అన్వేషించండి

Heart Risk in Children : పిల్లల్లో పెరుగుతోన్న గుండె సమస్యలు.. స్క్రీన్ సమయమే కారణం అంటోన్న తాజా అధ్యయనం

Kids Using Screens Too Much : పిల్లల్లో స్క్రీన్ సమయం పెరిగితే గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుందని తాజా అధ్యయనం తెలిపింది. మరెన్నో షాకింగ్ విషయాలు వెల్లడించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • స్క్రీన్ సమయం తగ్గించి, శారీరక శ్రమను ప్రోత్సహించడం ముఖ్యం.

Screen Time and Heart Health : నేటి డిజిటల్ యుగంలో పిల్లల జీవనశైలి వేగంగా మారుతోంది. హోంవర్క్ నుంచి బ్రేక్ సమయం వరకు, నిద్రపోయే ముందు, ఆన్‌లైన్ క్లాసులు, గేమింగ్, స్ట్రీమింగ్ కోసం స్మార్ట్‌ఫోన్‌లను చాలామంది పిల్లలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల పిల్లల స్క్రీన్ సమయం వేగంగా పెరుగుతోంది. అయితే ఎక్కువ స్క్రీన్ చూడడం వల్ల కేవలం కళ్లు, మెదడుపైనే కాకుండా.. గుండె ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తుందని షాకింగ్ విషయాన్ని తెలిపింది తాజా అధ్యయనం తెలిపింది. 

ఖాళీ సమయంలో స్క్రీన్‌పై గడిపే ప్రతి అదనపు గంట.. సోషల్ మీడియాను స్క్రోల్ చేయడం, వెబ్ సిరీస్‌లను చూడటం లేదా గేమ్‌లు ఆడటం వంటివి పిల్లలలో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని తాజా అధ్యయనం తెలిపింది. అసలు ఇది ఎంతవరకు నిజం? అధ్యయనంలో ఉన్న అంశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం?

అధ్యయనం ఏమి చెబుతోందంటే..

జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌లో ప్రచురించిన తాజా పరిశోధన ప్రకారం.. పిల్లలు, కౌమారదశలో ఉన్నవారిలో ప్రతి అదనపు గంట స్క్రీన్ టైమ్ వారి కార్డియో మెటబాలిక్ ప్రమాదాన్ని, అంటే గుండె, జీవక్రియకు సంబంధించిన ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ పరిశోధనలో 1000 మందికి పైగా పిల్లలు, యువకులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా 6 నుంచి 10 సంవత్సరాల పిల్లలలో స్క్రీన్ కోసం వెచ్చించే ప్రతి అదనపు గంట గుండె ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలో తేలింది. కౌమారదశలో ఇది మరింత ఎక్కువగా కనిపించిందని అంటున్నారు. దీనితో పాటు ఎక్కువ స్క్రీన్ సమయం అనేది నిద్ర లేమితో కూడా నేరుగా ముడిపడి ఉందని గుర్తించారు.

నిద్రతో డైరక్ట్ లింక్..

తక్కువ నిద్రపోయే పిల్లలలో గుండెపోటు ప్రమాదం ఎక్కువగా పెరుగుతుందని అధ్యయనంలో తేలింది. అర్ధరాత్రి వరకు స్క్రీన్ చూడటం వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది. ఇది శరీర జీవక్రియపై ప్రభావం చూపుతుంది. పరిశోధన ప్రకారం.. స్క్రీన్ సమయం, హార్డ్ డిస్క్‌ల మధ్య 12 శాతం సంబంధం నిద్ర లేమి ద్వారా ఏర్పడుతుంది. అంటే పిల్లలు బాగా నిద్రపోతే కొంతవరకు ప్రమాదాన్ని తగ్గించవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎక్కువ కాలం స్క్రీన్ ముందు కూర్చోవడం పిల్లల శారీరక శ్రమను తగ్గిస్తుంది. ఇది బరువు పెరగడం, రక్తపోటు, చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ పెరగవచ్చు. ఇవన్నీ గుండె జబ్బులకు కారణం కావచ్చు.

ఇండియాలో పెరుగుతోన్న ఆందోళన 

భారతదేశంలో కూడా పిల్లల్లో స్క్రీన్ సమయం వేగంగా పెరిగింది. ముఖ్యంగా ఆన్‌లైన్ విద్య, స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం తర్వాత ఈ సమయం ఎక్కువైంది. కాబట్టి ఈ అధ్యయనం భారతీయ కుటుంబాలకు కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కూడా పిల్లల నిద్ర, కార్యాచరణపై ప్రభావం కనిపిస్తుంది.

అయితే దీనిగురించి నిపుణులు మాట్లాడుతూ.. పిల్లల జీవనశైలిలో చిన్న మార్పులు చేయడం ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చని అంటున్నారు. ప్రతిరోజూ స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయడం.. నిద్రపోయే ముందు స్క్రీన్ నుంచి దూరంగా ఉండటం, పిల్లలను ఆటలు, శారీరక శ్రమ కోసం ప్రోత్సహించడం, ఇంట్లో కొంత సమయం, ప్రదేశాన్ని స్క్రీన్ లేకుండా ఉంచడం వంటి వాటితో ఈ రిస్క్ తగ్గించుకోవచ్చు.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

NDA Convenor Chandrababu?: ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Embed widget