అన్వేషించండి

Thyroid Medicine : థైరాయిడ్ మందులు మధ్యలో మానేస్తున్నారా? అయితే ఈ ప్రమాదాల తప్పవంటోన్న వైద్యులు

World Thyroid Day 2026 : థైరాయిడ్ మందులు వైద్యుల సూచనలు లేకుండా ఆపకూడదని.. అలా మానేస్తే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తప్పవని అంటోన్నారు నిపుణులు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • థైరాయిడ్ గ్రంథి బరువు, గుండె, మెదడు, సంతానోత్పత్తిని నియంత్రిస్తుంది.
  • మందులు ఆపితే అలసట, బరువు పెరగడం, డిప్రెషన్ వస్తాయి.
  • మహిళల్లో పీరియడ్స్, గర్భధారణలో సమస్యలు, పురుషుల్లో లైంగిక సమస్యలు వస్తాయి.
  • మందులు వాడకపోతే కొలెస్ట్రాల్, గుండె ఆరోగ్యం దెబ్బతింటాయి.

Thyroid Medicine Stopping Risks : థైరాయిడ్ సమస్యలు ఈరోజుల్లో ఆడవారినే కాదు.. మగవారిని కూడా ఇబ్బంది పెడుతున్నాయి. అయితేమ మీకు థైరాయిడ్ ఎంత ఉన్నా.. వైద్యులు మీకు మెడిసన్ సూచిస్తే వాటిని కచ్చితంగా ఉపయోగించాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇవి సాధారణ మందులు కావు. శరీరానికి అత్యవసరమైన హార్మోన్‌కు ప్రత్యామ్నాయంగా పనిచేస్తాయి. ముఖ్యంగా హైపోథైరాయిడిజం ఉన్నవారు లెవోథైరాక్సిన్ మందులు తీసుకుంటే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుందో.. నిపుణులు ఇచ్చే సూచనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

థైరాయిడ్ గ్రంథి విధులు..

థైరాయిడ్ గ్రంథి శరీరంలోని అనేక ముఖ్యమైన పనులను నియంత్రిస్తుంది. బేసల్ మెటబాలిక్ రేట్, గుండె స్పందన, మెదడు పనితీరు, సంతానోత్పత్తి సామర్థ్యం, శరీర ఉష్ణోగ్రత వంటి కీలక వ్యవస్థలు థైరాయిడ్ హార్మోన్‌పై ఆధారపడి ఉంటాయి. అందుకే థైరాయిడ్ హార్మోన్ తక్కువైతే శరీరం నెమ్మదిగా పనిచేయడం ప్రారంభిస్తుంది.

థైరాయిడ్ మెడిసన్ మానేస్తే..

వైద్యుల సూచనలు లేకుండా.. థైరాయిడ్ మందులు మానేయడం మంచిది కాదని.. అమీర్​పేట్​లోని ఆస్టెర్ ప్రైమ్ హాస్పిటల్​లో ఎండోక్రైనాలజిస్ట్​గా చేస్తోన్న డాక్టర్ నాగ భాగ్యశ్రీ మంగం తెలిపారు. సోషల్ మీడియాలో ప్రభావంతో కొందరు వీటిని మానేస్తున్నారని.. కానీ అలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని చెప్తున్నారు.


Thyroid Medicine : థైరాయిడ్ మందులు మధ్యలో మానేస్తున్నారా? అయితే ఈ ప్రమాదాల తప్పవంటోన్న వైద్యులు

థైరాయిడ్ సమస్య ఉండి.. మందులు వాడకుంటే.. అలసట, బరువు పెరగడం, మలబద్ధకం, చర్మం పొడిబారడం, జుట్టు రాలడం, ఏకాగ్రత తగ్గడం, నిద్ర ఎక్కువగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. అలాగే కొందరిలో డిప్రెషన్ వంటి మానసిక రుగ్మతలు కూడా పెరుగుతాయంటున్నారు.

సంతాన సమస్యలు పెరుగుతాయి..

మహిళలు థైరాయిడ్ సమస్యను నిర్లక్ష్యం చేసి మందులు వాడకుంటే.. పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, గర్భం దాల్చడంలో ఇబ్బందులు, గర్భస్రావం ప్రమాదం, గర్భధారణ సమయంలో సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయని డాక్టర్ నాగ భాగ్యశ్రీ తెలిపారు. అలాగే పురుషుల్లో ఎనర్జీ తగ్గడం, కండరాల బలహీనత, లైంగిక ఆరోగ్య సమస్యలు, కొన్నిసార్లు సంతాన సమస్యలు కూడా రావచ్చు.

సరైన చికిత్స తీసుకుంటే..

థైరాయిడ్ మెడిసన్ కొన్ని రోజుల మానేస్తే పెద్ద సమస్యలు కనిపించకపోవచ్చు. కానీ వారాలు లేదా నెలల పాటు నిర్లక్ష్యం చేస్తే కొలెస్ట్రాల్ స్థాయులు పెరగడం, గుండె ఆరోగ్యంపై ప్రభావం పడటం, మొత్తం ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సరైన చికిత్స తీసుకుంటే దీనిని చాలా వరకు నియంత్రించవచ్చని సూచిస్తన్నారు.

ప్రతిరోజూ ఖాళీ కడుపుతో వైద్యులు సూచించిన విధంగా మాత్రలు తీసుకోవాలని.. ఏడాదికి కనీసం రెండుసార్లు థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవడం చాలా అవసరమని చెప్తున్నారు. మందులతో థైరాయిడ్ టెస్ట్ నార్మల్‌గా ఉందంటే చికిత్స ఆపాలనే కాదు.. అదే విధంగా కొనసాగించాలనే అర్థమంటున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే థైరాయిడ్ ఉన్నవారు కూడా పూర్తిగా సాధారణ, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చని అంటున్నారు. 

ఇలాంటి మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం దీనిని క్లిక్ చేయండి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Repeated Pregnancy : 13 సార్లు అబార్షన్.. 14వ సారి గర్భం దాల్చిన మహిళ.. తల్లి, బిడ్డ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
13 సార్లు అబార్షన్.. 14వ సారి గర్భం దాల్చిన మహిళ.. తల్లి, బిడ్డ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
DIY Body Scrub : ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
Dussehra Navratri Day 2 : దసరా స్పెషల్ రెండో రోజు శ్రీ గాయత్రి దేవికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రవ్వకేసరి, పులిహోర, కొబ్బరి అన్నం రెసిపీలు ఇవే
దసరా స్పెషల్ రెండో రోజు శ్రీ గాయత్రి దేవికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రవ్వకేసరి, పులిహోర, కొబ్బరి అన్నం రెసిపీలు ఇవే
Drumstick Chicken Curry : మునగకాయ చికెన్ కర్రీ రెసిపీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, రుచి అదిరిపోతుంది
మునగకాయ చికెన్ కర్రీ రెసిపీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, రుచి అదిరిపోతుంది

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Vijayawada Temple: రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
DIY Body Scrub : ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
Mamata Banerjee : బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
NDA Seat Sharing: స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
Embed widget