళ్లి కేటీఆర్‌తో పొత్తులపై చంద్రబాబు మాట్లాడారు. ఎవరిది శవ రాజకీయాలు. 

కూతురును ఇచ్చి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని గుర్తును లాక్కొని చనిపోయేలా చేసింది ఎవరని అడుగుతున్నాను. వంగవీటి మోహన్ రంగా ఎలా చనిపోయారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిరాహార దీక్ష చేస్తుంటే అర్ధరాత్రి నరికి చంపారు. ఈ ఘటనలో వేళ్లు అన్నీ కూడా చంద్రబాబు వైపే చూస్తున్నాయి. హరిరామజోగయ్య ఏకంగా పుస్తకం రాశారు. ఆ హత్యకేసులో ప్రధాన నిందితుడు వెలగపూడి రామకృష్ణ నేటికీ టీడీపీ ఎమ్మెల్యే. 

ఎన్టీఆర్‌పై దాడి చేసిన కేసులో మల్లెల బాబ్జీని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన కొన్ని రోజులకే డెడ్‌బాడీగా మారాడు. ఆయన జేబులో లెటర్ దొరికింది. మూడు లక్షలు ఇస్తానని చెప్పారని ఉందని ఆ డబ్బులు ఇచ్చింది ఎవరు అనే విషయంపై దర్యాప్తు లేదు. ఈ కేసులో వెళ్లన్నీ అప్పట్లో చంద్రబాబు వైపే చూపించాయి. పింగలి దశరథ్‌రామ్‌  అనే జర్నలిస్ట్‌ను కత్తులతో దాడి చేసి చంపారు. ఈ ఘటనలో చంద్రబాబు వైపే వేళ్లని చూపించాయి.'

Load More
New Update
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

VIP తరహా జర్నీ కోరుకుంటున్నారా? సేఫ్టీ, ఫీచర్లలో ఈ 3 లగ్జరీ MPVలు అదుర్స్
VIP తరహా జర్నీ కోరుకుంటున్నారా? సేఫ్టీ, ఫీచర్లలో ఈ 3 లగ్జరీ MPVలు అదుర్స్
Hyderabad మెట్రో విస్తరణను కేంద్ర మంత్రి అడ్డుకుంటున్నారు.. కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి: Revanth Reddy
Hyderabad మెట్రో విస్తరణను కేంద్ర మంత్రి అడ్డుకుంటున్నారు.. కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి: Revanth Reddy
Shreyas Iyer News: గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్
గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్
Splendor Plus Flex Fuel Bike EMI: హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ లాంచ్: పెట్రోల్ తో పనిలేకుండా ఇథనాల్ తో నడిచే సరికొత్త మోడల్..  నెలకు ఎంత ఈఎంఐ కట్టాలో పూర్తి డీటెయిల్స్
హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ లాంచ్: పెట్రోల్ తో పనిలేకుండా ఇథనాల్ తో నడిచే సరికొత్త మోడల్..  నెలకు ఎంత ఈఎంఐ కట్టాలో పూర్తి డీటెయిల్స్
Advertisement

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shreyas Iyer News: గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్
గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్
School Holidays: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
Tiger Hunt in Polavaram: ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
Ramani Kalyanam OTT : ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ డ్రామా - 3 వారాల్లోపే స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ డ్రామా - 3 వారాల్లోపే స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
B.Tech Student Missing: హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
Kamal Haasan : పుష్పక విమానం సీక్వెల్... 45 ఏళ్ల క్రితం స్టోరీ - కట్ చేస్తే సింగ్ గీతం... కమల్ హాసన్ చెప్పిన సీక్రెట్
పుష్పక విమానం సీక్వెల్... 45 ఏళ్ల క్రితం స్టోరీ - కట్ చేస్తే సింగ్ గీతం... కమల్ హాసన్ చెప్పిన సీక్రెట్
Manav Suthar Dream Debut: 25 ఏళ్ల రికార్డు బద్దలు.. టెస్ట్ డెబ్యూ లోనే మానవ్ సుతార్ హిస్టారికల్ రికార్డ్.. మొదటి ఓవర్లోనే ఊహించని ట్విస్ట్
25 ఏళ్ల రికార్డు బద్దలు.. టెస్ట్ డెబ్యూ లోనే మానవ్ సుతార్ హిస్టారికల్ రికార్డ్.. మొదటి ఓవర్లోనే ఊహించని ట్విస్ట్
UGC Net Exam schedule: యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
Embed widget