మలబద్దకాన్ని తగ్గించే మార్నింగ్ డ్రింక్స్ ఇవే.. ఫ్రీ మోషన్​కి బెస్ట్

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Pexels

కడుపు ఖాళీ అయితే రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. మలబద్ధాకాన్ని దూరం చేసే చిట్కాలు ఇప్పుడు చూద్దాం.

Image Source: Canva

ఉదయం లేవగానే 1–2 గ్లాసుల గోరువెచ్చని నీరు తాగడం వల్ల పేగులు శుభ్రపడి జీర్ణక్రియ ప్రారంభమవుతుంది.

Image Source: Canva

వెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె మిశ్రమం టాక్సిన్స్​ను బయటకు పంపడానికి, జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

Image Source: Canva

రాత్రిపూట చిటికెడు ఇంగువను నానబెట్టి.. పరగడుపున తీసుకోవడం వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుంది.

Image Source: freepik

వెచ్చని నీటిలో ఒక స్పూన్ నెయ్యి చిటికెడు ఉప్పుతో కలిపి తీసుకోవడం వల్ల పేగులు బాగా తేమగా మారడానికి సహాయపడుతుంది.

Image Source: Canva

ఖాళీ కడుపుతో కలబంద రసం తాగడం వల్ల వాపు తగ్గుతుంది. ఫైబర్ అవసరాలు తీరుతాయి.

Image Source: Canva

వేసవిలో పుదీనా ఆకులను నిమ్మరసంతో కలిపి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది.

Image Source: Canva

జీలకర్ర నీరు త్రాగడం జీవక్రియను పెంచుతుంది. జీర్ణ ఎంజైమ్లను సక్రియం చేస్తుంది.

Image Source: freepik

నీరు తాగిన తరువాత 15–20 నిమిషాల నడక ప్రేగుల కదలికను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

Image Source: Canva