అన్వేషించండి

Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు

ఏపీలో పంటల బీమా నమోదు నత్తనడకన సాగుతోంది. 3 రోజుల్లో గడువు ముగుస్తున్నందున అధికారులు రైతులకు అవగాహన కల్పించి, నమోదు పెంచి కరవు నష్టాల నుంచి ఉపశమనం పొందవచ్చు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఏపీలో పంటల బీమా నమోదు ప్రక్రియ మందకొడిగా, గడువు సమీపిస్తోంది.
  • రాయలసీమలో మెరుగైన నమోదు, ఇతర జిల్లాల్లో అవగాహన కొరత ఉంది.
  • ఎల్‌నినో ముప్పు దృష్ట్యా, ప్రభుత్వం తక్షణమే అవగాహన పెంచాలి.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్ పంటల బీమా నమోదు ప్రక్రియలో జోరు కనిపించడం లేదు. పంటల బీమా నమోదు ముగియడానికి మరో 3 రోజులే గడువు (జులై నెలాఖరు వరకు) ఉన్నప్పటికీ, పలు జిల్లాల్లో పరిస్థితి ఏమాత్రం మారలేదు. రాష్ట్రవ్యాప్తంగా కేవలం 15.25 లక్షల ఎకరాలకు మాత్రమే 2 బీమా పథకాల కింద ప్రీమియం చెల్లించారు. కొన్ని జిల్లాలు, మండలాల్లో పంటల బీమా (Pradhan Mantri Fasal Bima Yojana - PMFBY) నమోదు సున్నా(0)గా ఉందని అధికారులు గుర్తించారు. 

రాబోయే రోజుల్లో ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం తద్వరా వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఉన్నప్పటికీ, వ్యవసాయ అధికారులు, సిబ్బంది రైతులకు అవగాహన కల్పించడంలో విఫలం అవుతున్నారు. ప్రజాప్రతినిధులు సైతం రైతులకు అంతగా సూచనలు చేయడం లేదని వినిపిస్తోంది. వ్యవసాయ శాఖ ప్రత్యేక శిబిరాలు నిర్వహించి రైతులను ప్రోత్సహిస్తే, వారు పంటల బీమా నమోదు చేసుకుంటారు. తద్వారా కరవు ముప్పు వచ్చినా రైతులకు నష్టపరిహారం లభించి ఆసరాగా నిలుస్తుంది.

రాయలసీమ ముందంజ.. తీరప్రాంత జిల్లాల్లో అత్యల్పం
రాష్ట్రంలో నమోదైన మొత్తం 15.25 లక్షల ఎకరాల బీమాలో ఒక్క కర్నూలు, అనంతపురం జిల్లాల వాటానే 60% ఉంది. నంద్యాల, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో నమోదు కొంతవరకు మెరుగ్గా ఉన్నప్పటికీ, మిగిలిన జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా (PMFBY) కింద 12 జిల్లాల్లో సగటున వెయ్యి ఎకరాలు కూడా పంటల బీమాకు నమోదు చేసుకోలేదు. సవరించిన వాతావరణ ఆధారిత బీమా (WBCIS) కింద 9 జిల్లాల్లో సగటున 500 ఎకరాల్లో కూడా బీమా చేయకపోవడం ఆందోళన పెంచుతోంది. 

తక్కువ ప్రీమియం ఉన్నా ఆసక్తి చూపని రైతులు

ఖరీఫ్‌లో వరి, వేరుశనగ, కంది, పత్తి, మిరప, మినుము, మొక్కజొన్న వంటి పంటలు అధికంగా సాగవుతున్నప్పటికీ ప్రీమియం తక్కువగా ఉన్న చోట్ల కూడా రైతులు బీమా చేయడం లేదు. ఉదాహరణకు ఎకరా మిరపకు కేవలం రూ.360, ఓ జిల్లాలో ఎకరా కందికి రూ.36, కోనసీమ జిల్లాలో ఎకరా వరికి రూ.76 మాత్రం ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. అయినప్పటికీ అవగాహన లేకపోవడంతో రైతులు పంటలకు బీమా చేయించడం లేదు. వరి ఎక్కువగా సాగయ్యే ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పంట బీమా నమోదు చాలా తక్కువగా నమోదైంది. ఖరీఫ్ సాధారణ పంటలకు జులై నెలాఖరు వరకు, వరి పంటకు ఆగస్టు 15 వరకు గడువు ఉంది. కనుక ఏపీ ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి రైతులకు అవగాహనా కల్పించి, పంటల బీమా వైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలే ఈ ఏడాది వ్యవసాయరంగంపై ఎల్‌నినో ప్రభావం అధికంగా ఉండనుందని అధికారులు అంచనా వేశారు.

Frequently Asked Questions

ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్ పంటల బీమా నమోదు ప్రస్తుత పరిస్థితి ఏమిటి?

జూలై నెలాఖరు వరకు గడువు ఉన్నప్పటికీ, రాష్ట్రంలో కేవలం 15.25 లక్షల ఎకరాలకు మాత్రమే బీమా చేయబడింది. కొన్ని జిల్లాల్లో నమోదు సున్నాగా ఉంది, ఇది ఆందోళన కలిగిస్తోంది.

రైతులు పంటల బీమా చేసుకోవడానికి ఎందుకు ఆసక్తి చూపడం లేదు?

వ్యవసాయ అధికారులు, సిబ్బంది అవగాహన కల్పించడంలో విఫలమవడం, ప్రజాప్రతినిధుల సూచనలు లేకపోవడం ప్రధాన కారణాలు. తక్కువ ప్రీమియం ఉన్నా, అవగాహన లేకపోవడంతో రైతులు బీమా చేయడం లేదు.

ఏ జిల్లాల్లో పంటల బీమా నమోదు మెరుగ్గా ఉంది, ఎక్కడ తక్కువగా ఉంది?

రాయలసీమ జిల్లాలైన కర్నూలు, అనంతపురం వంటివి 60% వాటాతో ముందంజలో ఉన్నాయి. ఉభయ గోదావరి, కృష్ణా వంటి తీరప్రాంత జిల్లాల్లో నమోదు చాలా తక్కువగా ఉంది.

ఈ సంవత్సరం పంటల బీమా ఎందుకు ముఖ్యమైనది?

ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం కారణంగా వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. బీమా చేసుకుంటే కరవు ముప్పు వచ్చినా రైతులకు నష్టపరిహారం లభిస్తుంది.

ఖరీఫ్ పంటల బీమా నమోదుకు చివరి గడువు ఎప్పుడు?

సాధారణ ఖరీఫ్ పంటలకు జులై నెలాఖరు వరకు గడువు ఉంది. వరి పంటకు మాత్రం ఆగస్టు 15 వరకు నమోదు చేసుకోవచ్చు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Advertisement

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
OG Sequel : మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
Embed widget