అన్వేషించండి

Bone Health : 30 తర్వాత ఎముకలు బలంగా ఉండాలంటే.. డైట్‌లో తప్పక ఉండాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే

Foods for Strong Bones : వయసు పెరిగే కొద్ది చాలామందికి బోన్స్ వీక్ అవుతాయి. అందుకే 30 దాటగానే ఆహారంలో కొన్ని ఫుడ్స్ చేర్చుకోవాలి. అవేంటో.. వాటివల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ముప్పై ఏళ్లకే ఎముకలు బలహీనపడుతున్నాయి, పోషకాహారం ముఖ్యం.
  • సోయా, ఆకుకూరలు, పాల ఉత్పత్తులు ఎముకలకు బలాన్నిస్తాయి.
  • చేపలు, బాదం, చియా సీడ్స్ కాల్షియం, విటమిన్ డి అందిస్తాయి.
  • సప్లిమెంట్స్ కోసం వైద్యులను సంప్రదించండి, ఆరోగ్యం జాగ్రత్త.

Diet for Strong Bones After 30 : వయసు పెరిగే కొద్దీ శరీరంతో పాటు ఎముకలు కూడా క్రమంగా బలహీనపడతాయి. ఈ మధ్యకాలంలో 30 ఏళ్ల నుంచే ఈ సమస్యలు పెరుగుతున్నాయి. చాలామంది కీళ్లనొప్పులు, బోన్​ ఫ్రాక్చర్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం కాల్షియం, పోషకాల లోపమే. దీనివల్ల కీళ్ల నొప్పులు, పట్టేసినట్లు ఉండడం, నడవడంలో ఇబ్బంది వంటివి ఎదుర్కొంటారు. 

ఎముకలు శరీరానికి ఆధారం. వాటిని బలంగా ఉంచుకోవడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకే మన డైట్​లో కొన్ని ఫుడ్స్ చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల ఎముకలు చాలా కాలం పాటు బలంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మరి బోన్స్​ని బలోపేతం చేయడానికి ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిదో ఇప్పుడు చూసేద్దాం. 

సోయా

వెజిటేరియన్స్, నాన్​వెజిటేరియన్స్​ తినగలిగే ఫుడ్స్​లో సోయా ఒకటి. ముఖ్యంగా శాకాహారులు సోయా ఫుడ్స్ ప్రోటీన్ కోసం తీసుకుంటారు. అయితే ఇవి కాల్షియంకి కూడా అద్భుతమైన సోర్స్. టోఫు, సోయా పాలలో మంచి మొత్తంలో ప్రోటీన్, కాల్షియం లభిస్తాయి. ఇవి ఎముకలను బలపరిచి, కండరాలకు మద్దతు ఇవ్వడానికి సహాయపడతాయి. వాటిలో కొలెస్ట్రాల్ ఉండదు. కాబట్టి గుండెకు కూడా మంచివిగా పరిగణిస్తారు.

ఆకుకూరలు..

పాలకూర, క్యాబేజీ, బ్రోకలీ, కాలీఫ్లవర్ వంటి ఆకుకూరల్లో కాల్షియం, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల క్షీణతను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో ఖనిజ సమతుల్యత మెరుగై.. ఎముక సాంద్రత పెరుగుతుంది.

మిల్క్ పొడెక్ట్స్

పాలు, పాల ఉత్పత్తులు కాల్షియానికి మంచి సోర్స్. పెరుగు, యోగర్ట్ కూడా ఎముకలను బలపరచడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు లేదా ఒక గిన్నె పెరుగు తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది.

చేపలు

చేపలలో కాల్షియంతో పాటు విటమిన్ డి కూడా ఉంటుంది. ఇది శరీరంలోని కాల్షియంను సరిగ్గా గ్రహించడానికి సహాయపడుతుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు.. ఎముకలు, కీళ్ల నొప్పులను తగ్గించి.. శరీరాన్ని చురుకుగా ఉంచడంలో సహాయపడతాయి.

బాదం

బాదంలో కాల్షియం, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను, కండరాలను బలపరుస్తాయి. ప్రతిరోజూ 5-8 నానబెట్టిన బాదాలను తినడం ఎముకలకు చాలా మేలు జరుగుతుంది. బాదం పాలు కూడా ఒక మంచి ఎంపిక.

చియా సీడ్స్

చియా గింజలు, గసగసాలు, అవిసె గింజల వంటి చిన్న విత్తనాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. చియా సీడ్స్, గసగసాలు ఎముకల పెరుగుదలను, బలాన్ని ప్రోత్సహిస్తాయి. ఇవి శరీరంలోని ఖనిజాల సమతుల్యతను కూడా మెరుగుపరుస్తాయి.

కాబట్టి ఈ ఫుడ్స్ మీరు రెగ్యులర్​గా తీసుకుంటే ఆరోగ్యానికే కాకుండా.. ఎముకలకు కూడా మేలు జరుగుతుంది. అలాగే కాల్షియం లెవెల్స్, విటమిన్ డి లెవెల్స్ తగ్గకుండా చూసుకోవాలి. లోపం ఉంటే వైద్యుల సూచనలతో సప్లిమెంట్స్ తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Managing Diabetes : డయాబెటిస్ మందులతో మాత్రమే కాదు.. ఈ అలవాట్లు కూడా పాటిస్తేనే షుగర్ అదుపులో ఉంటుందట, డాక్టర్ల సూచనలు ఇవే
డయాబెటిస్ మందులతో మాత్రమే కాదు.. ఈ అలవాట్లు కూడా పాటిస్తేనే షుగర్ అదుపులో ఉంటుందట, డాక్టర్ల సూచనలు ఇవే
Kidney Health : కిడ్నీలను డీటాక్స్ చేసి ఆరోగ్యంగా ఉంచే డ్రింక్స్.. నీటి తర్వాత ఇవే బెస్ట్
కిడ్నీలను డీటాక్స్ చేసి ఆరోగ్యంగా ఉంచే డ్రింక్స్.. నీటి తర్వాత ఇవే బెస్ట్
Diabetes and Dengue : మధుమేహం(Type 2 Diabetes) ఉన్నవారికి డెంగ్యూ వస్తే ప్రమాదమా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి
మధుమేహం(Type 2 Diabetes) ఉన్నవారికి డెంగ్యూ వస్తే ప్రమాదమా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget