ద్రాక్షలు తినే ముందు ఇలా శుభ్రం చేసుకోండి.. పురుగులమందులు పోతాయి

Published by: Geddam Vijaya Madhuri

ఒక గిన్నెలో నీరు వేసి కొద్దిగా ఉప్పు వేసి 10–15 నిమిషాలు ద్రాక్షలు ఉంచాలి. ఇది పెస్టిసైడ్స్ తగ్గించడంలో సహాయపడుతుంది.

నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి ద్రాక్షను కడిగితే బ్యాక్టీరియా తగ్గుతుంది.

నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా వేసి ద్రాక్షను నానబెడితే కెమికల్స్ తొలగుతాయి.

ద్రాక్షను 2–3 సార్లు ఫ్లోయింగ్ వాటర్‌లో కడగడం చాలా మంచిది.

నీటిలో కొద్దిగా వెనిగర్ కలిపి 10 నిమిషాలు నానబెట్టడం వల్ల మలినాలు పోతాయి.

ద్రాక్షను నెమ్మదిగా చేతులతో రుద్దితే పైపొరలోని కెమికల్స్ తొలగుతాయి.

చాలా వేడిగా కాకుండా గోరువెచ్చని నీటిలో కొద్దిసేపు నానబెట్టండి.

నానబెట్టిన తర్వాత మళ్లీ శుభ్రమైన నీటితో కడగాలి.

ద్రాక్షను కాడతోనే కడగాలి. వేరుచేసి కడిగితే మరింత కెమికల్స్ లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది.

సాధ్యమైనంతవరకు ఆర్గానిక్ ద్రాక్ష కొనడం మంచిది.