అన్వేషించండి

Walking Guide : రోజూ ఎంతసేపు నడిస్తే షుగర్, బరువు కంట్రోల్ అవుతుంది? 1 నుంచి 60 నిమిషాలు నడకతో జరిగే మార్పులు ఇవే

Benefits of Walking : నడక కేవలం బరువు తగ్గించడానికే కాదు.. రక్తంలో చక్కెరను నియంత్రించడం నుంచి గుండె ఆరోగ్యం వరకు ఎన్నో లాభాలు ఇస్తుంది. అయితే ఎంత సమయం నడిస్తే ఎలాంటి లాభాలు పొందవచ్చో చూసేద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నిమిషం నడకతో రక్త ప్రసరణ పెరిగి శరీరం ఉత్తేజితమవుతుంది.
  • ఐదు నిమిషాల నడక ఒత్తిడి హార్మోన్లను తగ్గించి మనసును ప్రశాంతపరుస్తుంది.
  • పది నిమిషాల నడక జీర్ణక్రియకు సహాయపడి కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.
  • పదిహేను నిమిషాల నడక రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.
  • ఇరవై నిమిషాల నడక గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి బీపీని తగ్గిస్తుంది.
  • ముప్పై నిమిషాల నడక ఫ్యాట్ బర్నింగ్ మొదలుపెట్టి బరువు తగ్గుతారు.
  • నలభై నిమిషాల నడక మెటబాలిజంను వేగవంతం చేసి కాలరీలను బర్న్ చేస్తుంది.
  • నలభై ఐదు నిమిషాల నడక మానసిక ఆరోగ్యం మెరుగుపరచి మంచి నిద్రనుస్తుంది.
  • అరవై నిమిషాల నడక బరువు తగ్గడానికి, స్టామినా పెంచడానికి సహాయపడుతుంది.
  • రోజుకు 20-30 నిమిషాల నడక మంచి అలవాటుగా మారి లాభాలనిస్తుంది.

Surprising Benefits of Walking Daily : ఈ రోజుల్లో ఆరోగ్యంగా, ఫిట్​గా ఉండేందుకు చాలామంది నడకను ఎంచుకుంటున్నారు. ఇది ఆరోగ్య లాభాలను అందించే సులభమైన, చవకైన, అత్యంత ప్రభావవంతమైన మార్గంగా చెప్పవచ్చు. నడక అనేది కేవలం బరువు తగ్గడం గురించే కాదు.. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, మానసిక ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అయితే మీరు నడిచే సమయం మీ శరీరంపై దాని ప్రయోజనాలను నేరుగా ప్రభావితం చేస్తుందట. 

అంటే మీరు 1 నిమిషం నుంచి 60 నిమిషాల వరకు.. ప్రతి సమయానికి దాని సొంత ప్రయోజనాలు ఉన్నాయట. పోషకాహార నిపుణుల ప్రకారం.. చిన్నపాటి నడకలు కూడా మీ శరీరం, మనస్సులో గణనీయమైన మార్పులను తీసుకురాగలవని చెప్తున్నారు. కాబట్టి ఎంత సమయం నడిస్తే ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకుని.. మీ అవసరానికి అనుగుణంగా మీ నడకను ఈరోజే ప్రారంభించండి. 

ఒక్క నిమిషం.. 

ఒక్క నిమిషం నడిస్తే.. పెద్ద తేడా ఏమీ ఉండదని మీరు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే చిన్న నడక కూడా శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది. అలాగే శరీరాన్ని ఉత్తేజపరచడానికి సహాయపడుతుంది.

5 నిమిషాల వాక్

5 నిమిషాల నడక మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. బాగా ఒత్తిడికి లోనైనప్పుడు మీ మనసు తేలికపరచుకోవాలనుకుంటే.. హాయిగా వాకింగ్ చేయవచ్చు. ఒత్తిడి హార్మోన్ (కార్టిసాల్)ను తగ్గిస్తుంది. దీనివల్ల ఒత్తిడి తగ్గి మీ మనస్సు మరింత ప్రశాంతంగా మారుతుంది. 

పది నిమిషాలు

రోజూ 10 నిమిషాలు నడిస్తే  జీర్ణక్రియకు సహాయం చేస్తుంది. భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే కడుపు ఉబ్బరం తగ్గుతుంది.

15 నిమిషాల నడక

రక్తంలోని షుగర్ లెవల్స్ కంట్రోల్‌లోకి వస్తాయి. డయాబెటిస్ ఉన్నవారికి చాలా మంచిది. కాబట్టి మధుమేహులు షుగర్ తగ్గించుకునేందుకు రోజుకు కనీసం 15 నిమిషాలు నడవాల్సి ఉంటుంది. 

20 నిమిషాల నడక

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలనుకుంటే.. రోజుకు 20 నిమిషాలు నడవండి. ఇది గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే బీపీ కూడా తగ్గుతుంది.

30 నిమిషాల నడక

బరువు తగ్గాలనుకుంటే.. 30 నిమిషాలు నడవండి. అరగంట నడిస్తే ఫ్యాట్ బర్నింగ్ మొదలవుతుంది. వెయిట్ లాస్ కోసం ఇది మినిమమ్ అవసరమైన టైమ్.

40 నిమిషాలు నడిస్తే.. 

మీ మెటాబాలిజం వేగంగా పనిచేయాలనుకుంటే రోజుకు 40 నిమిషాలు నడవండి. దీనివల్ల మీరు ఖాళీగా ఉన్నప్పుడు కూడా రోజంతా కాలరీలు ఎక్కువగా బర్న్ అవుతాయి.

45 నిమిషాలు నడిస్తే

మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆందోళన, డిప్రెషన్ లక్షణాలు తగ్గుతాయి. మంచి నిద్ర మీ సొంతమవుతుంది. 

60 నిమిషాల నడక

బరువు వేగంగా తగ్గాలనుకుంటే రోజూ గంట నడవండి. ఇది వెయిట్ లాస్‌కు సహాయపడుతుంది. స్టామినా పెరుగుతుంది. శరీరం ఫిట్‌గా మారుతుంది.

రోజూ నడిస్తే..

సమయాన్ని ఫాలో అవ్వడం కంటే రోజూ ఎంతైనా కొంతసేపు నడిస్తే మంచి అలవాటుగా మారుతుంది. రోజూ కనీసం 20 నుంచి 30 నిమిషాలు అయినా రెగ్యులర్‌గా నడిస్తే ఎక్కువ లాభాలు పొందవచ్చు. మధ్యలో గ్యాప్స్ తీసుకుంటూ.. హైడ్రెటేడ్​గా వాకింగ్ చేస్తే అలసట లేకుండా ఎక్కువ దూరం నడవగలుగుతారు.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Dussehra Navratri Day 7 : అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
Dussehra Navratri Day6 : అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
White Chicken : నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
Beer vs Breezer : బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget