అన్వేషించండి

HYROX Fitness Race : HYROX ఫిట్‌నెస్ రేస్ ట్రెండింగ్.. బిగినర్స్ కూడా ట్రై చేయొచ్చా? డాక్టర్ సూచనలు ఇవే

Fitness Race Trend : రన్నింగ్‌తో పాటు బలాన్నిచ్చే వ్యాయామాలతో కూడిన HYROX ఫిట్‌నెస్ రేస్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. అయితే బిగినర్స్ దీనిలో పాల్గొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

High Intensity Fitness Race : ఫిట్‌నెస్‌పై ఆసక్తి ఉన్నవారిలో ఇప్పుడు HYROX రేస్‌పై చర్చ పెరుగుతోంది. రన్నింగ్‌తో పాటు స్ట్రెంత్ అవసరమయ్యే వ్యాయామాలు చేసే ఈ పోటీలో పాల్గొనాలని చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే జిమ్ కొత్తగా ప్రారంభించినవారు కూడా ఈ రేసులో పాల్గొనవచ్చా? దీనివల్ల మోకాళ్లు, చీలమండలపై ఎంత ఒత్తిడి పడుతుంది? గాయాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో.. డాక్టర్లు చెప్తోన్న విషయాలు ఏంటో చూసేద్దాం. 

HYROX

HYROX అనేది రన్నింగ్, ఫంక్షనల్ ఫిట్‌నెస్ వ్యాయామాలను కలిపి చేసే ఒక రకమైన ఫిట్‌నెస్ రేస్. ఇందులో పాల్గొనేవారు మొత్తం ఎనిమిది కిలోమీటర్లు పరుగెత్తాలి. ప్రతి కిలోమీటర్ రన్నింగ్ తర్వాత.. ఒక వ్యాయామ స్టేషన్‌లో నిర్దిష్టమైన వ్యాయామాన్ని పూర్తి చేయాలి. 
ఈ రేసులో స్లెడ్‌ను నెట్టడం, వెనక్కి లాగడం, రోయింగ్, బర్పీ బ్రాడ్ జంప్స్, ఫార్మర్స్ క్యారీ, ఇసుక సంచిని భుజాలపై మోసుకుంటూ లంజెస్ చేయడం, వాల్ బాల్స్ వంటి వ్యాయామాలు ఉంటాయి. వీటిని పూర్తి చేయడానికి శారీరక దృఢత్వంతో పాటు ఓర్పు, కండరాల బలం కూడా అవసరం.

Also Read : పిలేట్సా? స్ట్రెంత్ ట్రైనింగా? వృద్ధాప్యంలో కూడా ఎముకలు బలంగా ఉండాలంటే ఏది మంచిది?

బిగినర్స్ కూడా HYROXలో చేరవచ్చా? 

వ్యాయామాలు కొత్తగా ప్రారంభించినవారు కూడా సరైన శిక్షణతో, క్రమంగా ఫిట్‌నెస్‌ను పెంచుకుంటూ HYROX కోసం సిద్ధమవ్వవచ్చు. అంతేకానీ మొదటి నుంచే అధిక తీవ్రతతో కూడిన వ్యాయామాలు చేయడం మంచిది కాదని డాక్టర్ సునీల్ దాచేపల్లి తెలిపారు. శరీరాన్ని అలవాటు చేయకుండా ఒక్కసారిగా ఎక్కువ దూరం పరుగెత్తడం, భారీ బరువులు ఎత్తడం వల్ల గాయాల ప్రమాదం పెరగవచ్చు అంటున్నారు. 

హైదరాబాద్‌కు చెందిన యశోద హాస్పిటల్స్​లో క్లినికల్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్, రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ అండ్ ఆర్థ్రోస్కోపిక్ సర్జన్​గా చేస్తోన్న డాక్టర్ సునీల్ దాచేపల్లి సూచనల ప్రకారం.. రన్నింగ్, భారీ బరువులతో చేసే వ్యాయామాలు, వేగవంతమైన కదలికలు కలిసినప్పుడు కీళ్లు, కండరాలు, టెండన్లు, లిగమెంట్లపై గణనీయమైన ఒత్తిడి పడుతుంది. అందువల్ల బిగినర్స్ ముందుగా తగిన శిక్షణ తీసుకోవాలి.

