అన్వేషించండి

Things To Impress Your Girl : ప్రేమించిన వాడి నుంచి అమ్మాయిలు ఏమి కోరుకుంటారో తెలుసా? ఇలా ఉంటే వారికి చాలా నచ్చుతారట

Girls Expect in Relationship : లవర్​ నుంచి అమ్మాయిలు కొన్ని విషయాలు ఎక్స్​పెక్ట్ చేస్తారట. అవేంటో వాళ్లు చెప్పరు కానీ.. వీటిని చేస్తే అమ్మాయిలు చాలా ఇంప్రెస్ అవుతారట. ట్రై చేసేయండి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అమ్మాయిలు కోరుకునేవి, బయటకు చెప్పని కోరికలు కొన్ని ఉంటాయి.
  • ప్రేమించినవాడు గట్టిగా హగ్ చేసుకోవడం, సీక్రెట్స్ పంచుకోవడం ఇష్టపడతారు.
  • వారికి నచ్చిన టీ-షర్ట్స్ వేసుకోవడానికి ఇవ్వడం, మెల్లగా ముద్దు పెట్టడం సంతోషపరుస్తుంది.
  • బయటకు తీసుకెళ్లడం, చిన్న విషయాలు గుర్తించడం, భద్రతగా భావించేలా చూడటం ముఖ్యం.

Things Girls Want But Won’t Ask : ప్రేమించిన వ్యక్తి నుంచి.. అమ్మాయి అయినా అబ్బాయి అయినా కొన్ని విషయాలు ఎక్స్​పెక్ట్ చేస్తారు. ముఖ్యంగా అమ్మాయిలు తమ కోరికలు బయటకు చెప్పరు కానీ.. ప్రేమించిన వ్యక్తి తనతో ఇలా ఉండాలి.. అలా ఉండాలని విష్ లిస్ట్ పెట్టుకుంటారు. తెలుగు ఆడపడుచు.. నిజంగానే తెలపలేదు మనసు. పాపం ఇవేమి తెలియని ప్రియుడు మాత్రం.. ఆమెతో ఎలా ఉండాలి.. ఎలా ఇంప్రెస్ చేయాలి అని తెగ అల్లాడిపోతారు. మీరు కూడా అలాంటివారిలో ఒకరా? అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న అమ్మాయిల కోరికల చిట్టా ఇక్కడ ఉంది. ఓ లుక్ వేయండి.

ప్రేమించిన వాడు.. తమతో ఇలా ఉండాలి Things Girls Want but Wont Ask for అనే పేరుతో పోస్ట్​ని వైరల్ చేస్తున్నారు. దీనిని చాలామంది సైలెంట్​గా తమ ప్రియుడికి షేర్ చేసి.. చెప్పకనే.. తమ కోరికలు చెప్తున్నారు. ఇంతకీ ఆ లిస్ట్ ఏంటో.. అమ్మాయిల చిన్న చిన్న కోరికలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూసేద్దాం. 

సో బాబు పుల్ హెర్ క్లోజర్..

ప్రేమించిన వాడు.. తమ నడుము పట్టుకుని దగ్గరికి లాక్కుంటే అమ్మాయిలకు చాలా ఇష్టమట. వినడానికి కాస్త వైల్డ్​గా ఉన్నా.. ప్రేమించినవాడి నుంచి అమ్మాయిలు దీనిని ఎక్స్​పెక్ట్ చేస్తారట. మీ లవర్ కోపంలో ఉన్నా.. అలిగినా.. ఇలా ఓసారి ట్రై చేయండి. మే బి కూల్ అయిపోవచ్చు. 

నీ డే ఎలా ఉంది బుజ్జి?

