ఒత్తిడిని, మధుమేహాన్ని కంట్రోల్ చేసే చిట్కాలు

Published by: Geddam Vijaya Madhuri

రోజూ 30 నిమిషాల వాకింగ్, యోగా, లైట్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల స్ట్రెస్ తగ్గి షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.

ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్, షుగర్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తగ్గించాలి.

రోజుకు 10 నుంచి 15 నిమిషాలు ధ్యానం చేస్తే మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. స్ట్రెస్ తగ్గుతుంది.

రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్ర అవసరం. నిద్రలేమి షుగర్ లెవల్స్ పెరగడానికి కారణం అవుతుంది.

మీ షుగర్ లెవల్స్ తెలుసుకుంటే కంట్రోల్ చేయడం సులభం అవుతుంది.

డాక్టర్ సూచించిన మందులను మిస్ కాకుండా తీసుకోవాలి.

మీ సమస్యలను కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో పంచుకుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది.

కెఫీన్, ఆల్కహాల్ మానేయాలి. ఇది స్ట్రెస్‌ను పెంచి, షుగర్ లెవల్స్‌పై ప్రభావం చూపవచ్చు.

ఇష్టమైన పనులు చేస్తూ ఉంటే మానసికంగా రిలీఫ్ ఉంటుంది. షుగర్ కంట్రోల్ అవుతుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచి ఫలితాలు ఉంటాయి.