వేసవిలో రోజ్ వాటర్ వాడితే కలిగే లాభాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

రోజ్ వాటర్ చర్మానికి చల్లదనం ఇస్తుంది. వేసవిలో వేడి వల్ల మండే చర్మాన్ని కూల్‌గా ఉంచుతుంది.

స్కిన్ హైడ్రేట్‌ చేస్తుంది. చర్మం పొడిబారకుండా తేమను నిలుపుతుంది.

రోజ్ వాటర్ ఫేస్‌పై స్ప్రే చేస్తే వెంటనే రిఫ్రెష్‌గా ఫీల్ అవుతారు.

నేచురల్ టోనర్‌గా పనిచేస్తుంది. పోర్స్‌ను కుదించి చర్మాన్ని టైట్‌గా ఉంచుతుంది.

ఆయిల్ కంట్రోల్ చేస్తుంది. ఆయిలీ స్కిన్ ఉన్నవారికి ఇది బెస్ట్ నేచురల్ సొల్యూషన్.

సన్‌బర్న్ నుంచి ఉపశమనం ఇస్తుంది. సూర్యరశ్మి వల్ల వచ్చే ఎర్రదనం, ఇరిటేషన్ తగ్గిస్తుంది.

మొటిమలను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. యాంటీబ్యాక్టీరియల్ గుణాలు పింపుల్స్ తగ్గిస్తాయి.

చర్మం మెరుగు పడుతుంది. రెగ్యులర్‌గా వాడితే స్కిన్ గ్లో పెరుగుతుంది.

కళ్ల అలసట తగ్గిస్తుంది. కాటన్‌తో కళ్లపై అప్లై చేస్తే ఐ రిలీఫ్ కలుగుతుంది.

మూడ్‌ను ఫ్రెష్ చేస్తుంది. గులాబీల వాసన మనసుకు శాంతిని ఇస్తుంది.

వేసవిలో ఉపయోగిస్తే చర్మాన్ని హెల్తీగా, ఫ్రెష్‌గా ఉంచుకోవచ్చు.