అన్వేషించండి

Losing Height : ఎత్తు తగ్గడానికి కారణాలు ఇవే.. ఎవరి Height అకస్మాత్తుగా తగ్గుతుందో తెలుసా?

Height Loss : ఎత్తు పెరగడం గురించి తెలుసు కానీ.. ఎత్తు తగ్గడం గురించి తెలుసా? అసలు ఏ వ్యక్తికి ఎత్తు తగ్గిపోయే అవకాశం ఉందో.. దాని వెనుక కారణాలు ఏంటో చూసేద్దాం.

Sudden Height Loss Causes : వయసు పెరిగే కొద్ది ఎత్తు పెరుగుతాము. యవ్వనంలోకి, ఒక వయసు వచ్చేవరకు ఎత్తు ఎదుగుతాము. కానీ మీకు తెలుసా? వయస్సు పెరిగే కొద్దీ.. ఎత్తు నెమ్మదిగా తగ్గడం ప్రారంభమవుతుందట. ఈ మార్పు చాలా నెమ్మదిగా జరుగుతుంది. కాబట్టి ఎక్కువమందికి తెలియదు. ఉదాహరణతో చెప్పాలంటే.. 35 ఏళ్ల వయసున్న వ్యక్తి 80 ఏళ్ల వయసులో దాదాపు అర అంగుళం తక్కువగా ఉండవచ్చు. అదే సమయంలో 5 అడుగుల 4 అంగుళాల ఎత్తు ఉన్న మహిళ 90 ఏళ్ల వయసులో 5 అడుగుల 2 అంగుళాలకు తగ్గవచ్చు.

చాలామందిలో ఎత్తు తగ్గడం 40 నుంచి 50 సంవత్సరాల వయస్సులో నెమ్మదిగా ప్రారంభమవుతుంది. కానీ 70 సంవత్సరాల తర్వాత ఇది వేగంగా పెరుగుతుంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. వృద్ధాప్యంలో వెన్నెముకలో మార్పులు, డిస్క్‌లు సన్నబడటం, భంగిమ క్షీణించడం ఎత్తు తగ్గడానికి సాధారణ కారణాలు. అయితే 1 అంగుళం కంటే ఎక్కువ ఎత్తు తగ్గితే.. అది సాధారణ సమస్యగా పరిగణించరు. తీవ్రమైన సమస్యను సూచిస్తుంది.

ఎత్తు తగ్గడం బోలు ఎముకల వ్యాధి లక్షణమా?

ఈ టాపిక్ గురించి ఆటోఇమ్యూన్ డిసీజ్, న్యూరాలజీ నిపుణులు, MD రుమటాలజీ డాక్టర్ రుత్ జేసన్ హిక్‌మన్ చర్చించారు. ఎత్తు తగ్గడం బోలు ఎముకల వ్యాధికి ప్రారంభ సంకేతం కావచ్చని తెలిపారు. ఈ వ్యాధిలో ఎముకలు బలహీనపడతాయి. సన్నబడతాయి. దీని వలన ఎముకలు విరిగే ప్రమాదం పెరుగుతుంది. వెన్నెముక కుంచించుకుపోవడం ప్రారంభమవుతుంది. శరీరం వంగిపోతుంది. ఎత్తు తగ్గినప్పుడు లేదా అకస్మాత్తుగా ఫ్రాక్చర్ అయినప్పుడు బోలు ఎముకల వ్యాధిని గుర్తిస్తారు. ఒక అధ్యయనం ప్రకారం.. 3 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఎత్తు తగ్గిన పురుషులలో.. హిప్ ఫ్రాక్చర్ ప్రమాదం రెట్టింపు అవుతుందట.

ఎత్తు ఎందుకు తగ్గుతుంది?

verywellhealth ప్రకారం.. బోలు వ్యాధి  ఉంటే ఎత్తు తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. వీటిలో కంప్రెషన్ ఫ్రాక్చర్ మొదటి స్థానంలో ఉంది. దీనిలో బలహీనమైన ఎముకలు తేలికపాటి పగుళ్లు లేదా ఒత్తిడి ఫ్రాక్చర్‌ల ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ ఫ్రాక్చర్‌లలో తరచుగా తీవ్రమైన నొప్పి ఉండదు. కాబట్టి ప్రజలు వాటిని సాధారణ నడుము నొప్పిగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. కానీ దీనివల్ల వెన్నెముక కుంచించుకుపోతుంది. ఎత్తు తగ్గడం ప్రారంభమవుతుంది. రెండవ స్థానంలో కైఫోసిస్ ఉంది. ఇందులో ఎగువ వీపు గుండ్రంగా లేదా వంగి కనిపిస్తుంది. బోలు ఎముకల వ్యాధి కారణంగా వెన్నెముక బలహీనపడినప్పుడు.. శరీరం ముందుకు వంగడం ప్రారంభమవుతుంది. దీనివల్ల ఎత్తు తగ్గినట్లు కనిపిస్తుంది.

ఎత్తు మళ్లీ పెరుగుతుందా?

చాలా సందర్భాల్లో బోలు ఎముకల వ్యాధి కారణంగా తగ్గిన ఎత్తు తిరిగి రాదు. కానీ మీరు భవిష్యత్తులో ఎత్తు తగ్గకుండా ఖచ్చితంగా నిరోధించవచ్చు. దీని కోసం మీరు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. ధూమపానం మానేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Infantile Epilepsy : శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
Dondakaya Pachadi : దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే
దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే
Amla Benefits : రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?
రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?
Water Weight : వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే
వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget