అన్వేషించండి

Tea Benefits in Summer : వేసవిలో టీ తాగితే కలిగే లాభాలు, నష్టాలు.. రోజుకి ఎన్నిసార్లు తాగితే మంచిది?

Summer Tea Consumption : వేసవిలో టీ తాగే అలవాటు ఉందా? ఇది ఎంత వరకు మంచిది? ఆరోగ్యానికి ఇబ్బందులు ఉంటాయో.. నిపుణులు ఇస్తోన్న సూచనలు ఇవే.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వేసవిలో టీ తాగడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది.
  • అధికంగా తాగితే డీహైడ్రేషన్, అసిడిటీ సమస్యలు వస్తాయి.
  • రోజుకు 2-3 కప్పుల టీ తాగడం మంచిది.
  • వేడి టీ, ఖాళీ కడుపుతో తాగడం మంచిది కాదు.

Summer Tea : వేసవిలో చాలా మంది చల్లని పానీయాలవైపు మొగ్గు చూపుతుంటారు. కానీ కొందరు మాత్రం ఎంత వేడి ఉన్నా టీ మాత్రం కచ్చితంగా తాగుతారు. ఉదయం, సాయంత్రం ఒక కప్పు టీ తాగకుంటే వారికి అస్సలు మనసు మసనులో ఉండదు. అయితే ఇంత వేడిలో టీ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? ఎక్కువగా తాగితే వచ్చే సమస్యలు ఏంటి? రోజుకు ఎన్ని సార్లు తాగితే సరిపోతుంది? నిపుణులు ఇచ్చే సలహాలు ఏంటో చూసేద్దాం. 

వేసవిలో టీ తాగితే కలిగే లాభాలు

టీ లో ఉండే కెఫిన్ శరీరానికి తాత్కాలిక ఎనర్జీని అందిస్తుంది. వేసవిలో వచ్చే అలసట, నీరసం కొంతవరకు తగ్గవచ్చు. టీ తాగడం వల్ల మెదడు చురుకుగా పనిచేయడంలో సహాయపడుతుంది. పని చేసే సమయంలో ఫోకస్ పెరగడానికి హెల్ప్ చేస్తుంది. టీ లో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని హానికర ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. అల్లం టీ, గ్రీన్ టీ వంటి కొన్ని రకాల టీలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. వేడిగా ఒక కప్పు టీ తాగితే మానసికంగా కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. 

వేసవిలో ఎక్కువ టీ తాగితే వచ్చే నష్టాలు

టీ లో కెఫిన్ ఉండటం వల్ల ఎక్కువగా తాగితే శరీరంలో నీటి శాతం తగ్గే అవకాశం ఉంటుంది. వేసవిలో ఇది మరింత ప్రమాదకరం. ఖాళీ కడుపుతో లేదా ఎక్కువ సార్లు టీ తాగితే గ్యాస్, అసిడిటీ సమస్యలు రావచ్చు. రాత్రి సమయంలో ఎక్కువ టీ తాగితే నిద్రలేమి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అధిక కెఫిన్ తీసుకోవడం వల్ల కొందరికి హార్ట్‌బీట్ వేగంగా అనిపించవచ్చు. భోజనం చేసిన వెంటనే టీ తాగడం వల్ల ఆహారంలో ఉన్న ఐరన్ శరీరానికి పూర్తిగా అందకపోవచ్చు.

రోజుకి ఎన్నిసార్లు టీ తాగితే మంచిది?

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. సాధారణంగా రోజుకు 2 నుంచి 3 కప్పుల వరకు టీ తాగడం మంచిదిగా భావిస్తారు. అయితే ఇది వ్యక్తి ఆరోగ్య పరిస్థితి, వయసు, కెఫిన్‌కు శరీరం స్పందించే విధానంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఉదయం ఒక కప్పు, సాయంత్రం ఒక కప్పు, అవసరమైతే మధ్యాహ్నం లైట్గా తీసుకోవచ్చు. ఇలా పరిమితంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని సూచిస్తున్నారు.

వేసవిలో టీ తాగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వేసవిలో టీ తాగాలనుకుంటే.. చాలా వేడిగా ఉన్న టీ తాగకండి. అలాగే టీతో పాటు నీటిని ఎక్కువగా తాగండి. ఖాళీ కడుపుతో టీ తాగడం మంచిది కాదు. షుగర్ తక్కువ వేసుకుంటే మంచిది. అలాగే రోజుకు 2–3 కప్పుల కంటే ఎక్కువ టీ తాగకపోవడం మంచిది.

మీరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వేసవిలో టీ పూర్తిగా మానేయాల్సిన అవసరం రాదు. కానీ పరిమితంగా తాగడం చాలా ముఖ్యం. సరైన సమయాల్లో, తగిన మోతాదులో తీసుకుంటే టీ శరీరానికి ఉత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా రిలాక్స్ ఫీలింగ్‌ను కూడా కలిగిస్తుంది. అదే అధికంగా తాగితే డీహైడ్రేషన్, అసిడిటీ, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి మితంగా టీ తాగుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఉత్తమం.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Infantile Epilepsy : శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
Dondakaya Pachadi : దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే
దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే
Amla Benefits : రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?
రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?
Water Weight : వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే
వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget