అన్వేషించండి

Diet for Weight Loss : ప్రపంచంలోనే అత్యంత బోరింగ్ డైట్ ఇదే.. కానీ నెలలో 5 నుంచి 10 కేజీల బరువు తగ్గిస్తుందట, ఎందుకంటే

CPB Diet : మార్కెట్లోకి ఓ కొత్త, బోరింగ్ డైట్ వచ్చింది. కానీ దీనిని నెలరోజులు ఫాలో అయినా మంచి ఫలితాలు చూస్తున్నారట. ఇంతకీ ఆ డైట్ ఏంటి? దానివల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • CPB డైట్: చికెన్, బంగాళాదుంప, బ్రోకలీతో బరువు తగ్గండి.
  • అధిక ప్రోటీన్, ఫైబర్ కడుపు నిండుగా ఉంచుతాయి.
  • ఆహార నియంత్రణ, శక్తి స్థాయిల పెరుగుదల సాధ్యం.
  • వైద్యుని సలహాతో పోషకాహార లోపం నివారించవచ్చు.

CPB Diet for Weight Loss : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక డైట్ చాలా వేగంగా వైరల్ అవుతోంది. దీనిని ప్రపంచంలోనే అత్యంత బోరింగ్ డైట్ అని పిలుస్తున్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇది ఎంత బోరింగ్‌గా ఉందో.. అంతే వేగంగా బరువు తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తుందట. సాధారణంగా బరువు తగ్గాలని, ఫిట్గా ఉండాలని.. చాలామంది కొత్త డైట్‌లు ప్రారంభిస్తారు. కానీ కొన్ని రోజుల్లోనే దానిని వదిలేస్తారు. ఎందుకంటే అవి చాలా కష్టంగా ఉంటాయి. లేదా తినడానికి రుచిగా ఉండవు. కానీ ఈ డైట్ వాటికి భిన్నంగా ఉంటుంది. ఈ సింపుల్ డైట్ పేరు CPB డైట్. ఇందులో చికెన్, బంగాళాదుంప, బ్రోకలీ వంటి కొన్ని పదార్థాలు మాత్రమే తింటారు. వినడానికి ఇది చాలా సాధారణంగా అనిపించవచ్చు. కానీ దాని ఫలితాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి.

CPB డైట్ అంటే.. 

CPB డైట్ అంటే Chicken (చికెన్), Potato (బంగాళాదుంప), Broccoli (బ్రోకలీ). ఈ డైట్ చాలా సులభమైన నియమాలపై ఆధారపడి ఉంటుంది. ప్రోటీన్ కోసం చికెన్ (శాఖాహారులకు టోఫు), కార్బోహైడ్రేట్ల కోసం బంగాళాదుంప, కూరగాయలలో బ్రోకలీ, క్యారెట్లు. ప్రతి భోజనంలో 1 టీస్పూన్ ఆలివ్ ఆయిల్ ఉపయోగిస్తారు. తాగడానికి నీరు, బ్లాక్ కాఫీ లేదా టీ మాత్రమే ఉంటాయి. ఇందులో జంక్ ఫుడ్, స్వీట్లు, కోల్డ్ డ్రింక్స్ లేదా ప్రాసెస్ చేసిన ఆహారం పూర్తిగా దూరం పెట్టేయాలి.

ఈ డైట్ ఎందుకు మంచి రిజల్ట్స్ ఇస్తుందంటే..

ఈ డైట్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో అధిక ప్రోటీన్, అధిక ఫైబర్ ఉంటుంది. దీనివల్ల కడుపు ఎక్కువ కాలం నిండుగా ఉంటుంది. కడుపు నిండినట్లు అనిపించినప్పుడు.. మీరు తక్కువ తింటారు. ఎక్కువ ప్రయత్నం చేయకుండానే బరువు తగ్గడం ప్రారంభమవుతుంది. అదనంగా బంగాళాదుంప కడుపు నింపడానికి చాలా సహాయపడుతుంది. బ్రోకలీ, క్యారెట్లు తక్కువ కేలరీలలో ఎక్కువ మొత్తంలో అందిస్తాయి. చికెన్ శరీరానికి శక్తినిస్తుంది. అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే మీరు కేలరీలను లెక్కించాల్సిన అవసరం లేదు.

ఎలాంటి బెనిఫిట్స్ పొందవచ్చు..

ఈ డైట్‌ను అనుసరిస్తున్న వారి ప్రకారం.. వారి బరువు వేగంగా తగ్గింది. ఫుడ్ క్రేవింగ్స్ చాలావరకు తగ్గాయట. మనస్సు ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉందని తెలిపారు. అలాగే శక్తి స్థాయిలు మెరుగైనట్లు వెల్లడించారు. కొంతమంది ఒక నెలలో 5 నుంచి 10 కిలోల వరకు బరువు తగ్గినట్లు కూడా పేర్కొన్నారు.

30 రోజుల సులభమైన ప్రణాళిక

ఈ డైట్‌ను మరింత సులభంగా చేసుకునేందుకు 30 రోజుల ప్రణాళిక ఫాలో అవుతారు. మొదటి వారం కేవలం ప్రాథమిక CPB ఫుడ్. రెండవ వారం పాలకూర లేదా తక్కువ కొవ్వు మాంసం వంటి కొన్ని కొత్త ఆహారాలను యాడ్ చేయడం. మూడవ వారం పండ్లు, డ్రై ఫ్రూట్స్ చేర్చడం. ఇది డైట్‌ను కొంచెం సులభతరం చేస్తుంది. దీనివల్ల ఎక్కువ కాలం పాటు డైట్ ఫాలో అవ్వగలుగుతారు. ఇలా మీకు అనుకూలంగా ఈ డైట్ మార్చుకోవచ్చు. 

లోపాలు ఉంటాయా?

ఈ డైట్ ప్రభావవంతంగా ఉన్నప్పటికీ.. కొన్ని లోపాలు కూడా ఉండవచ్చు. ఒకే రకమైన ఆహారం తినడం వల్ల బోరింగ్‌గా అనిపించడం, పోషకాహార లోపం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు, చాలా వేగంగా బరువు తగ్గడం వల్ల బలహీనత వంటివి ఉండవచ్చు. కాబట్టి ఈ డైట్ ఫాలో అయ్యే ముందు కచ్చితంగా వైద్యుల సూచనలు తీసుకుంటే మంచిది. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Korean Beauty Secrets : కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
Curry Leaves and Hair Oil : జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget