అన్వేషించండి

Ragi Java : వేసవికాలంలో రోజూ చోడి జావ తాగితే ఏమవుతుంది? ఎవరికి మంచిది.. ఎవరికి కాదు?

Ragi Java in Summer : సమ్మర్లో కొన్ని ఫుడ్స్ ఆరోగ్యానికి చాలా మంచివిగా చెప్తారు. అలాంటి వాటిలో చోడి జావ ఒకటి. అయితే దీనిని ఎలా తీసుకుంటే మంచిది? ఎవరు తీసుకోకూడదో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వేసవిలో రాగిజావ తాగితే శరీరానికి చల్లదనం లభిస్తుంది.
  • రాగిజావ జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
  • థైరాయిడ్, కిడ్నీ సమస్యలున్నవారు రాగిజావ తాగడం తగ్గించాలి.
  • ఉదయం లేదా మధ్యాహ్నం తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు.

Beat the Heat with Ragi Java : వేసవి స్టార్ట్ అవ్వగానే చాలామంది ఉదయాన్నే చోడి జావ (రాగిజావ) తీసుకుంటారు. ఎందుకంటే సమ్మర్​లో శరీరం త్వరగా డీహైడ్రేట్ అవుతుంది. దీంతో అలసట, బలహీనత, హీట్ స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో కొన్ని ఫుడ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. అలాంటి వాటిలో చోడి జావ ఒకటి. అందుకే పాతకాలం నుంచే ఈ ట్రెడీషన్ కొనసాగుతుంది. 

చోడి జావ ఆరోగ్యానికి మంచిదే అయినా దానిని కొందరు తీసుకోకూడదట. ఇంతకీ చోడి జావ వల్ల కలిగే లాభాలు ఏంటి? దీనిలో మజ్జిగ వేసుకోవచ్చా? లేదా? ఎవరు తీసుకుంటే మంచిది? ఎవరు దీనికి దూరంగా ఉంటే బెస్టో ఇప్పుడు చూసేద్దాం. 

చోడి జావ తాగితే కలిగే లాభాలు

చోడి జావ శరీర ఉష్ణోగ్రతను తగ్గించి.. హీట్ నుంచి రక్షిస్తుంది. ఎండ వేడి లేకుండా శరీరాన్ని కూల్​గా ఉంచుతుంది. అలాగే నేచురల్ ఎనర్జీ డ్రింక్‌లా పనిచేస్తుంది. ఉదయాన్నే తీసుకోవడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. గట్ హెల్త్ మెరుగవుతుంది. జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 

రాగి జావలో కాలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే ఎక్కువ సంతృప్తిని ఇస్తాయి. దీనివల్ల ఎక్కువసేపు క్రేవింగ్స్ లేకుండా ఉంటారు. బరువు తగ్గేందుకు ఇది మంచి ఫలితాలు ఇస్తుంది. కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలకు బలం అందుతుంది. ఇవన్నీ మంచి ఫలితాలే అయినా.. దీని జోలికి కొందరు వెళ్లకపోవడమే మంచిది అంటున్నారు. 

రాగి జావ ఎవరు తాగకపోతే మంచిది?

థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఎక్కువగా తీసుకుంటే సమస్య పెరగొచ్చు. కిడ్నీ సమస్యలున్నవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మినరల్స్ ఎక్కువగా ఉండటం సమస్య పెరిగే ప్రమాదం ఉంది. అలాగే చిన్నపిల్లలకు ముఖ్యంగా 6 నెలల లోపు వారికి డాక్టర్ సలహా లేకుండా ఇవ్వకూడదు. అలర్జీ ఉన్నవారు కూడా తీసుకోకూడదు. 

ఏ సమయంలో తాగితే బెస్ట్?

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా లేదా మధ్యాహ్నం ముందు తీసుకుంటే మంచిది. ఖాళీ కడుపుతో తాగితే ఇంకా మంచి ప్రయోజనాలు అందుతాయి. సాయంత్రం కూడా తాగవచ్చు కానీ రాత్రి ఎక్కువగా తీసుకోవద్దు. 

ఎలా తీసుకుంటే మంచిది?

రాగిజావను మజ్జిగ లేదా నీటితో కలిపి తాగితే కూలింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది.  ఉప్పు, ఉల్లిపాయ, కరివేపాకు కలిపితే రుచి బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. బెల్లం వేసుకుంటే ఇంకా మంచిది. డ్రై ఫ్రూట్స్ వేసుకుని కూడా దీనిని తీసుకోవచ్చు. మీ టేస్ట్​ని బట్టి దీనిని మీ రొటీన్​లో చేర్చుకోవచ్చు. 

సమ్మర్లో చోడి జావ ఒక సూపర్ హెల్తీ డ్రింక్. అయితే మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి తీసుకోవడం చాలా ముఖ్యం. సరైన విధంగా తీసుకుంటే ఇది మంచి ప్రయోజనాలు ఇస్తుంది. కచ్చితంగా మీ వైద్యుడి సూచనలు తీసుకుని ఫాలో అయితే మంచిది. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Anemia Symptoms : మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే ఇది రక్తహీనత (Iron Deficiency) కావచ్చు, లైట్ తీసుకోకండి
మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే ఇది రక్తహీనత (Iron Deficiency) కావచ్చు, లైట్ తీసుకోకండి
Storing Beer in the Fridge : బీరును ఫ్రిడ్జ్​లో పెడుతున్నారా? అయితే ఈ విషయాలు కూడా దృష్టిలో పెట్టుకోండి
బీరును ఫ్రిడ్జ్​లో పెడుతున్నారా? అయితే ఈ విషయాలు కూడా దృష్టిలో పెట్టుకోండి
Dementia Signs : మతిమరుపు లేదా డిమెన్షియా? ఈ 7 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త, వైద్యుల సూచనలివే
మతిమరుపు లేదా డిమెన్షియా? ఈ 7 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త, వైద్యుల సూచనలివే
Turkish Chicken Recipe : రెస్టారెంట్ స్టైల్ టర్కిష్ చికెన్.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి, రెసిపీ ఇదే
రెస్టారెంట్ స్టైల్ టర్కిష్ చికెన్.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి, రెసిపీ ఇదే

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ward Secretariat Employees: స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Urban Land Ceiling: యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
ABP Desam Top 10, 28 September 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 28 September 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ
సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Medaram Jatara Dates: మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
World Tourism Day Arrangements: ఏపీ పర్యాటకానికి సోషల్ మీడియా బూస్ట్.. పర్యాటక ప్రాంతాలకు గ్లోబల్ ప్రచారం.. ఇన్‌ఫ్లూయెన్సర్లతో మంత్రి దుర్గేష్ బంతి భోజనాలు
ఏపీ పర్యాటకానికి సోషల్ మీడియా బూస్ట్.. పర్యాటక ప్రాంతాలకు గ్లోబల్ ప్రచారం
Storing Beer in the Fridge : బీరును ఫ్రిడ్జ్​లో పెడుతున్నారా? అయితే ఈ విషయాలు కూడా దృష్టిలో పెట్టుకోండి
బీరును ఫ్రిడ్జ్​లో పెడుతున్నారా? అయితే ఈ విషయాలు కూడా దృష్టిలో పెట్టుకోండి
Vijayawada News: అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
Embed widget