అన్వేషించండి

Night Heat Wave : నైట్ హీట్ వేవ్ వల్ల డెత్ రేట్ పెరుగుతుందంట.. రాత్రుళ్లు పెరిగే ఉష్ణోగ్రతలతో జాగ్రత్త అంటోన్న నిపుణులు

Night Heat Wave Alert : పగలే కాదు రాత్రుళ్లు కూడా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇలాంటి వేడిలో ఉంటే వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసేద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రాత్రివేళ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు, ఆరోగ్యానికి ప్రమాదం.
  • రాత్రివేడి వల్ల గుండెపోటు, బీపీ, షుగర్ సమస్యలు.
  • శరీరం హైడ్రేటెడ్​గా ఉండాలి, యోగా, ధ్యానం చేయాలి.
  • గదిలో వెంటిలేషన్, ఏసీ వాడకం, వ్యాయామం తగ్గించాలి.

Nighttime Heatwaves Side Effects : తెలుగు రాష్ట్రాల్లో పగలు ఉష్ణోగ్రతలు దాదాపు 50 చేరుకుంటున్నాయి. ప్రతి ప్రాంతంలో 40 డిగ్రీలు పైగానే టెంపరేచర్ ఉంటుంది. పగలు బయటకు వెళ్లడమంటే సాహసం అనే చెప్పాలి. అయితే ఈ ఉష్ణోగ్రతలు రాత్రుళ్లు కూడా పెరుగుతున్నాయి. 27 నుంచి 30 మధ్య ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. మరి నైట్ హీట్ వేవ్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసేద్దాం. 

నైట్ హీట్ వేవ్ వల్ల మోర్టాలటీ రేట్ 6.7 శాతం పెరుగుతుందని ఓ అధ్యయనంలో తేలినట్లు నిపుణులు చెప్తున్నారు. పగటివేళ వేడి కంటే.. రాత్రి వేళ వేడి మరింత డేంజర్ అని యశోద హాస్పిటల్స్​లో సీనియర్ కన్సల్టెంట్​ ఫిజీషియన్​గా చేస్తోన్న డాక్టర్ దిలీప్ గూడె తెలిపారు. ఎందుకంటే రాత్రుళ్లు శరీరం తనని తాను రిపేర్ చేసుకుంటుంది. శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపుతుంది. ఇలాంటి సమయంలో.. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల బాడీ టెంపరేచర్​ కూడా పెరుగుతుందని.. దీనివల్ల హార్ట్ ఎటాక్ రిస్క్ పెరుగుతుందని తెలిపారు. 

నైట్ హీట్ వేవ్ వల్ల వచ్చే సమస్యలు..

రాత్రుళ్లు వేడి వల్ల నిద్ర సరిగ్గా లేకపోవడం.. దీంతో పగలు హార్ట్ రేట్ 90 వరకు వెళ్లడం జరుగుతుంది. సాధారణంగా కంటే గుండె ఎక్కువగా పనిచేస్తుంది. అలాగే బీపీ పెరిగి, షుగర్ అదుపులో ఉండదు. అలాగే ఈ వేడి వల్ల డీహైడ్రేట్ అయ్యి కిడ్నీ సమస్యలు పెరుగుతాయని.. అందుకే నైట్ హీట్ వేవ్స్​ని లైట్ తీసుకోవద్దని డాక్టర్ దిలీప్ సూచిస్తున్నారు. నిజం చెప్పాలంటే పగటి హీట్​ వేవ్ కంటే నైట్ హీట్​ వేవ్ చాలా డేంజర్ అని తెలిపారు. కాబట్టి రాత్రుళ్లు రూమ్ టెంపరేచర్​ తక్కువగా ఉండేలా చూసుకోవాలంటున్నారు. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నీళ్లు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి కచ్చితంగా తీసుకోవాలని.. రోజుకు కనీసం 3.5 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగాలని సూచించారు. దాహం లేకున్నా తాగాలని.. హైడ్రేటెడ్​గా ఉండడం శరీరానికి మంచిదని చెప్తున్నారు. ఈ సమయంలో ఎక్కువగా యూరిన్​కి వెళ్లాల్సి వచ్చినా మంచిదేనన్నారు. యోగాతో ఒత్తిడి తగ్గి నిద్ర పడుతుంది. అలాగే శరీరం ఉష్ణోగ్రతలు కాస్త అదుపులోకి వస్తాయని.. కాబట్టి మెడిటేషన్, యోగా చేయాలంటున్నారు. 

గదిలో చేయాల్సిన మార్పులు 

గదిలో ఉష్ణోగ్రతలు తగ్గాలంటే.. వెంటిలేషన్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. మొత్తం రూమ్ క్లోజ్ చేయకుండా విండో ఓపెన్ చేసి.. లోపలికి గాలి వచ్చేలా చూసుకోవాలని.. దీనివల్ల గదిలోని వేడి కాస్త తగ్గుతుందని చెప్తున్నారు. ఏసీ వేసుకుంటే విండో క్లోజ్ చేసి.. 26 లేదా 27లో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. వ్యాయామాలు కూడా తక్కువగా చేయాలని సూచిస్తున్నారు. ఎక్కువగా చేస్తే బాడీ త్వరగా డీహైడ్రేట్ అయిపోతుందని ఇది మంచిది కాదని చెప్తున్నారు. దీనివల్ల రక్తం గడ్డకట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. 

తేలికైనా కాటన్ దుస్తులు వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నేరుగా సన్ మీపై పడకుండా చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వీటిని ఫాలో అయితే హార్ట్ ఎటాక్స్ రాకుండా.. షుగర్, బీపీ అదుపులో ఉంటుందని.. కిడ్నీ సమస్యలు కూడా పెరగకుండా ఉంటాయని తెలిపారు దిలీప్. కాబట్టి మీరు కూడా నైట్ హీట్ వేవ్స్ లైట్ తీసుకోకుండా.. ఆరోగ్యంగా ఉండేందుకు ఈ టిప్స్ ఫాలో అయిపోండి. 

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget