అన్వేషించండి

Sleeping after a Bath : రాత్రి స్నానం చేసి వెంటనే నిద్రపోతున్నారా? అయితే ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు

Sleeping Issues : చాలా మంది స్నానం చేసిన వెంటనే నిద్రపోతారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదట. ఇది మెదడును ప్రభావితం చేస్తుందని కొందరు నమ్ముతారు. షాకింగ్ విషయాలేంటో చూసేద్దాం.

Don't sleep Right after a Bath : చాలా మందికి రాత్రి స్నానం చేసి నిద్రపోయే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల వారికి చాలా రిలాక్స్​గా అనిపిస్తుందని, మంచి నిద్ర వస్తుందిన భావిస్తారు. అందుకే రోజంతా ఎలా ఉన్నా సరే.. రాత్రి పడుకునే ముందు కచ్చితంగా స్నానం చేస్తూ ఉంటారు.  మీకు కూడా ఇలాంటి అలవాటు ఉందా? అయితే ఇది ఆరోగ్యానికి మంచిది కాదని చెప్తున్నారు నిపుణులు.

రాత్రి సమయంలో శరీర ఉష్ణోగ్రత సహజంగా తగ్గుతుంది. దీనివల్ల మెదడు నిద్రపోవడానికి సంకేతాన్ని పంపుతుంది. అయితే స్నానం చేసిన తర్వాత శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీనివల్ల నిద్రపోవడంలో ఇబ్బంది కలగవచ్చు. అంతేకాకుండా స్నానం చేసి నిద్రపోవడం వల్ల శరీరానికి అనేక రకాల నష్టాలు కలుగుతాయట. స్నానం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల మెదడు బలహీనపడుతుందని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో ఇప్పుడు తెలుసుకుందాం.

మెదడు బలహీనపడుతుందా?

ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే.. స్నానం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల మెదడు బలహీనపడుతుందనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కానీ దీనివల్ల మరికొన్ని నష్టాలు ఉండవచ్చని చెప్తున్నారు. కాబట్టి రాత్రి నిద్రకు ముందు స్నానం చేయడం మానేయాలని చెప్తున్నారు. లేదంటే తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. మరి స్నానం చేసిన వెంటనే కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం.

జుట్టు రాలిపోతుంది

రాత్రుళ్లు తలస్నానం చేసి పడుకుంటే.. ఆ తడితో నిద్రపోవడం వల్ల దిండు లేదా మంచంపై బ్యాక్టీరియా పెరగవచ్చు. ఇది స్కాల్ప్ దెబ్బతినేలా చేస్తుంది. దీనివల్ల జుట్టు రాలడానికి, చుండ్రు సమస్యకు దారితీస్తుంది.

కళ్లలో దురద

రాత్రి నిద్రను చాలామంది వేడి నీటితో చేస్తారు. అయితే ఇలా వేడి నీటితో స్నానం చేయడం వల్ల కళ్లల్లో తేమ తగ్గుతుంది. దీనివల్ల కళ్లు ఎర్రబడి దురద వస్తాయి. దీని కారణంగా కళ్లకు సంబంధించిన ఇతర సమస్యలు కూడా వస్తాయి.

నిద్ర సమస్యలు

రాత్రిపూట స్నానం చేయడం వల్ల నిద్ర చెడిపోవచ్చు. రోజంతా అలసట తొలగిపోదు. నిద్రకు ఆటంకం కలగడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి. ఇది మెదడుపై కూడా ప్రభావం చూపుతుంది. ఒత్తిడి-డిప్రెషన్ పెరుగుతుంది.

బరువు పెరిగిపోతారు..

రాత్రి భోజనం చేసిన తర్వాత స్నానం చేయడం వల్ల బరువు పెరగవచ్చు. ఇది ఫిట్‌నెస్‌ను దెబ్బతీస్తుంది. అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు కూడా వస్తాయి. ఊబకాయం పెరగడం వల్ల మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.

కీళ్ల నొప్పులు, కండరాల తిమ్మిరి

రాత్రిపూట స్నానం చేయడం వల్ల కీళ్ల నొప్పులు వస్తాయి. దీనివల్ల నడవడానికి ఇబ్బంది పడవచ్చు. ఆలస్యంగా స్నానం చేయడం కండరాల తిమ్మిరికి కూడా కారణం కావచ్చు. ఇది కీళ్ల సమస్యలకు దారి తీస్తుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Testosterone Screening After 30: టెస్టోస్టెరాన్‌ ప్రభావం 30 ఏళ్ల తర్వాత తగ్గుతుందా? అమెరికా ఆర్మీ సైనికులకు ఎందుకు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తోంది?
టెస్టోస్టెరాన్‌ ప్రభావం 30 ఏళ్ల తర్వాత తగ్గుతుందా? అమెరికా ఆర్మీ సైనికులకు ఎందుకు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తోంది?
WHO Global Cancer Report 2026:ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్‌ ముప్పు! ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన రిపోర్ట్‌!
ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్‌ ముప్పు! ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన రిపోర్ట్‌!
Why To Avoid Salads In Monsoon:వర్షాకాలంలో ఆకుకూరలు, కూరగాయలు, సలాడ్స్ తినకూడదా? తింటే ఏం జరుగుతుంది?
వర్షాకాలంలో ఆకుకూరలు, కూరగాయలు, సలాడ్స్ తినకూడదా? తింటే ఏం జరుగుతుంది?
Dengue Vaccine India: డెంగీకి హైదరాబాద్ మందు! జపాన్‌కు చెందిన QDENGA వ్యాక్సిన్ అమ్మకాలకు భారత్‌ గ్రీన్‌ సిగ్నల్!
డెంగీకి హైదరాబాద్ మందు! జపాన్‌కు చెందిన QDENGA వ్యాక్సిన్ అమ్మకాలకు భారత్‌ గ్రీన్‌ సిగ్నల్!

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
TDP YSRCP Political Row: అమరరాజా గిగా పోరు - తెలంగాణ సిగలో రత్నం.. ఏపీ రాజకీయాల్లో పెట్టుబడుల చిచ్చు!
అమరరాజా గిగా పోరు - తెలంగాణ సిగలో రత్నం.. ఏపీ రాజకీయాల్లో పెట్టుబడుల చిచ్చు!
US Iran Conflict: టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
Rahul Gandhi Protest: ప్రధానమంత్రి నివాసానికి రాహుల్, ప్రియాంక ఎలా దూసుకొచ్చారు? వారిని మార్గమధ్యలోనే ఎందుకు అడ్డుకోలేదు?
ప్రధానమంత్రి నివాసానికి రాహుల్, ప్రియాంక ఎలా దూసుకొచ్చారు? వారిని మార్గమధ్యలోనే ఎందుకు అడ్డుకోలేదు?
AP, Telangana Rains Alert: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. రైతులకు ఉపశమనం, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. రైతులకు ఉపశమనం, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Kadambari Jethwani Case Facts: ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
Rahul Gandhi Lok Kalyan Marg Protest: ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
Uday Ruddarraju: ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
Embed widget