ఇవి తింటే యూరిక్ యాసిడ్ పెరుగుతుందట.. జాగ్రత్త

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

చాలా మంది మాంసం, చేపలు వంటివి ఇష్టంగా తింటారు. వీటిలో ప్యూరిన్ అనే మూలకం ఉంటుంది.

Image Source: pexels

దీనివల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. అయితే ఇది ఎక్కువగా ఉండటం కూడా ప్రమాదకరంగా ఉంటుంది.

Image Source: pexels

ఒకవేళ శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే కీళ్ల నొప్పులు, గౌట్, కిడ్నీలో రాళ్లు వంటి సమస్యలు వస్తాయి.

Image Source: pexels

యూరిక్ ఆమ్లం పెరగడానికి ప్రధాన కారణం శరీరంలో ప్యూరిన్ ప్రోటీన్ అధికంగా ఉండటం. ఇది వేటివల్ల వస్తుందో చూసేద్దాం.

Image Source: pexels

ఇది ప్రధానంగా ఎక్కువ రెడ్ మీట్, సీ ఫుడ్, మద్యం సేవించడం, తక్కువ నీరు తాగడం వల్ల వస్తుంది.

Image Source: pexels

ఊబకాయం, అధిక రక్తపోటు, శరీరంలో ఐరన్ అధికంగా ఉండటం, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉండటం లేదా మధుమేహం వంటి కారణాల వల్ల కూడా ఇది సంభవిస్తుంది.

Image Source: pexels

అంతేకాకుండా బీరు ఎక్కువగా తాగడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుతుంది.

Image Source: pexels

కొన్ని కూరగాయలు, పాలకూర, కాలిఫ్లవర్, పుట్టగొడుగులు వంటి వాటిలో ప్యూరిన్ ఉంటుంది. కాబట్టి వాటిని తక్కువ మోతాదులో తీసుకోవాలి.

Image Source: pexels

అలాగే కేక్, పేస్ట్రీ వంటి తీపి, బేకరీ వస్తువుల వల్ల కూడా సమస్యలు వస్తాయి.

Image Source: pexels