రోజులో ఎంత బిజీగా ఉన్నా.. పడుకునేప్పుడు మాత్రం.. తన డే ఎలా ఉందో అడగండి. ఆ రోజంతా తను ఏమి చేసిందో.. తెలుసుకోండి. సో దట్ మీరు రోజంతా తనకి అందుబాటులో లేకున్నా.. డే ఎండ్ అయ్యే సరికి తన మనసు ప్రశాంతంగా ఉంటుంది.

సీక్రెట్స్ చెప్పు గురు

మీ సీక్రెట్స్ తనతో చెప్పుకోవాలని అమ్మాయిలు కచ్చితంగా ఎక్స్​పెక్ట్ చేస్తారు. ఇది మీ మధ్య బాండ్ మరింత పెంచుతుంది. తనని నమ్మి అన్ని విషయాలు షేర్ చేశారు అని భావిస్తుంది. 

మీ షర్ట్​కే టెండర్

అమ్మాయిలకు తన బ్రదర్స్ లేదా నాన్న షర్ట్స్ వేసుకునే అలవాటు ఉంటుంది. అవి వారికి చాలా కంఫర్ట్ ఫీలింగ్ ఇస్తాయి. అలాగే తన బాయ్​ఫ్రెండ్.. పెళ్లి అయితే భర్తవి డ్రెస్ వేసుకోవాలనుకుంటుంది. కాబట్టి తనకోసం మీ షర్ట్స్ ఒక్కోసారి శాక్రిఫైజ్ చేసేయండి. ఇచ్చేయండి సార్.. ఇచ్చేయండి. 

కిస్ చేసేప్పుడు..

నా గర్ల్​ఫ్రెండ్ రొమాంటిక్​గా ఉండదు అనుకోకండి.. వాళ్లకున్నా ఫాంటసీలు చెప్తే మీరు తట్టుకోలేరు. అలాంటి వాటిలో కిస్ కూడా ఒకటి. మీరు కంగారుగా, కక్కుర్తితో కాకుండా.. మెల్లగా కరగని అనే సాంగ్ మైండ్​లో వేసుకుంటూ స్లోగా ముద్దు పెడితే.. వారు స్లో పాయిజిన్ ఇచ్చినంత కిక్ ఫీల్ అవుతారట. సో కంగారు పడకండి. నిదానమే ప్రధానం. 

జంతర్ మంతర్ చూమంతర్ కాళీ.. 

వీలైతే హగ్స్ ఇవ్వండి డ్యూడ్. మహా అయితే తిరిగి ఓ హగ్ ఇస్తారు. లేదా ప్రేమగా మీ కౌగిళ్లలో ఒదిగి పోతారు. అమ్మాయిలు తమ ప్రేమించిన అబ్బాయిలు హగ్ చేసుకోవడాన్ని చాలా సెక్యూర్డ్​గా ఫీల్​ అవుతారని అస్సలు మరచిపోకండి.

నీ నవ్వులే వెన్నెలనీ.. 

ప్రేమించిన వ్యక్తితో మాట్లాడాలని.. వారితో కలిసి నవ్వుకుంటే హాయిగా ఉంటుందని అమ్మాయే కాదు.. అబ్బాయి కూడా ఫీల్ అవుతారు. కాబట్టి సరదాగా కాసేపైనా అనే సాంగ్ వేసుకుంటూ.. హాయిగా నవ్వేసుకోండి. 

కారులో కాకున్నా షికారుకి వెళ్లిపోండి.. 

అమ్మాయిలు బయటకు వెళ్లాలంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కాబట్టి వారికి బయటకు వెళ్లాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకుని.. మీరు గుడ్ బాయ్​ ఫ్రెండ్​లాగా ఆమెకు కుదిరిన టైమ్​లో బయటకు వెల్దామని ఆఫర్ చేయండి. మీ పిల్ల మస్త్ కుష్ అయిపోద్ది. 

అప్పుడప్పుడు కోహ్లిని ఫాలో అయిపో

విరాట్ కోహ్లి ప్రతి సెలబ్రేషన్ ముందు అనుష్కకి కాల్ చేసి.. లేదా గ్రౌండ్​లో ఆమెకు ఫ్లైయింగ్ కిస్​ ఇస్తే చూసి మురిసిపోయే అమ్మాయిలు బ్రో. నువ్వు కూడా ఎంత బిజీగా ఉన్నా ఏదొక టైమ్​లో చిన్న మెసేజ్ చేసేయి.. నీ లవర్ కింగ్(విరాట్) వైఫ్​ కంటే ఎక్కువగా మురిసిపోతుంది.

చిన్ని చిన్ని ఆశ.. చిన్నదాని ఆశ

తను చేసే చిన్ని చిన్ని విషయాలు నోటిస్ చేసి గుర్తుపెట్టుకుంటే చాలు. తను ఏమి ఇష్టంగా తింటుంది. నీతో ఏ టాపిక్ మాట్లాడాన్ని ఎంజాయ్ చేస్తుంది. నీతో ఎక్కడికి వెళ్లడం తనకి నచ్చుతుంది. పబ్లిక్​లో వెళ్తుంటే చేయి పట్టుకుని నడిపించేయి. ఇలాంటి విషయాలు ఆమె చెప్పకుండా నువ్వు అర్థం చేసుకుంటే చాలు. నువ్వు ఆ పిల్ల దునియాలో తోపు. తోపర్. తోపెస్ట్.

మరిన్ని చిట్టి చిట్టి కోరికలు..

మీతో ఉంటే తనకి ఎలాంటి భయం ఉండదు అనే ఫీల్ ఇస్తే చాలు బ్రో. ఆమె నీకోసం ప్రపంచాన్నే ఎదురించేస్తాది. తనని నలుగురిలో ఎప్పుడు తక్కువ చేయకు. కుదిరితే ఆమె చిన్న చిన్న విజయాలు సెలబ్రేట్ చేయ్. నీతో తను ఏదైనా చెప్తుంటే ఫోన్ పట్టుకుని ఊ ఊ అనడం కాకుండా.. జాగ్రత్తగా విను. చాలు. ఇలాంటివి ఏ అమ్మాయి తన బాయ్​ఫ్రెండ్​కి చెప్పకపోవచ్చు. కానీ వాటిని నువ్వు అర్థం చేసుకుంటే చాలు. ఇదేదో ప్రిన్సెన్స్ ట్రీట్​మెంట్ అనుకోకు. ఇవి జస్ట్ బేర్ మినిమం. 

ఇక్కడ మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఇవి మీ గర్ల్​ఫ్రెండ్ లేదా వైఫ్​ దగ్గర మాత్రమే చేస్తే బాగుంటుంది. ఆ అమ్మాయికి మీరు అంటే ఇష్టం ఉంటేనే వీటిని ట్రై చేయండి. కాదు.. కాకూడదు అంటే సాయిరాంం అనుకోవాల్సిందే. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Best Fruits For Kidney : ఈ పండ్లు తింటే మూత్రపిండాల ఆరోగ్యానికి మంచిది.. కిడ్నీల కోసం కచ్చితంగా డైట్లో చేర్చుకోండి
ఈ పండ్లు తింటే మూత్రపిండాల ఆరోగ్యానికి మంచిది.. కిడ్నీల కోసం కచ్చితంగా డైట్లో చేర్చుకోండి
Uric Acid : యూరిక్ యాసిడ్ అంటే ఏంటి? ఇది ఎక్కువైతే ఆరోగ్యానికి కలిగే నష్టాలివే.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
యూరిక్ యాసిడ్ అంటే ఏంటి? ఇది ఎక్కువైతే ఆరోగ్యానికి కలిగే నష్టాలివే.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Reduce Stress Quickly : ఒత్తిడి, యాంగ్జైటీ ఎక్కువ అవుతుందా? క్షణాల్లో మనసుకు ప్రశాంతతను ఇచ్చే 5 టెక్నిక్స్ ఇవే
ఒత్తిడి, యాంగ్జైటీ ఎక్కువ అవుతుందా? క్షణాల్లో మనసుకు ప్రశాంతతను ఇచ్చే 5 టెక్నిక్స్ ఇవే
Habit of Shaking Legs While Sitting: కూర్చున్నప్పుడు కాళ్లు ఊపుతున్నారా? ఈ అలవాటు మీ లక్, ఆరోగ్యం, భవిష్యత్తును ఎలా మార్చేస్తుందో తెలుసా?
కూర్చున్నప్పుడు కాళ్లు ఊపుతున్నారా? ఈ అలవాటు మీ లక్, ఆరోగ్యం, భవిష్యత్తును ఎలా మార్చేస్తుందో తెలుసా?
Advertisement

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol Diesel Price Hike: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. భారత్‌లో చమురు సెగ మొదలైందా?
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. భారత్‌లో చమురు సెగ మొదలైందా?
BRS Internal Crisis: కేటీఆర్‌, హరీష్ రావుకు మధ్య పెరుగుతున్న దూరం - బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది?
కేటీఆర్‌, హరీష్ రావుకు మధ్య పెరుగుతున్న దూరం - బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది?
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ - ఆరు నెలల్లో ఖాతాల్లోకి నగదు.. క్లియరెన్స్‌కు హై లెవల్ కమిటీ!
అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ - ఆరు నెలల్లో ఖాతాల్లోకి నగదు.. క్లియరెన్స్‌కు హై లెవల్ కమిటీ!
AP University Posts: ఏపీ యూనివ‌ర్సిటీల్లో 1523 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. ముఖ్యమైన తేదీలు, వర్సిటీల వారీగా ఖాళీల వివరాలు
ఏపీ యూనివ‌ర్సిటీల్లో 1523 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. ముఖ్యమైన తేదీలు, వర్సిటీల వారీగా ఖాళీల వివరాలు
Prateek Yadav Last Rites: అల్లుడికి అంత్యక్రియలు నిర్వహించే హక్కు మామకు ఉంటుందా? గరుడ పురాణం ఏం చెబుతోంది!
అల్లుడికి అంత్యక్రియలు నిర్వహించే హక్కు మామకు ఉంటుందా? గరుడ పురాణం ఏం చెబుతోంది!
Formula E Race Case: కేటీఆర్‌కు షాక్ - ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ కోర్టు సమన్లు - జూలై 31న హాజరు కావాలని ఆదేశం!
కేటీఆర్‌కు షాక్ - ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ కోర్టు సమన్లు - జూలై 31న హాజరు కావాలని ఆదేశం!
IPL 2026 MI VS PBKS Result Update: పంజాబ్‌ను దెబ్బ తీసిన MI, అర్షదీప్‌ వల్గర్ కామెంట్స్‌కు బ్యాట్‌తో తిల‌క్ ఆన్సర్, పీబీకేఎస్‌కు వ‌రుస‌గా ఐదో ఓట‌మి
పంజాబ్‌ను దెబ్బ తీసిన MI, అర్షదీప్‌ వల్గర్ కామెంట్స్‌కు బ్యాట్‌తో తిల‌క్ ఆన్సర్, పీబీకేఎస్‌కు వ‌రుస‌గా ఐదో ఓట‌మి
Arshdeep Singh Racist Comment on Tilak Varma: ఓయ్‌ బ్లాకీ, సన్‌స్క్రీన్ రాసుకున్నావా? తిలక్‌ వర్మపై అర్ష్‌దీప్ సింగ్ బలుపు కామెంట్స్ వైరల్! 
ఓయ్‌ బ్లాకీ, సన్‌స్క్రీన్ రాసుకున్నావా? తిలక్‌ వర్మపై అర్ష్‌దీప్ సింగ్ బలుపు కామెంట్స్ వైరల్! 
Embed widget