అన్వేషించండి

Cucumber Water : వేసవిలో కీరా వాటర్ తాగితే కలిగే లాభాలివే.. హైడ్రేషన్ నుంచి బరువు తగ్గేవరకు ఎన్నో లాభాలు

Cucumber Water in Summer : సమ్మర్లో కీరా నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. దీనివల్ల శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కీరా వాటర్ తాగితే శరీరానికి మంచి హైడ్రేషన్ లభిస్తుంది.
  • చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, మెరిసేలా చేస్తుంది.
  • బరువు తగ్గడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
  • రక్తపోటును నియంత్రించి, ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

Beat the Heat with Cucumber Water : ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఈ సమయంలో శరీరానికి సరైన హైడ్రేషన్ చాలా అవసరం. అందుకే చాలామంది నీరు తీసుకోవడంతో పాటు.. వాటర్ బేస్డ్ ఫుడ్ కూడా తీసుకుంటారు. అలాంటి వాటిలో కీరాదోస కూడా ఒకటి. అయితే వీటిని నేరుగా కాకుండా వాటర్ రూపంలో తీసుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. కీరాదోసను ముక్కలుగా కోసి.. నీళ్లలో నానబెట్టండి. అవే కీరా వాటర్ (Cucumber Water). ఇది సింపుల్, రిఫ్రెషింగ్ డ్రింక్​గా పనిచేయడమే కాకుండా.. వేసవిలో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందిస్తుంది. అవేంటంటే.. 

హైడ్రేషన్

శరీరం సరిగ్గా పనిచేయాలంటే తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. నీళ్లు తక్కువగా తాగితే అలసట, తల తిరగడం, చర్మం ఎండిపోవడం, దృష్టి మందగించడం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి రోజుకు 8 నుంచి 12 గ్లాసుల నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే కీరా వాటర్ తాగడం వల్ల ఈ హైడ్రేషన్‌ను మరింత రుచికరంగా పొందవచ్చు.

మెరిసే చర్మం 

మీరు గ్లోయింగ్ స్కిన్ కోసం ప్రయత్నిస్తుంటే.. కీరా నీళ్లు మీకు బాగా హెల్ప్ చేస్తాయి. కీరాలో విటమిన్ C, బీటా-క్యారోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మం ఎండవల్ల నల్లగా మారకుండా కాపాడుతాయి. స్కిన్ హైడ్రేషన్ పెంచి.. సహజ కాంతిని ఇస్తాయి. అలాగే ఫ్రీ రాడికల్స్‌ వల్ల వచ్చే వృద్ధాప్య లక్షణాలను కూడా దూరం చేస్తాయి.

బరువు తగ్గేందుకు..

కీరా నీళ్లల్లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దాహం తీర్చుకోవడం కోసం సోడా, జ్యూస్‌లు తాగేందుకు బదులుగా దీనిని తాగితే.. అదనపు క్యాలరీలు తగ్గుతాయి. ఆకలి, బరువు నియంత్రణలో ఉంటుంది. కడుపు నిండుగా ఉండి.. ఎక్కువసేపు తృప్తిగా ఉంటుంది. డైట్‌తో కలిపి తీసుకుంటే మెటబాలిజం కూడా మెరుగుపడుతుంది. దీనివల్ల శరీరంలోని ఫ్యాట్ బర్న్ అవుతుంది.  

ఎముకల ఆరోగ్యం

కీరాలో విటమిన్ K ఉంటుంది. ఇది బలమైన ఎముకలను అందిస్తుంది. అలాగే శరీరంలో ప్రోటీన్ల నిర్మాణానికి సహాయపడుతుంది. ఈ బెనిఫిట్ కావాలంటే మీరు కీరా వాటర్తో పాటు.. కీరా ముక్కలు కూడా తినాల్సి ఉంటుంది.

డిటాక్స్ డ్రింక్‌

కీరా నీళ్లు శరీరాన్ని సహజంగా డిటాక్స్ చేస్తాయి. కడుపు ఉబ్బరాన్ని తగ్గించి.. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపడంలో హెల్ప్ చేస్తాయి. మీరు దీనిలో నిమ్మ, పుదీనా, అల్లం వంటి పదార్థాలు కూడా కలిపి తీసుకోవచ్చు. దీనివల్ల మరిన్ని బెనిఫిట్స్ పొందవచ్చు.

రక్తపోటు నియంత్రణకై..

కీరాలో ఉండే పొటాషియం శరీరంలోని అధిక సోడియాన్ని బయటకు పంపిస్తుంది. అలాగే రక్తనాళాలను రిలాక్స్ చేస్తుంది. దీంతో బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉంటుంది. 

సైడ్ ఎఫెక్ట్స్

కీరా నీళ్లు సేఫ్ ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ.. ఎక్కువగా తాగితే కొందరికి కడుపు ఉబ్బరం రావచ్చు. అలాగే కీరాను బాగా కడగకుండా వాడితే పురుగుల మందుల ప్రమాదం ఉంటుంది. అలెర్జీ ఉన్నవారికి చర్మ సమస్యలు కూడా రావచ్చు.

కీరా వాటర్ తయారీ..

కీరా ముక్కలను నీళ్లలో వేసి 2 గంటలు ఫ్రిజ్‌లో ఉంచండి. ఎక్కువ రుచి కోసం మరిన్ని ముక్కలు వేసుకోవచ్చు. అలాగే 2-3 రోజుల్లోనే ఈ నీటిని వాడేయాలి. కీరా ముక్కలను కూడా తింటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ చిన్న అలవాటు మీకు పెద్ద ప్రయోజనాలు ఇస్తుంది. వేసవిలో హెల్తీగా ఉండాలంటే ఇది మీ హెల్త్ టిప్ మీ డైట్ రొటీన్లో చేర్చుకోవాలి. 

ోే

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
Curry Leaves and Hair Oil : జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Embed widget