అన్వేషించండి

Ebola Virus : ఆఫ్రికాలో మళ్లీ ఎబోలా కలకలం.. బుండిబుగ్యో రకంపై WHO అత్యవసర హెచ్చరికలు

Ebola Outbreak : ఆఫ్రికాలో మరోసారి ఎబోలా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే 139 మంది చనిపోవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కాంగో, ఉగాండాలో ఎబోలా వేగంగా వ్యాపిస్తోంది, 600 కేసులు, 139 మరణాలు నమోదయ్యాయి.
  • బుండిబుగ్యో అనే అరుదైన, ప్రమాదకరమైన స్ట్రెయిన్ వ్యాపిస్తోంది, దీనికి నిర్దిష్ట చికిత్స లేదు.
  • ఎబోలా రక్తం, శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది, గాలి ద్వారా వ్యాపించదు.
  • ప్రయాణ ఆంక్షలు, చేతుల పరిశుభ్రత వంటి జాగ్రత్తలు తీసుకోవాలని WHO సూచించింది.

WHO On Ebola Outbreak : ఆఫ్రికాలోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండాలో మరోసారి ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు విషయాలు వెల్లడించింది. ఇప్పటివరకు 600కు పైగా ఎబోలా అనుమానిత కేసులు నమోదు కాగా.. 139 మరణాలు జరిగినట్లు WHO (World Health Organization) తెలిపింది. ఈ పరిస్థితిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించి.. పలు సూచనలు చేసింది.

బుండిబుగ్యో రకం..

ఈసారి వ్యాపిస్తోన్న ఎబోలా వైరస్ స్ట్రెయిన్ బుండిబుగ్యో. ఇది చాలా అరుదైన రకమని చెప్తున్నారు నిపుణులు. ఇది సాధారణ ఎబోలా కంటే తక్కువగా కనిపించినా.. చాలా ప్రమాదకరమని చెబుతున్నారు. ప్రస్తుతం దీనికి ప్రత్యేక వ్యాక్సిన్ లేదా నిర్దిష్ట చికిత్స అందుబాటులో లేదని అంటున్నారు.

ఎబోలా ఎలా వ్యాపిస్తుంది?

ఎబోలా వైరస్ సోకిన వ్యక్తి రక్తం, శరీర ద్రవాలు లేదా కలుషిత వస్తువుల ద్వారా వ్యాపిస్తుంది. అయితే ఇది గాలి ద్వారా వ్యాపించదని నిపుణులు చెబుతున్నప్పటికీ.. దగ్గర సంబంధాల ద్వారా వేగంగా సోకే అవకాశం ఉంటుందని మాత్రం హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆస్పత్రులు, సంరక్షణ కేంద్రాల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు.

ఎబోలా లక్షణాలు ఇవే

వైరస్ సోకిన 2 నుంచి 21 రోజుల మధ్య లక్షణాలు కనిపించొచ్చు. ప్రారంభంలో జ్వరం, అలసట, కండరాల నొప్పులు, తలనొప్పి వంటి ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి. తర్వాత తీవ్రమైన వాంతులు, విరేచనాలు, చర్మంపై దద్దుర్లు, కొన్ని సందర్భాల్లో రక్తస్రావం కూడా జరగొచ్చు. పరిస్థితి విషమిస్తే అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

అప్రమత్తమవుతోన్న దేశాలు

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల మేరకు.. ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో అమెరికా CDC అప్రమత్తమైంది. ఇటీవల DRC, ఉగాండా, సౌత్ సూడాన్ వెళ్లి వచ్చిన విదేశీయులపై ప్రయాణ ఆంక్షలు విధించింది. అలాగే అక్కడికి వెళ్లొద్దని అమెరికా ఇప్పటికే తన పౌరులకు సూచించింది.
ప్రస్తుతం అమెరికా వంటి దేశాలకు ముప్పు తక్కువగానే ఉందని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఎబోలా కరోనా లాగా గాలి ద్వారా వ్యాపించదు. అయినప్పటికీ భారీ స్థాయిలో కేసులు నమోదవుతుండటంతో ప్రపంచ ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎబోలా ప్రభావిత ప్రాంతాలకు వెళ్లేవారు అనారోగ్యంతో ఉన్నవారికి దూరంగా ఉండాలి. చేతుల పరిశుభ్రత పాటించడంతో పాటు లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిగా మారే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ.. పరిస్థితిని నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget