అన్వేషించండి

Colon Cancer : ఈ 5 లక్షణాలు కనిపిస్తే లైట్ తీసుకోకండి.. పెద్దపేగు క్యాన్సర్‌ హెచ్చరిక సంకేతాలు ఇవే

Warning Signs of Colon Cancer : మీ శరీరంలో ఈ 5 లక్షణాలు కనిపిస్తుంటే.. అప్రమత్తంగా ఉండాలని.. లేకపోతే అవి పెద్ద పేగు క్యాన్సర్​కు దారి తీస్తాయని అంటున్నారు. ఇంతకీ ఆ ప్రమాద హెచ్చరికలు ఏంటి?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అకారణంగా అలసట, పాలిపోయిన చర్మం ఐరన్ లోపాన్ని సూచిస్తాయి.
  • మలబద్ధకం, విరేచనాలు పేగులలో కణితి అడ్డంకిని సూచిస్తాయి.
  • ప్రయత్నం లేకుండా బరువు తగ్గడం పోషకాహార లోపాన్ని సూచిస్తుంది.
  • కడుపు నొప్పి, కొద్దిగా తిన్నా కడుపు నిండినట్లు అనిపిస్తుంది.
  • మలంలో రక్తం కనిపించడం అత్యంత ముఖ్యమైన హెచ్చరిక సంకేతం.

Hidden Signs of Colon Cancer : పెద్దపేగు క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు చాలా సాధారణమైనవిగా ఉంటాయి. అందుకే వీటిని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. కానీ పెద్దపేగు క్యాన్సర్​ను సూచించే ఈ 5 సూక్ష్మ సంకేతాలను నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా యువకుల్లో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలెర్ట్ అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే ఈ క్యాన్సర్ మిమ్మల్ని బలి తీసుకుంటుందని హెచ్చరిస్తున్నారు.

ఈ రోజుల్లో యువతలో పెద్దపేగు క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అందుకే వైద్యులు కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ సమస్యను త్వరగా గుర్తించక.. అది పెరిగి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తే బతికే అవకాశాలు సుమారు 10 శాతానికి పడిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే సకాలంలో చికిత్స ప్రారంభించాలని అంటున్నారు. 

తేలికపాటి లక్షణాలు..

పెద్దపేగు క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు చాలా తేలికగా ఉండటం వల్ల వీటిని తరచుగా లైట్ తీసుకుంటారు. కొన్నిసార్లు ఈ లక్షణాలు బాధాకరంగా ఉండవు. కాబట్టి ఈజీగా ఇగ్నోర్ చేస్తారు. బ్రిస్టల్‌లోని ది లాగోమ్ క్లినిక్‌లో జనరల్ ప్రాక్టీషనర్ అయిన డాక్టర్ జాక్ ఓగ్డెన్ ప్రకారం.. ఈ క్యాన్సర్ ఉంటే ప్రధానంగా ఈ ఐదు లక్షణాలు తరచుగా కనిపిస్తాయంటున్నారు. అవి పెద్దగా నొప్పిని కలిగించవని.. కానీ తప్పనిసరిగా శ్రద్ధ వహించాల్సిన కీలకమైన సంకేతాలు ఇవేనని అంటున్నారు. ఇంతకీ ఆ సంకేతాలు ఏంటంటే..

ఐరన్ లోపం

మొదటి లక్షణం ఐరన్ లోపం లేదా రక్తహీనత. కారణం తెలియని అలసట, పాలిపోయిన చర్మం, లేదా ఆయాసం వంటివాటిని తేలికగా తీసుకోకూడదు. కొన్నిసార్లు ఇది కణితి వల్ల కలిగే అంతర్గత రక్తస్రావం కారణంగా సంభవించవచ్చు. 

జీర్ణ సమస్యలు

తరచుగా మలబద్ధకం లేదా విరేచనాలు, లేదా నీళ్ల విరేచనాలు వంటి పేగు సంబంధిత సమస్యలు కూడా మరో లక్షణం. ఇది కణితి కారణంగా ప్రేగులలో అడ్డంకి మారుతుంది.

బరువు తగ్గడం

మూడవ లక్షణం ఏంటంటే.. ఎలాంటి ప్రయత్నం లేకుండా అకస్మాత్తుగా బరువు తగ్గుతారు. మీరు డైటింగ్ లేదా వ్యాయామం చేయకపోయినా.. వేగంగా బరువు తగ్గుతుంటే.. అది మీ శరీరంలో ఏదో సమస్యను సూచిస్తుంది. కొన్నిసార్లు కణితి కారణంగా శరీరం పోషకాలను సరిగ్గా గ్రహించలేదు. 

కడుపు నొప్పి

నాలుగవ లక్షణం కడుపునకు సంబంధించినది. ఉదాహరణకు నిరంతర నొప్పి, తిమ్మిర్లు, లేదా కొద్దిగా తిన్న తర్వాత కూడా కడుపు నిండినట్లు అనిపించడం. ఈ లక్షణం పేగుల సమస్యను కూడా సూచించవచ్చు.

మలంలో రక్తం

ఐదవ, అత్యంత ముఖ్యమైన లక్షణం మలంలో రక్తం పడటం. మలం నల్లగా లేదా ముదురు ఎరుపు రంగులో కనిపిస్తే.. అది శరీరంలో పైభాగంలో ఎక్కడో రక్తస్రావం జరుగుతోందని సూచించవచ్చు. ఇది కొన్నిసార్లు హెమరాయిడ్స్ (మొలలు) లేదా అనల్ ఫిషర్స్ వల్ల కూడా కలుగుతుంది. కానీ దీనిని నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం. 

ఈ లక్షణాలలో ఏవైనా ఎక్కువ కాలం కొనసాగితే.. వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. మల పరీక్షలు, ఇతర వైద్య పరీక్షలు అంతర్లీనంగా ఉన్న సమస్యను నిర్ధారించడంలో సహాయపడతాయి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget