దానిమ్మ ఎవరు తినకూడదో తెలుసా? కారణాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

దానిమ్మ రక్తపోటును తగ్గించే గుణం కలిగి ఉంటుంది. కాబట్టి BP తక్కువగా ఉన్నవారు ఎక్కువగా తినకూడదు.

బీపీ, షుగర్ మందులతో ఇది రియాక్షన్ ఇవ్వొచ్చు. కాబట్టి డాక్టర్ సలహా తీసుకున్నాకే తినాలి.

కొంతమందికి దానిమ్మ తింటే స్కిన్ రాషెస్, దురద రావచ్చు.

దానిమ్మలో సహజ చక్కెర ఉంటుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు పరిమితంగా తీసుకోవాలి.

ప్రెగ్నెన్సీ ఉన్నవారు ఎక్కువగా తినడం వల్ల కొన్ని ఇబ్బందులు రావచ్చు.

కొంతమందికి ఇది గ్యాస్ లేదా కడుపు ఇబ్బందులు కలిగించవచ్చు.

దానిమ్మలో ఉండే ఆమ్లాలు పంటిపై ఉండే ఎమాలిన్‌ను ప్రభావితం చేయవచ్చు.

దానిమ్మ రక్తప్రసరణపై ప్రభావం చూపుతుంది. సర్జరీకి ముందు తినడం తగ్గించడం మంచిది.

లివర్ లేదా కిడ్నీ సమస్యలు ఉన్నవారు.. మందులతో కలిపి తీసుకుంటే సమస్యలు రావచ్చు.

చిన్నపిల్లలకు ఎక్కువగా ఇస్తే జీర్ణ సమస్యలు రావచ్చు. కాబట్టి జాగ్రత్త.