అన్వేషించండి

Hydration Tips for Summer : సమ్మర్‌లో నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా? అయితే ప్రమాదమే.. ఎంత తాగాలంటే

Overhydration Risks : వేసవికాలంలో ఎక్కువ దాహం వేస్తుంది. దీంతో చాలామంది ఎక్కువ నీళ్లు తాగితే సరిపోతుంది అనుకుంటారు. కానీ అలా తాగితే లాభం కాదు.. నష్టం అంటున్నారు నిపుణులు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వేసవిలో అతిగా నీళ్లు తాగడం వల్ల హైపోనాట్రేమియా ప్రమాదం.
  • అధిక నీటితో సోడియం స్థాయి తగ్గి, తల తిరగడం, వాంతులు వస్తాయి.
  • పుచ్చకాయ, కొబ్బరి నీరు వంటివి తాగితే సహజంగా హైడ్రేట్ అవ్వొచ్చు.
  • రోజంతా కొద్దికొద్దిగా నీరు తాగడం, బయటకు వెళ్లే ముందు తాగడం మంచిది.

Too Much Water Can Be Dangerous in Summer : వేసవికాలం(Summer 2026)లో చెమటలు ఎక్కువగా పడుతాయి. దీంతో శరీరం నీటిని త్వరగా కోల్పోతుంది. అందుకే చాలామంది ఎక్కువ నీళ్లు తాగడానికి ప్రయత్నిస్తారు. ఇది మంచి అలవాటే. కానీ అవసరానికి మించి నీళ్లు తాగడం కూడా ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెప్తున్నారు. మరి సమ్మర్‌లో ఎంత నీళ్లు తాగాలి? ఎంత తాగితే అది ఎక్కువ అవుతుంది? సరైన హైడ్రేషన్ కోసం ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం.

నీరు ఎక్కువ తాగుతున్నామని ఎలా తెలుసుకోవాలి?

సాధారణంగా రోజుకు 2.5 నుంచి 3.5 లీటర్ల వరకు నీళ్లు సరిపోతాయి. కానీ ఇది వ్యక్తి శరీరం, వాతావరణం, యాక్టివిటీపై ఆధారపడి ఉంటుంది. అలా కాకుండా తక్కువ సమయంలో 4–5 లీటర్లకు మించి తాగితే water intoxication వచ్చే అవకాశం ఉంది. చాలామంది తెలియక ఒకేసారి ఎక్కువ నీళ్లు తాగేస్తారు. ఇది కూడా ప్రమాదమేనని చెప్తున్నారు నిపుణులు. 

ఎక్కువ నీళ్లు తాగితే వచ్చే సమస్యలు

ఎక్కువ నీళ్లు తాగితే శరీరంలో కొన్ని సమస్యలు వస్తాయి. సోడియం లెవెల్స్ తగ్గిపోవడం, శరీరంలో సోడియం స్థాయి తగ్గడం వల్ల Hyponatremia అనే ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది. అధికంగా నీళ్లు తాగితే తల తిరగడం, వాంతులు, అలసట కలగవచ్చు. తరచూ బాత్రూమ్‌కు వెళ్లాల్సి వస్తుంది. ఇది ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌ను దెబ్బతీస్తుంది. కండరాలు బలహీనంగా మారి.. ప్రమాదకరం కావచ్చు. 

మరి సమ్మర్లో 2.5 నుంచి 3.5 వరకు నీటిని తాగితే సరిపోతుందా? హైడ్రేషన్ కోసం ఏ టిప్స్ ఫాలో అవ్వాలనే డౌట్ చాలామందికి ఉంటుంది. అలాంటప్పుడు హైడ్రేషన్ కోసం మంచి ప్లానింగ్ ఫాలో అవ్వాలి. 

హైడ్రేషన్ కోసం ఫాలో అవ్వాల్సిన టిప్స్

బలవంతంగా లీటర్ల కొద్దీ నీటిని తాగాల్సిన అవసరం లేదు. కాబట్టి నీటిని తక్కువగా తీసుకున్నా.. వాటర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవచ్చు. పుచ్చకాయ, దోసకాయ, కొబ్బరి నీరు వంటివి బెస్ట్ ఆప్షన్. ఇవి శరీరాన్ని కూల్‌గా ఉంచుతాయి. చెమటలు ఎక్కువగా పడితే శరీరానికి ఎలక్ట్రోలైట్స్ అందించాలి. ఆ సమయంలో కాస్త ఉప్పు, నిమ్మరసం కలిపిన నీరు తాగవచ్చు. ఒక్కసారిగా ఎక్కువగా కాకుండా రోజంతా కొంచెం కొంచెంగా తాగితే మంచిది. అలాగే బయటికి వెళ్లే ముందు నీళ్లు తాగండి. లేదంటే ఎండలోకి వెళ్లినప్పుడు శరీరం డీహైడ్రేట్ అయిపోతుంది. 

వేసవిలో నీళ్లు తాగడం చాలా ముఖ్యం. అలా అని ఎక్కువ తాగితే మంచిదనుకోవడం తప్పు. అవసరానికి మించి నీళ్లు తాగితే కూడా సమస్యలు వస్తాయని తెలుసుకోవాలి. అలాగే శరీరానికి అనుగుణంగా నీళ్లు అందించాలి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
Curry Leaves and Hair Oil : జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Embed widget