Also Read : ఎముకలు బలంగా ఉండాలంటే ఏం చేయాలి? బోన్ డెన్సిటీ తగ్గకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

ఫిట్‌నెస్‌ను పెంచుకోండి

జిమ్ కొత్తగా ప్రారంభించినవారు వేగంగా నడవడం, తేలికపాటి జాగింగ్, ప్రాథమిక స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌తో మొదలుపెట్టాలి. ఆ తర్వాత శరీర సామర్థ్యాన్ని బట్టి క్రమంగా వ్యాయామాల తీవ్రతను పెంచుకోవాలి. గుండె, ఊపిరితిత్తుల సామర్థ్యంతో పాటు కండరాల బలం పెరిగిన తర్వాతే HYROX తరహా వ్యాయామాలను సాధన చేయడం మంచిది.

మోకాళ్లు, చీలమండలపై ఒత్తిడి

HYROXలో పదేపదే పరుగెత్తాల్సి ఉంటుంది. దీనివల్ల మోకాళ్లు, చీలమండలు, పాదాలపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే మొదటి రోజే ఎక్కువ దూరం పరుగెత్తకుండా, క్రమంగా దూరాన్ని, వేగాన్ని పెంచుకోవాలి. శిక్షణ తీవ్రతను ఒక్కసారిగా పెంచితే టెండన్లలో వాపు లేదా ఎముకలపై అధిక ఒత్తిడితో సంబంధం ఉన్న గాయాలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

Also Read : ఎముకలను డ్యామేజ్ చేసే ఫుడ్స్ ఇవే.. బోన్స్ హెల్తీగా ఉండాలంటే ఇవి తినేయండి

టెక్నిక్‌తో వ్యాయామాలు

స్క్వాట్స్, లంజెస్, స్లెడ్ పుష్స్, బరువులు మోస్తూ నడవడం వంటి వ్యాయామాలు చేయాలంటే కండరాల నియంత్రణ, కీళ్ల స్థిరత్వం అవసరం. అలసిపోయినప్పుడు కూడా సరైన పద్ధతిలో వ్యాయామాలు చేయడం ముఖ్యం. తప్పు టెక్నిక్‌తో బరువులు ఎత్తడం, శరీర సామర్థ్యానికి మించిన బరువులు ఉపయోగించడం వల్ల కండరాలు పట్టేయడం, కీళ్లకు గాయాలు కావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. 

గాయాలు నిర్లక్ష్యం చేయకండి

గతంలో మోకాలి లిగమెంట్ల గాయాలు, మెనిస్కస్ సమస్యలు, చీలమండ బెణుకులు లేదా దీర్ఘకాలిక నడుము నొప్పి ఉన్నవారు HYROX శిక్షణ ప్రారంభించే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి. గాయం నుంచి కోలుకున్నంత మాత్రాన వెంటనే అధిక తీవ్రతతో కూడిన వ్యాయామాలకు సిద్ధమైనట్లు కాదు. నొప్పి ఉందా? కీళ్లు స్థిరంగా ఉన్నాయా? కండరాల బలం తిరిగి వచ్చిందా? వంటి అంశాలను పరిశీలించి వ్యాయామాలను ఎంచుకోవాలి. 

Also Read : 30 తర్వాత ఎముకలు బలంగా ఉండాలంటే.. డైట్‌లో తప్పక ఉండాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే

వార్మప్, విశ్రాంతి

ప్రతి వ్యాయామ సెషన్‌కు ముందు వార్మప్ చేయాలి. శరీరానికి తగిన విశ్రాంతి ఇచ్చేందుకు శిక్షణ మధ్యలో విశ్రాంతి రోజులు కూడా ఉండాలి. ఒకేసారి రన్నింగ్ దూరం, వ్యాయామ తీవ్రత, బరువులను పెంచకూడదని డాక్టర్ సునీల్ తెలిపారు. సరైన చెప్పులు, షూలు ధరించడంతో పాటు కండరాల బలం, బ్యాలెన్స్, శరీర కదలికల సామర్థ్యాన్ని పెంచే వ్యాయామాలను కూడా ప్రణాళికలో చేర్చాలి.

నొప్పి వస్తే లైట్ తీసుకోకండి

వ్యాయామం చేసిన తర్వాత కొంత కండరాల నొప్పి లేదా అలసట ఉండవచ్చు. అయితే నొప్పి తీవ్రంగా ఉన్నా, క్రమంగా పెరుగుతున్నా, నడవడానికి లేదా పరుగెత్తడానికి ఇబ్బందిగా ఉన్నా నిర్లక్ష్యం చేయకూడదు. కీళ్ల వాపు పదేపదే రావడం, కీలు అస్థిరంగా అనిపించడం లేదా ఎముకలో ఒకేచోట నొప్పి ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి.

Also Read : 90 శాతం మహిళల్లో విటమిన్ డి లోపం ఉందట.. ఎముకల నొప్పి, అలసట, మూడ్ స్వింగ్స్​కు ఇదే కారణమట

ఎవరు జాగ్రత్తగా ఉండాలి?

ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, గతంలో ఆర్థోపెడిక్ గాయాలకు గురైనవారు అధిక తీవ్రతతో కూడిన శిక్షణ ప్రారంభించే ముందు తగిన వైద్య నిపుణుడిని సంప్రదించాలి. వారి ఆరోగ్య పరిస్థితి, గాయం నుంచి కోలుకున్న స్థితి ఆధారంగా వ్యాయామాల తీవ్రతను నిర్ణయించుకోవాలి.

డాక్టర్ సునీల్ ప్రకారం HYROX అనేది కేవలం వేగంగా పరుగెత్తే పోటీ మాత్రమే కాదు. దీనికి ఓర్పు, కండరాల బలం, కీళ్ల స్థిరత్వం, సరైన వ్యాయామ పద్ధతులు అవసరం. బిగినర్స్ కూడా ఇందులో పాల్గొనాలని లక్ష్యంగా పెట్టుకోవచ్చు. అయితే తొందరపడకుండా, శరీర సామర్థ్యాన్ని బట్టి క్రమంగా శిక్షణ పెంచుకోవాల్సి ఉంటుంది.

Also Read : ఎత్తు తగ్గడానికి కారణాలు ఇవే.. ఎవరి Height అకస్మాత్తుగా తగ్గుతుందో తెలుసా?

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hot Stone Massage : హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
Castor Oil for Hair : జుట్టు ఒత్తుగా, మెరుస్తూ ఉండాలా? మీ జుట్టు రకాన్ని బట్టి ఆముదాన్ని ఇలా అప్లై చేయండి
జుట్టు ఒత్తుగా, మెరుస్తూ ఉండాలా? మీ జుట్టు రకాన్ని బట్టి ఆముదాన్ని ఇలా అప్లై చేయండి
Healthy Gut : కడుపు శుభ్రం కావాలంటే డీటాక్స్ డ్రింక్స్ అవసరం లేదు.. ఈ 3 అలవాట్లు చాలు, మలబద్ధకం కూడా తగ్గిపోతుంది
కడుపు శుభ్రం కావాలంటే డీటాక్స్ డ్రింక్స్ అవసరం లేదు.. ఈ 3 అలవాట్లు చాలు, మలబద్ధకం కూడా తగ్గిపోతుంది
Saffron Water : ఉదయాన్నే కుంకుమ పువ్వు నీళ్లు తాగితే కలిగే లాభాలు ఇవే.. ఎలా తాగాలో తెలుసా?
ఉదయాన్నే కుంకుమ పువ్వు నీళ్లు తాగితే కలిగే లాభాలు ఇవే.. ఎలా తాగాలో తెలుసా?
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Dayakar On Bjp: 'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం
'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం - అద్దంకి దయాకర్
YS Sharmila Letter To SEC: అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
IND VS NZ 3rd T20 Result Update: అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
Cyclone Arnab Helpline Numbers: అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
Hot Stone Massage : హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
Hyderabad Loud Sound: హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
Trains Cancelled: అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
Embed widget