Intimacy Health : ఈ అలవాట్ల వల్ల మగవారిలో లైంగిక శక్తి తగ్గిపోతోందట.. ఈ మార్పులు చేయమంటోన్న నిపుణులు
Testosterone Levels Decreasing in Men : నేటితరం మగవారిలో లైంగిక సామర్థ్యం తగ్గిపోతుందని చెప్తున్నారు నిపుణులు. మరి లైంగిక శక్తిని పెంచుకోవడానికి సెలబ్రెటీ న్యూట్రిషనిస్ట్ ఇస్తోన్న సూచనలు చూసేద్దాం.

Relationship Health for Men : ముందుతరం వారితో పోలిస్తే మగవారిలో లైంగిక సామర్థ్యం బాగా తగ్గిపోతుందని చెప్తున్నారు నిపుణులు. అప్పటి జెనరేషన్ వాళ్లకి ఉన్నంత లైంగిక సామర్థ్యం(Intimacy Health), ఫిజికల్ స్టామినా ఇప్పటివారిలో ఉండట్లేదని చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో మగవారి లైంగిక ఆరోగ్యాన్ని ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తున్నాయని చెప్తున్నారు. కొన్ని లైంగిక ఆరోగ్యాన్ని నెగిటివ్‌గా ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు సెలబ్రెటీ న్యూట్రిషనిస్ట్ ర్యాన్ ఫెర్నాండో. అందుకే మగవారు తమ జీవన శైలిలో కొన్ని అంశాలు కచ్చితంగా ఫాలో అవ్వాలని.. లేదంటే వారిలో లైంగిక ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందని.. దీనివల్ల ఎక్కువసేపు లైంగిక చర్యలో పాల్గొనలేరని చెప్తున్నారు. మరి ర్యాన్ ఫెర్నాండో మగవారికి ఇస్తోన్న సూచనలు (Ryan Fernando Tips for Men) ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
బయటి ఫుడ్ తినడం
చాలామంది మగవారు ఉద్యోగం, కాలేజ్ పేరుతో ఇంటి నుంచి బయటకు వచ్చి స్టే చేస్తూ ఉంటారు. ఆ సమయంలో చాలామంది బయటి ఫుడ్ తినాల్సి వస్తుంది. ఇలా బయటి ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల కూడా లైంగిక సామర్థ్యం దెబ్బతింటుందని చెప్తున్నారు. కాబట్టి వీలైనంత వరకు బయటి ఫుడ్ కాకుండా.. ఇంట్లో లేదా రూమ్‌లో తయారు చేసుకునే ఫుడ్స్ తీసుకోవాలంటున్నారు. అలాగే పండ్లు, కూరగాయలు డైట్లో ఉండేలా చేసుకుంటే మరీ మంచిదని చెప్తున్నారు.
విటమిన్ డి
భారతీయులలో విటమిన్ డి లోపం. దీనివల్ల మగవారిలో టెస్టోస్టిరాన్ తగ్గుతుందని చెప్తున్నారు. విటమిన్ డి తగినంత శరీరంలో లేకుంటే టెస్టోస్టిరాన్ తగ్గి.. లైంగిక సామర్థ్యం కూడా తగ్గుతుందని చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది మగవారిలో విటమిన్ డి లోపం వల్ల టెస్టోస్టిరాన్ తగ్గుతుందని.. కాబట్టి ఎండలోకి వెళ్లడం లేదా క్యాప్సుల్ తీసుకోవడం మంచిదని చెప్తున్నారు.
నిద్ర
సరైన నిద్ర లేకపోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు.. లైంగిక సామర్థ్యం కూడా తగ్గుతుందట. నేటి కాలంలో ఫోన్ ఎక్కువసేపు నిద్రపోకుండా చూడడం.. లేట్ నైట్ తినడం, సరైన నిద్రలేకపోవడం కామన్‌గా మారిపోయాయి. దీనివల్ల మగవారిలో లైంగిక సామర్థ్యం తగ్గింపోతుందని నిపుణులు చెప్తున్నారు. కాబ్టటి రాత్రి నిద్ర కనీసం 7 నుంచి 8 గంటలు ఉండేలా చూసుకోవాలంటున్నారు.
మైక్రో న్యూట్రియెంట్స్
జింక్, సెలీనియం, క్రోమియం, మాంగనీస్ వంటి మైక్రోన్యూట్రియెంట్స్ తగ్గడం వల్లకూడా మగవారిలో లైంగిక ఆరోగ్యం దెబ్బతింటుందని.. వారిలో సెక్స్ డ్రైవ్ తగ్గడానికి ఇవి కూడా ఓ కారణమేనని చెప్తున్నారు. గుమ్మడికాయ గింజలు, సన్‌ఫ్లవర్ సీడ్స్, డార్క్ చాక్లెట్ వంటివి తీసుకుంటే మైక్రోన్యూట్రియెంట్స్ లోపానికి చెక్ పెట్టవచ్చని చెప్తున్నారు.
షుగర్స్
ఎక్కువ స్వీట్స్, షుగర్స్ తీసుకుంటే రక్తనాళాలు బ్లాక్ అయిపోతాయి. అవి రక్తపోటువల్ల గుండె దగ్గర బ్లాక్ అవ్వొచ్చు లేదా పురుషాంగం వద్ద కూడా అవ్వచ్చు. దీనివల్ల అంగస్థంభన సమస్యలు వస్తాయట.
ఇవేకాకుండా స్మోకింగ్, ఆల్కహాల్ కూడా లైంగిక సమస్యలను పెంచుతాయని.. వాటిని తీసుకోవడం తగ్గిస్తే లైంగిక సమస్యలు పెరగకుండా ఉంటాయని చెప్తున్నారు. వీటిని విస్మరిస్తే పూర్తిగా లైంగిక జీవితానికి దూరమవ్వాల్సి వస్తుందని తెలిపారు. వీటితో పాటు వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరిగి.. ఆరోగ్యానికే కాకుండా లైంగిక సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు.






















