అన్వేషించండి

Liver Fibrosis in Diabetics : షుగర్ ఉన్నవారికి కొత్త ప్రమాదం.. ప్రతి 4 మధుమేహ రోగుల్లో ఒకరికి లివర్ ఫైబ్రోసిస్, న్యూ స్టడీలో షాకింగ్ విషయాలు

Silent Liver Damage in Diabetes : ఇన్సులిన్ నిరోధకత వల్ల కాలేయానికి నష్టం జరుగుతుందని తాజా అధ్యయనం తెలిపింది. మధుమేహం ఉన్నవారిలో లివర్ ఫైబ్రోసిస్ పెరుగుతుందని వెల్లడించింది. ఇది ఎంత ప్రమాదకరమంటే..

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రతి నలుగురు మధుమేహ రోగులలో ఒకరికి లివర్ ఫైబ్రోసిస్ ఉందని అధ్యయనం.
  • డయాబెటిస్ ఇప్పుడు కాలేయాన్ని కూడా ప్రభావితం చేస్తుంది, MASLD ప్రారంభమవుతుంది.
  • టైప్ 2 డయాబెటిస్‌లో 70% మందిలో కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది.
  • ఫైబ్రోసిస్‌ను గుర్తించడం, బరువు నియంత్రణ, వ్యాయామం నివారణకు ముఖ్యం.

Diabetics at Risk of Liver Fibrosis : ప్రతి నలుగురు మధుమేహ రోగులలో ఒకరికి లివర్ ఫైబ్రోసిస్ ఉన్నట్లు తాజా అధ్యయనం గుర్తించింది. డయాబెటిస్ అనేది ఇకపై కళ్లు, మూత్రపిండాలు, నరాలకు మాత్రమే పరిమితం కాకుండా.. కాలేయంపై కూడా ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. అందుకే మధుమేహుల్లో కాలేయ వ్యాధిని దాని నాల్గవ ప్రధాన సమస్యగా పరిగణించాలని నిపుణులు చెప్తున్నారు. తాజా అధ్యయనంలో తెలిసిన షాకింగ్ విషయాలు ఏంటి? కాలేయంపై షుగర్ ప్రభావం ఎలా ఉంటుందో చూసేద్దాం. 

మధుమేహం కేవలం రక్తంలోని చక్కెర స్థాయిలకే పరిమితం అనే భావన నుంచి బయటకు రావాలని చెప్తున్నాయి వివిధ అధ్యయనాలు. 2026లో జరిగిన 'డయాఫిబ్-లివర్ స్టడీ' అనే మల్టీ సెంటర్స్ స్టడీ షాకింగ్ విషయాలు తెలిపింది. భారతదేశంలో టైప్ 2 మధుమేహం ఉన్న నలుగురు రోగులలో.. ఒకరికి లివర్ ఫైబ్రోసిస్ ఉన్నట్లు తెలిపింది. అంటే షుగర్ ఉన్నవారిలో కాలేయం తీవ్రంగా దెబ్బతినడం జరుగుతుందని ఈ అధ్యయనం వెల్లడించింది. అంతేకాకుండా.. ప్రతి 20 మంది రోగులలో ఒకరికి సిర్రోసిస్ వచ్చే ప్రమాదం కూడా ఉందని తెలిపింది.

అధ్యయనంలో షాకింగ్ విషయాలు

ఈ అధ్యయనం ప్రకారం.. మధుమేహం ఇకపై కేవలం కళ్లు, మూత్రపిండాలు, నరాలకు మాత్రమే పరిమితం కాకుండా కాలేయాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ పరిశోధన ప్రత్యేకంగా జీవక్రియ లోపాలతో సంబంధం ఉన్న స్టీటోటిక్ లివర్ డిసీజ్ (MASLD) పై దృష్టి సారించింది. దీనిని గతంలో ఫ్యాటీ లివర్ అని పిలిచేవారు. ఇన్సులిన్ నిరోధకత పెరిగి.. కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుపోయినప్పుడు MASLD ప్రారంభమవుతుంది. ఈ కొవ్వు క్రమంగా వాపును కలిగిస్తుంది. చివరికి ఫైబ్రోసిస్‌కు దారితీస్తుంది. దీనిలో ఆరోగ్యకరమైన కాలేయ కణజాలం మచ్చ కణజాలంతో భర్తీ అవుతుంది. 

నిపుణులు ఏమంటున్నారంటే..

టైప్ 2 డయాబెటిస్‌లో శరీరంలోని కొవ్వు, గ్లూకోజ్‌ల మధ్య ఏర్పడిన అసమతుల్యత.. కాలేయంపై కూడా ప్రభావం చూపుతుందని డాక్టర్ కపిల్ శర్మ తెలిపారు. గణాంకాల ప్రకారం.. దాదాపు 70 శాతం మధుమేహ రోగులలో కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇది కాలక్రమేణా వాపు, ఫైబ్రోసిస్‌కు దారితీస్తుంది. ఊబకాయం, మధుమేహంపై సరైన నియంత్రణ లేకపోవడం, అధిక ట్రైగ్లిజరైడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి అనేక ప్రమాద కారకాలు ఈ వ్యాధికి ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా చాలా సందర్భాలలో.. ఎటువంటి స్పష్టమైన లక్షణాలు లేకుండానే కాలేయ వ్యాధి ముదిరి.. ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.

ఫైబ్రోసిస్ మరింత ప్రమాదకరం 

కాలేయంలో కేవలం కొవ్వు పేరుకుపోవడం కంటే.. ఫైబ్రోసిస్ మరింత ప్రమాదకరమని పరిశోధనలు చెప్తున్నాయి. ఫైబ్రోసిస్ అనేది వ్యాధి మరింత తీవ్రమైన దశకు చేరుకుందని సూచిస్తుంది. సిర్రోసిస్, కాలేయ వైఫల్యం, చివరికి మరణం సంభవించే ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల మధుమేహ రోగులలో కేవలం ఫ్యాటీ లివర్‌ను చెక్ చేయించుకోవడమే కాకుండా.. ఫైబ్రోసిస్‌ను గుర్తించడంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. వ్యాధిని దాని ప్రారంభ దశలలో గుర్తించడానికి.. లివర్ ఎంజైమ్ టెస్ట్లు,  ఫైబ్రోస్కాన్‌లు వంటి టెస్ట్లు చేయడం చాలా అవసరం.

నివారణ పద్ధతి

ఈ సమస్యను నివారించడానికి.. మధుమేహ రోగులు బరువును అదుపులో ఉంచుకోవాలి. అలాగే సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, కార్బోహైడ్రేట్లు, ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం వంటివి చేయాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. అలాగే రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్, రక్తపోటును అదుపులో ఉంచుకోవడం కూడా ముఖ్యమని చెప్తున్నారు.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
Hair Oiling Tips : జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
Bugs in Rice : బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Embed widget