Bone Health Alert : ఎముకల బలహీనతను సూచించే సంకేతాలు ఇవే.. జాగ్రత్త బోన్స్ విరిగిపోతాయట
Warning Signs of Bone Weakness : ఎముకలు బలహీనంగా మారితే మన శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుందట. వాటిని గురిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. లేకుంటే తీవ్ర సమస్యలు తప్పవట.

Signs of Bone Weakness : మానవ శరీరం ఎముకల గూడు నిర్మితం అంటారు. ఎముకలు స్ట్రాంగ్‌గా ఉంటే.. ఆరోగ్యకరమైన, చురుకైన లైఫ్‌స్టైల్ మీ సొంతమవుతుంది. అంతేకాకుండా ఇవి శరీరంలోని ముఖ్యమైన అవయవాలను రక్షిస్తాయి. అయితే వయసు పెరిగే కొద్ది ఎముకల సాంద్రత క్షీణిస్తుంది. అంతేకాకుండా బోన్స్ హెల్త్‌ని మెరుగుపరిచే ఫుడ్స్ తీసుకోకున్నా కూడా వివిధ సమస్యలు వస్తాయి. అలా ఎముకల బలం క్షీణిస్తున్నప్పుడు శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుంది.
ఎముకలు బలహీనంగా మారినప్పుడు శరీరం ఇచ్చే కొన్ని సంకేతాలను అస్సలు విస్మరించకూడదు. లేదంటే అవి పగుళ్లు, విరిగిపోవడానికి కారణమవుతాయి. శరీరంలో కాల్షియం, విటమిన్ డి వంటి అవసరమైన ఖనిజాలు శరీరానికి అందనప్పుడు ఇలా జరుగుతుంది. ఇది ఎముకల బలహీనత, బోలు ఎముకల వ్యాధికి దారితీస్తుంది. మరి ఇంతకీ ఎముకలు బలహీనంగా అయినప్పుడు శరీరం ఇచ్చే సంకేతాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
వెన్నునొప్పి
తరచూ వెన్నునొప్పి వస్తుంది. ఇది వివిధ కారణాలతో రావొచ్చు. కానీ ఎముకల బలహీనతకు ఇది ప్రమాద హెచ్చరిక కావొచ్చు. ఎముకలు వీక్‌గా ఉన్నప్పుడు వెన్నెముక దాని బలాన్ని కోల్పోతుంది. క్రమంగా అది పగుళ్లకు దారితీస్తుంది. దీనివల్ల దీర్ఘకాలిక నొప్పి వస్తుంది. ఈ సమస్యను గుర్తిస్తే వెంటనే నివారణ చర్యల్లో భాగంగా వైద్య సహాయం తీసుకోవాలి.
పగుళ్లు
ఎముకలు బలహీనంగా ఉన్నాయనడంలో పగుళ్లను ప్రధానమైన సంకేతంగా చెప్తారు. చిన్నవాటికే బోన్స్ విరిగిపోవడం, గాయాలు తగ్గడానికి ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పట్టడం బోన్ హెల్త్‌ని సూచిస్తాయి. ఈ లక్షణాలు గుర్తిస్తే కచ్చితంగా వైద్యుల దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే ఇవి మేజర్ ఫ్రాక్చర్లకు దారితీస్తాయి.
ఎత్తు తగ్గడం
బరువు తగ్గడం గురించి విని ఉంటారు. కానీ ఈ ఎత్తు తగ్గడం గురించి విన్నారా? ఎముకలు బలహీనంగా ఉన్నప్పుడు ఎత్తు తగ్గుతారట. ఎముక సాంద్రత తగ్గి.. వెన్నెముకలోని వెన్నుపూసలు కుదించుకుపోయి.. ఎత్తు తగ్గేలా చేస్తుంది. మీరు ఇలా పొట్టిగా మారుతున్నట్లు, భంగిమలో మార్పు గమనిస్తే బోన్ డెన్సిటినీ చెక్ చేసుకోవాలి.
భంగిమలో మార్పులు
వంగిపోవడం, మంచి భంగిమలో కూర్చోలేకపోవడం వంటి ఇబ్బందులు కూడా బోన్ సమస్యలనే సూచిస్తాయి. బలహీనైమన ఎముకలు వెన్నెముకపై ప్రభావం చూపించి.. సరిగ్గా కూర్చోనీయకుండా చేస్తాయి. భంగిమలో మార్పులకు దారితీస్తాయి. ఇది పగుళ్లు, వెన్నెముక సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి వెన్నెముకను స్ట్రాంగ్‌గా చేసే కొన్ని వ్యాయామాలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
గోళ్లతో..
ఎముకల ఆరోగ్యాన్ని గోళ్లతో అంచనా వేయొచ్చు. బలహీనమైన, పెళుసైన గోర్లు ఎముకల బలహీనతను సూచిస్తాయి. కాల్షియం, విటమిన్ డి వంటి ఖనిజాల లోపాన్ని సూచిస్తాయి. ఎముకల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే పోషక లోపాలను నిపుణుల సహాయంతో పరిష్కరించుకోవాలి.
చిగుళ్ల సమస్యలు
చిగుళ్ల సమస్యలు లేదా దంతాలు బలహీన పడడం కూడా ఎముకల వీక్నెస్ని సూచిస్తుంది. పీరియాంటల్ వ్యాధి అనేది దవడలో ఎముక సాంద్రత తగ్గడం వల్ల సంభవిస్తుంది. కాబట్టి నోటి శుభ్రతను ఫాలో అవ్వడం.. వైద్యుల సహాయం తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
బలం తగ్గడం..
మణికట్టులో ఎముకల బలం తగ్గిస్తే పట్టు బలం తగ్గుతుంది. వృద్ధాప్యం, కండరాల బలహీనతను ప్రధాన కారణాలుగా చెప్పినా.. ఎముకల ఆరోగ్య క్షీణత కూడా దీనిలో భాగమే. కాబట్టి చేతులు, మణికట్టు బలాన్ని పెంచడానికి నిపుణుల సూచనల మేరకు కొన్ని వ్యాయామాలు చేయాలి.
ఎముకలు బలహీనంగా ఉన్నాయని చెప్పడానికి వీటన్నింటినీ శరీరం సంకేతాలుగా చూపిస్తుంది. ఈ సమస్యలను నివారించడానికి.. వీలైనంత త్వరగా వైద్య సహాయం తీసుకోవాలి. ఎముకలకు బలాన్ని పెంచే వ్యాయామం చేయాలి. బ్యాలెన్డ్స్ ఫుడ్ తీసుకోవాలి. కాల్షియం, విటమిన్ ఉండే పదార్థాలు తీసుకోవాలి. ఎముకలపై మొత్తం ఆరోగ్యం డిపెండ్ అయి ఉంటుంది. అస్సలు విస్మరించకూడదు.
Also Read : గుండెపోటు రాకుండా ఉండాలంటే రోజూ ఈ 7 పనులు చేయండి.. హార్ట్‌కి చాలా మంచిది






















