Yoga Poses for Better Intimacy Health : లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే టాప్ 5 యోగాసనాలు.. శృంగార జీవితానికి బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాయట
Yoga for Sexual Health : శృంగార జీవితాన్ని మెరుగుపరచుకునేందుకు యోగాను లైఫ్స్టైల్లో భాగం చేసుకోవాలంటున్నారు నిపుణులు. కొన్ని యోగాసనాలు రెగ్యులర్గా చేయడంవల్ల లైంగిక ఆరగ్యం బెటర్ అవుతుందట. అవేంటంటే..

Best Yoga Asanas to Boost Your Sexual Life : యోగా అనేది శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు లైంగిక ఆరోగ్యానికి కూడా మద్ధతునిస్తుంది. కొన్ని ఆసనాలు శరీరంలోని రక్తప్రసరణను మెరుగుపరిచి.. ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతేకాకుండా హార్మోన్ల సమతుల్యతను కాపాడడంలో, శరీరాన్ని లైంగికంగా యాక్టివ్గా ఉండడంలో హెల్ప్ చేస్తాయి. అలా లైంగిక జీవితాన్ని మెరుగుపరిచే యోగా ఆసనాలు ఏంటో.. వాటివల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
భుజంగాసనం
లైంగక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో భుజంగాసనం మంచి ప్రయోజనాలు ఇస్తుంది. దీనిని కోబ్రా పోజ్ అంటారు. ఈ ఆసనం చేయడం కోసం బోర్లా పడుకోవాలి. చేతులను భుజాల దగ్గరకు తీసుకుని సపోర్ట్ ఇస్తూ ఛాతీ భాగాన్ని తలతో సహా పైకి లేపాలి. అంటే పాము పడగ విప్పినట్లుగా శరీరం ఉండాలి. ఇలా చేయడం వల్ల శృంగారానికి అవసరమైన అవయవాల్లో రక్తప్రసరణ పెరుగుతుంది. నరాలు బలపడి ఒత్తిడిని తగ్గిస్తాయి.
సేతు బంధాసనం
సేతు బంధాసనాన్నే బ్రిడ్జ్ పోజ్ అని కూడా అంటారు. ఈ ఆసనం చేయడానికి నేలపై పడుకోవాలి. ఇప్పుడు కాళ్లను మడిచి.. చేతులను కింద చాపి ఉంచి.. నడుము భాగాన్ని పెకి లేపాలి. ఈ ఆసనం చూసేందుకు బ్రిడ్జ్లాగా ఉంటుంది. ఈ ఆసనం రెగ్యులర్గా వేయడం వల్ల లైంగికంగా స్టామినా పెరుగుతుంది. హార్మోన్ల పనితీరు మెరుగవుతాయి. తొడలు, వెన్నెముకకు బలం చేకూరుతుంది.
బటర్ఫ్లై పోజ్
దీనినే బద్ధ కోణాసనం అని కూడా అంటారు. ఈ ఆసనం కోసం నేలపై కూర్చోవాలి. పాదాలను కలిపి.. తొడలను స్ట్రెచ్ చేయాలి. ఇప్పుడు వాటిని సీతకోక చిలుక రెక్కలు ఆడించినట్లు తొడలను ఫ్లాప్ చేయాలి. ఇలా చేయడం వల్ల యోని ఆరోగ్యం మెరుగుపడుతుంది. తొడలకు బలం చేకూరుతుందని చెప్తున్నారు.
ధనురాసనం
ఈ ఆసనం చేయడం కోసం పొట్టపై పడుకోవాలి. మోకాళ్లను వెనక్కి మడిచి చేతులతో వాటిని పట్టుకుని ఛాతిని పైకి లేపాలి. ధనస్సు రూపంలో కనిపిస్తుంది కాబట్టి ఈ ఆసనాన్ని ధనురాసనం అంటారు. ఈ ఆసనం శృంగార జీవితాన్ని ఉత్తేజతం చేయడంతో పాటు శరీరానికి ఉత్సాహాన్ని అందిస్తుందట.
పశ్చిమోత్తానాసనం
పశ్చిమోత్తానాసనం చేయడం కోసం ముందుగా నేలపై కూర్చొని పాదాలు చాపాలి. ఇప్పుడు శరీరాన్ని వంచుతూ.. చేతులతో పాదాలను పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. వెన్నెముక, తొడలకు స్ట్రెంత్ అందుతుంది. ఇది క్రమంగా లైంగిక ఆరోగ్యాన్ని ప్రేరేపిస్తుంది.
ఈ ఆసనాలే కాకుండా శృంగార అనుభూతిని పెంచే ఉత్కట కోణాసనం, అలసటను తగ్గించి హార్మోన్లను ప్రేరేపించే విపరీత కరణి వంటి ఆసనాలు కూడా ట్రై చేయవచ్చు. అంతేకాకుండా ప్రాణాయామం రెగ్యులర్గా చేస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయి. శరీరానికి అవసరమైన నిద్ర, ఆహారాన్ని అందిస్తే కూడా లైంగిక ఆరోగ్యం మెరుగవుతుంది.






















