కాలేయంలో వాపు ఉంటే కనిపించే లక్షణాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

లివర్ వాపు పెరిగినప్పుడు కుడి వైపున నొప్పి లేదా అసౌకర్యం కనిపిస్తుంది.

కాలేయ సమస్యల వల్ల పొట్ట ఉబ్బినట్టుగా అనిపిస్తుంది.

ఎలాంటి పని చేయకపోయినా అలసట ఎక్కువగా ఉంటుంది.

ఆకలి తగ్గిపోవడంతో పాటు.. ఏది తినాలనే ఆసక్తి ఉండదు.

కళ్లు తిరగడం, వాంతులు రావడం వంటి సమస్యలు కనిపించవచ్చు.

చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారిపోతాయి. ఇది లివర్ సమస్యలకు ముఖ్యమైన సంకేతం.

కారణం లేకుండా బరువు తగ్గడం కూడా ప్రమాద హెచ్చరికగా చెప్తారు.

డార్క్ యూరిన్ కూడా లివర్ ఫంక్షన్ సరిగ్గా లేదనే సంకేతం కావచ్చు.

బాడీలో టాక్సిన్స్ పెరగడం వల్ల చర్మం మీద ఇరిటేషన్, దురద ఉంటుంది.

ఫ్లూయిడ్ రిటెన్షన్ వల్ల కాళ్లలో వాపు కనిపిస్తుంది.