అన్వేషించండి

AC Health Tips : ఏసీలో ఎక్కువ సమయం గడుపుతున్నారా? తలనొప్పి, అనారోగ్యం తప్పవు! జాగ్రత్తలు తీసుకోండి

AC Side Effects : ఎక్కువసేపు ఏసీలో కూర్చుంటే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఏసీలో కూర్చోవడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటో చూసేద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఎక్కువసేపు ఏసీలో ఉండటం వల్ల తలనొప్పి, గొంతునొప్పి వస్తాయి.
  • ఏసీ గాలి తేమను తగ్గించి, డీహైడ్రేషన్‌కు, తలనొప్పికి కారణమవుతుంది.
  • రక్తనాళాలు సంకోచించడం, సైనస్‌లలో రద్దీతో తల బరువుగా అనిపిస్తుంది.
  • ఏసీ ఉష్ణోగ్రత 24-26°C ఉంచాలి, నీళ్లు తాగాలి, విరామం తీసుకోవాలి.

Spending Too Much Time in AC : ఎండకాలం వచ్చేసింది. వేడిని తట్టుకోవడానికి ఎయిర్ కండిషనర్ల (ACల) వాడకం అనేది సర్వసాధారణమైపోయింది. ఇళ్ల నుంచి ఆఫీసుల వరకు, మాల్స్ నుంచి వాహనాల వరకు.. ప్రతిచోటా ACలను ఉపయోగిస్తున్నారు. వేడి నుంచి తప్పించుకోవడానికి ఎక్కువ సమయం ఏసీలో గడుపుతున్నట్లయితే.. మీరు మరింత జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. ఎందుకంటే దీనివల్ల అనేక దుష్ప్రభావాలు ఉన్నాయట. ఇది మిమ్మల్ని అనారోగ్యానికి గురిచేస్తుందని చెప్తున్నారు. 'సిక్ బిల్డింగ్ సిండ్రోమ్' వచ్చే ప్రమాదం పెరుగుతుందని అంటున్నారు.

ఆరోగ్యంపై ఏసీ ప్రభావం.. 

ఏసీలోని చల్లని గాలి ఉపశమనం కలిగించినప్పటికీ.. అది అసౌకర్యాన్ని కూడా కలిగిస్తుంది. అందుకే కొందరికి ఏసీ గదిలో ఉన్నందుకు తరచుగా తలనొప్పి, గొంతునొప్పి, జలుబు, పొడి చర్మం వంటి ఇబ్బందులు వస్తాయి. నిరంతరం పొడి, చల్లని గాలికి గురికావడం వల్ల మెదడుకు ఆక్సిజన్ సరిగ్గా అందదు. దీనివల్ల ఆయాసం, సైనస్ సమస్యలు, తల బరువుగా అనిపించడం వంటివి జరుగుతాయి. ఎక్కువసేపు ఏసీకి గురైతే.. తల బరువుగా అనిపించడం లేదా తలనొప్పి రావడం సర్వసాధారణంగా మారుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఏసీ వల్ల తల బరువుగా ఎందుకవుతుందంటే..

ఏసీలు గదిలోని తేమను పీల్చుకుని.. గాలిని చాలా పొడిగా చేస్తాయి. ఈ పొడి గాలి శరీరం నుంచి తేమను లాగేస్తుంది. దీనివల్ల డీహైడ్రేషన్ జరిగి తలనొప్పులు వస్తాయి. అలాగే శరీరం చాలా చల్లని గాలికి గురైనప్పుడు.. తనను తాను వెచ్చగా ఉంచుకోవడానికి రక్తనాళాలు సంకోచిస్తాయి. దీనినే వాసోకాన్‌స్ట్రిక్షన్ అని కూడా అంటారు. ఈ సంకోచ ప్రక్రియ తల, మెదడులో ఒత్తిడిని పెంచి.. తలనొప్పికి కారణమవుతాయి. 

చల్లని, పొడి గాలి ముక్కు, గొంతులోని శ్లేష్మ పొరలను పొడిబారేలా చేస్తుంది. దీనివల్ల సైనస్‌లలో వాపు లేదా రద్దీ ఏర్పడవచ్చు. ఇది తలనొప్పికి కూడా దారితీయవచ్చు. తక్కువ ఉష్ణోగ్రత, మూసి ఉన్న గదిలో ఉండటం వల్ల కండరాల బిగుతుగా మారి.. అలసటగా ఉంటుంది. దీనివల్ల తల బరువుగా ఉన్నట్లు అనిపిస్తుంది. 

నివారణ చర్యలు

ఈ సమస్యను దూరం చేసుకోవాలనుకుంటే.. ఏసీ ఉష్ణోగ్రతను మరీ తక్కువగా పెట్టకూడదని చెప్తున్నారు. సుమారు 24-26°C వద్ద ఉంచాలని సూచిస్తున్నారు. ఏసీలో ఉన్నప్పుడు నీళ్లు తాగుతూ ఉండాలని అంటున్నారు. అంతేకాకుండా గంటల తరబడి ఏసీలో కూర్చోవడం మానుకోవాలని.. మధ్యలో బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. అలాగే ఏసీ ఎయిర్ ఫిల్టర్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం కూడా ముఖ్యం.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Repeated Pregnancy : 13 సార్లు అబార్షన్.. 14వ సారి గర్భం దాల్చిన మహిళ.. తల్లి, బిడ్డ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
13 సార్లు అబార్షన్.. 14వ సారి గర్భం దాల్చిన మహిళ.. తల్లి, బిడ్డ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
DIY Body Scrub : ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
Dussehra Navratri Day 2 : దసరా స్పెషల్ రెండో రోజు శ్రీ గాయత్రి దేవికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రవ్వకేసరి, పులిహోర, కొబ్బరి అన్నం రెసిపీలు ఇవే
దసరా స్పెషల్ రెండో రోజు శ్రీ గాయత్రి దేవికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రవ్వకేసరి, పులిహోర, కొబ్బరి అన్నం రెసిపీలు ఇవే
Drumstick Chicken Curry : మునగకాయ చికెన్ కర్రీ రెసిపీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, రుచి అదిరిపోతుంది
మునగకాయ చికెన్ కర్రీ రెసిపీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, రుచి అదిరిపోతుంది

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Vijayawada Temple: రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
DIY Body Scrub : ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
Mamata Banerjee : బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
NDA Seat Sharing: స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
Hyderabad PRT: హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!
హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!
Embed widget