అన్వేషించండి

Thyroid Weight Loss Tips : థైరాయిడ్ ఉంటే బరువు తగ్గడం కష్టమా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Weight loss with Thyroid : థైరాయిడ్ ఉన్నవారు బరువు తగ్గడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. వాటిని ఫాలో అయితే ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగిస్తే బరువు పెరగడం జరుగుతుంది.
  • థైరాయిడ్ మందులు ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి.
  • అయోడిన్, ఫైబర్, సెలీనియం అధికంగా ఉండే ఆహారాలు తినాలి.
  • వ్యాయామం, మానసిక ఆరోగ్యం బరువు తగ్గడంలో సహాయపడతాయి.

Thyroid Weight Loss Tips in Telugu : మారుతున్న జీవనశైలి, విపరీతమైన ఒత్తిడి కారణంగా థైరాయిడ్ సమస్యలు సైలెంట్ కిల్లర్‌లా విస్తరిస్తున్నాయి. మెడ భాగంలో ఉండే ఈ చిన్న గ్రంథి శరీర జీవక్రియను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది అదుపు తప్పితే బరువు పెరగడం, జుట్టు రాలడం, విపరీతమైన అలసట వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. 

హైపో థైరాయిడ్ వల్ల చాలామంది బరువు పెరిగిపోతారు. లావుగా మారితే ఆరోగ్య సమస్యలు మరిన్ని పెరుగుతాయి. అందుకే వైద్యులు మందులు వాడుతూ బరువును అదుపులో ఉంచుకోవాలని సూచిస్తారు. కానీ థైరాయిడ్ ఉంటే బరువు తగ్గడం కష్టంగా ఉంటుంది. దానికి కారణాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బరువును తగ్గించుకోవచ్చో చూసేద్దాం. 

థైరాయిడ్ ఉంటే బరువు తగ్గడం ఎందుకు కష్టం?

థైరాయిడ్ గ్రంథి నెమ్మదిగా పనిచేస్తే మెటబాలిజం తగ్గిపోతుంది. దీంతో శరీరం తక్కువ కేలరీలు బర్న్ చేస్తుంది. దీని వల్ల క్రమంగా బరువు పెరుగుతుంది. కాబట్టి సాధారణంగా బరువు తగ్గే పద్ధతులు థైరాయిడ్ పేషెంట్లకు వెంటనే ఫలితాలు ఇవ్వవు. 

థైరాయిడ్ మందులు తీసుకునే విధానం

థైరాయిడ్ మందులు ఖాళీ కడుపున తీసుకోవాలి. ఉదయం లేవగానే మొదట మందు వేసుకుని కనీసం ఒక గంట తర్వాత ఏదైనా తినాలి. రెగ్యులర్‌గా ఒకే సమయానికి మందు తీసుకోవడం చాలా ముఖ్యం.

ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి?

అయోడిన్ అధికంగా ఉండే ఆహారాలు థైరాయిడ్ పనితీరును మెరుగుపరుస్తాయి. టేబుల్ సాల్ట్, చేపలు, పాల పదార్థాలు, గుడ్లు అయోడిన్‌కు మంచి వనరులు. ఫైబర్ అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. బరువు తగ్గుతుంది. పండ్లు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు ఫైబర్‌కు మంచివి. సెలీనియం అధికంగా ఉండే గుమ్మడి విత్తనాలు, బ్రెజిల్ నట్స్, ధనియాలు, గుడ్లు కూడా థైరాయిడ్ హార్మోన్లకు సహాయపడతాయి. కాబట్టి వీటిని రెగ్యులర్గా డైట్లో చేర్చుకునేందుకు చూడండి. నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. 

ఈ ఫుడ్స్ తినకండి..

క్యాబేజీ, సోయా, మిల్లెట్స్, అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, పీచ్, పేర్లు వంటి పండ్లు తక్కువగా తినడం మంచిది. షుగర్, హై కార్బ్ ఆహారాలు బరువు పెరగడానికి ముఖ్య కారణమవుతాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండండి. ఈ అలవాటు కేవలం థైరాయిడ్ తగ్గించడానికే కాదు పూర్తి ఆరోగ్యానికి మేల చేస్తాయి. 

వ్యాయామం చేస్తే.. 

థైరాయిడ్ ఉన్నవారు స్ట్రెంగ్త్ ట్రైనింగ్, మజిల్ బిల్డింగ్ వ్యాయామాలపై ఫోకస్ చేస్తే ఆరోగ్యంగా బరువు తగ్గడంలో మంచి ఫలితాలిస్తాయి. పిలెట్స్ కూడా TSH లెవెల్స్ నియంత్రించడంలో హెల్ప్ చేస్తాయి. 

మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే

థైరాయిడ్ పేషెంట్లు బరువు తగ్గే విషయంలో ఇతరులతో పోల్చుకోకూడదు. ప్రతి ఒక్కరి థైరాయిడ్ జర్నీ వేరుగా ఉంటుంది. హార్మోన్ల రియాక్షన్, శరీర తత్వం భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఒకరి గురించి పట్టించుకోకుండా చిన్న చిన్న అలవాట్లు రోజూ పాటిస్తే.. మంచి ఫలితాలు చూడగలుగుతారు. 

ఇలాంటి మరిన్ని హెల్త్ న్యూస్ గురించి ఈ లింక్ క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Common Krait Poisonous Snake: దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Flu Vaccine : ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
Advertisement

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Ritika Nayak: కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
Embed widget